క్రీడాభూమి

విదేశీ పిచ్‌లపై అశ్విన్ రాణిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: స్వదేశంలో అద్భుతంగా బౌల్ చేస్తూ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేసే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విదేశాల్లోనూ అదే స్థాయిలో రాణిస్తాడా? స్వదేశంలో మాదిరిగానే విదేశీ టూర్లలోనూ అశ్విన్ వికెట్లు సాధిస్తాడా? జట్టుకు చిరస్మరణీయ విజయాలను సాధించిపెడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ స్పష్టం చేశాడు. అశ్విన్ విదేశాల్లో ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో, ఎంత వరకూ అద్భుతాలు సృష్టిస్తాడో చెప్పడానికి తన పరిధి సరిపోదని బుధవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వ్యాఖ్యానించాడు. విదేశాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుందని, అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయని వివరించాడు. స్వదేశంలో 26 టెస్టుల్లో సగటున 20 పరుగులకో వికెట్‌ను సాధించిన అశ్విన్ విదేశాల్లో 17 టెస్టులు ఆడి, సగటున 33.28 పరుగులిచ్చాడు. దీనిని బట్టి అతని బౌలింగ్ విశే్లషణ భారత్‌లో మెరుగ్గా ఉందని, విదేశాల్లో అదే విధమైన ప్రతిభ కనబరచలేకపోతున్నాడని స్పష్టమవుతుంది. అయితే, ఈ గణాంకాలపై వ్యాఖ్యానించడానికి కార్తీక్ నిరాకరించాడు. విదేశీ జట్లు అక్కడి దేశవాళీ పోటీలతోపాటు టెస్టుల్లో వాడే బంతులు వేరని తెలిపాడు. మన దేశంలో ఎస్‌జి బంతులతో ఆడిన వారు విదేశాల్లో కూకబూరా బంతులతో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతారన్నది వాస్తవమని అన్నాడు. తనకు తెలిసినంత వరకూ విదేశీ పిచ్‌లకు అలవాటు పడడం అశ్విన్‌కు కష్టం కాదన్నాడు. అన్ని రకాలైన పిచ్‌లపై అతను ఒకే రీతిలో బంతులు వేయగలడని, కాబట్టి విదేశాల్లోనూ అతను జట్టుకు విజయాలను సాధించిపెట్టగలడని వ్యాఖ్యానించాడు.
ఆండర్సన్ విమర్శలు హాస్యాస్పదం: రాజ్‌కుమార్
విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. కోహ్లీకి చిన్నతనంలో కోచ్‌గా వ్యవహరించిన శర్మ బుధవారం పిటిఐతో మాట్లాడుతూ ఆండర్సన్‌కు ఒకరిని విమర్శించే స్థాయి లేదని వ్యాఖ్యానించాడు. ‘ముందు నీ ఆటను సరిదిద్దుకో.. నీ పని నువ్వు చూసుకో.. కోహ్లీని విమర్శించడం అవివేకం’ అంటూ మండిపడ్డాడు. కోహ్లీ స్వదేశంలోనే రాణిస్తాడని, విదేశాల్లో అతను ఈ స్థాయిలో ఆడలేదని ఆండర్సన్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని, అతను ఆడే విధంగా విదేశీ పిచ్‌లపై పనికిరాదని అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలిలో శాస్ర్తియత లోపించిందని విమర్శించాడు. అయితే, అతని వ్యాఖ్యలను రాజ్‌కుమార్ తోసిపుచ్చాడు. ఫాస్ట్ పిచ్‌లకు సహకరించే ఆస్ట్రేలియాలో కోహ్లీ ఐదు టెస్టు సెంచరీలు సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సునీల్ గవాస్కర్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడని రాజ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. ఈసిరీస్‌లో కోహ్లీ ఇంత వరకూ 640 పరుగులు సాధించాడు. చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే చివరి టెస్టులో అతను 136 పరుగులు చేస్తే, ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయుడిగా గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. 1971లో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినప్పుడు గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 774 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతనికి అదే తొలి టెస్టు సిరీస్ కావడం గమనార్హం. కాగా, గవాస్కర్ నెలకొల్పిన రికార్డుకు కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. చెన్నై టెస్టులో అతను గవాస్కర్‌ను రెండో స్థానానికి నెట్టేసే అవకాశాలున్నాయి.

వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో
సింధు శుభారంభం
దుబాయ్, డిసెంబర్ 14: ఇక్కడ ప్రారంభమైన బాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు శుభారం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అకానే యమాగుచీని 12-21, 21-8, 21-18 తేడాతో ఓడించి ముం దంజ వేసింది. మొదటి సెట్‌ను కోల్పోయనప్పటికీ, ఆతర్వాత ఎదురుదాడికి దిగిన సింధు మిగతా రెండు సెట్లను సొంతం చేసుకుంది. ఇటీవల చైనా సూ పర్ సిరీస్‌ను సాధించిన సింధు ఆతర్వాత హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిం ది. ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేసే వరల్డ్ సూపర్ సిరీస్‌లో ఆమె ఫే వరిట్‌గా బరిలోకి దిగింది. అకానే చేతిలో మొదటి సెట్‌లో ఓడిన వెంటనే, ఆమె ఫామ్‌పై అనుమానాలు తలెత్తాయ. కానీ, రెండో సెట్‌ను సింధు సుల భంగానే గెల్చుకుంది. చివరిదైన మూడో సెట్‌లో కొంత వరకూ ప్రతిఘటన ఎదురైనప్పటికీ, దానిని కూడా తన ఖాతాలో వేసుకుంది.