అంతర్జాతీయం

క్షణక్షణం ఉత్కంఠే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా 45వ అధ్యక్ష పదవి ఎవరిని అలంకరించనున్నది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికలు భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30గంటలకు అధికారికంగా మొదలై, బుధవారం ఉదయం 10.30 గంటలకు ముగుస్తాయి. ఎన్నికలు జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడుతూనే ఉన్నాయి.
అయితే తుది ఫలితం మాత్రం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3గంటలకు అంటే మన భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30గంటలకు(తెల్లవారితే గురువారం) ప్రకటిస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు నవంబర్ రెండో మంగళవారం నాడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. 1845వ సంవత్సరం నుంచి అమెరికాలో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అమెరికాలో నవంబర్ మాసం గ్రామీణ కార్మికులకు అత్యంత సౌకర్యవంతమైన మాసం. ఓటు వేసేందుకు వివిధ నగరాలకు ప్రయాణించేందుకు అనుకూలమైన నెల. అంతే కాదు వ్యాపారులు బిజీబిజీగా గడిపే ఆల్‌సెయింట్స్ డేతో ఇబ్బంది రాకుండేందుకు కూడా ఈ నెలను ఎన్నికలకు అనుకూల మాసంగా నిర్ణయించారు.
భారత కాలమానం ప్రకారం ఆ యా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసే సమయం.
* బుధవారం ఉ. 4.30: ఇండియానా, కెంటకీ
*ఉ. 5.30: ఫ్లోరిడా, వర్జీనియా, జార్జియా, దక్షిణ కరోలినా, వెర్మొంట్
*ఉ. 6.00: ఓహియో, ఉత్తర కరోలినా, దక్షిణ వర్జీనియా
*ఉ. 6.30: పెన్సిల్వేనియా, మిచిగాన్, అలబామా, కనెక్టికట్, డేలావేర్, కొలంబియా జిల్లా, ఇల్లినాయిస్, కెన్సాస్, మైనె, మేరీలాండ్, మసాచుసెట్స్, మిసిసిపి, మిస్సోరి, న్యూజెర్సీ, ఓక్లహామా, రోడ్ ఐలాండ్, టెనె్నస్సీ
*ఉ. 7.30: కొలరాడో, విస్నాన్సిన్, టెక్సాస్, లూసినా, మినె్నసోటా, నెబ్రాస్కా, న్యూ మెక్సికో, న్యూయార్క్, దక్షిణ డకోటా, వ్యోమింగ్
*ఉ. 8.30: అరిజోనా, ఉదాహో, మోన్టానా, నెవాడా, ఉటా, లోవా
*ఉ. 9.30: కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఓరెగాన్, ఉత్తర డకోటా
*ఉ. 10.30: అలాస్కా, హవాయి
ఫలితాలు పూర్తిగా వెలువడిన తరువాత ఇద్దరు అభ్యర్థుల ప్రసంగాలతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.