అంతర్జాతీయం

ఐరాస కొత్త సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 5: ఐక్యరాజ్య సమితీ తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టెర్స్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన రహస్య పోలింగ్‌లో గట్టర్స్ విజయావకాశాలు మరింతగా బలపడ్డాయి. గురువారం ఇందుకు సంబంధించి లాంఛనంగా భద్రతా మండలిలో ఓటింగ్ జరుగుతుందని, అనంతరం ఆంటోనియో ఎన్నికను ధృవీకరిస్తారని రష్యా రాయబారి విటాలే చుర్కిన్ తెలిపారు. ప్రస్తుత బాన్‌కీ మూన్ స్థానే రానున్న ఐదేళ్ల పాటు ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యే ఆంటోనియో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నేటి ఓటింగ్‌లో ఆంటోనియోకు నాలుగు వీటో దేశాలతో పాటు 13సానుకూల ఓట్లు లభించాయి. రెండు దేశాలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఐరాస కొత్త సెక్రటరీ జనరల్ పదవీ కాలం జనవరి 1 నుంచి మొదలు అవుతుంది.