తెలంగాణ

పాలనలో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన ఏడాదిలోనే ప్రగతి పునాదులు
కొత్త ఏడాదిలోనూ అదే ఒరవడి చూపుతాం
ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా
రాష్ట్భ్రావృద్ధిపై అమాత్యుల్లోనూ ధీమా

తెలంగాణ సరైన దిశలోనే ప్రగతి పరుగు తీస్తోంది. 2016లో తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. 2017లో అదే ఒరవడిని కొనసాగించి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ సరైన దిశలో అభివృద్ధి సాధిస్తోంది. 2016లో తెలంగాణకు బలమైన పునాదులు పడ్డాయి. 2017లో అదే దారిలో పయనిస్తున్నాం అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో 2016లోనే బలమైన పునాదులు పడ్డాయని, కొత్త ఏడాదిలోనూ ఇదే ప్రగతి ఒరవడి సాగేలా చూడాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు. 2016లో ఆశించిన మేరకు అభివృద్ధి సాధించామని గడచిన ఏడాదిని సన్నిహితులు, సహచరుల వద్ద గుర్తు చేసుకున్నారు. ఏడాది చివరిలో కరెన్సీ రద్దు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా, అభివృద్ధికి అడ్డుకాలేదన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండటం వల్ల తెలంగాణకు రావలసిన బకాయిలు సక్రమంగానే వస్తున్నాయన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి చికాకులు లేకపోవడంతో, తెలంగాణ సత్వర అభివృద్ధికి కేంద్రం నుంచి ఆశించిన సాయం అందుతోందని అభిప్రాయపడ్డారు. ఈసారి మెరుగైన వర్షపాతంతో తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న భావన వ్యక్తం చేశారు. కేంద్రం విధించే పన్నుల్లో రాష్ట్రం వాటాను గతంలో తగ్గించిన కేంద్రం, కరెన్సీ రద్దు పరిణామాల తరువాత తిరిగి పెంచడమే కాకుండా పాత బకాయిలు సైతం చెల్లించడంపై రాష్ట్రం ఆనందంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. కేంద్రం నుంచి పన్నుల వాటా కింద ప్రతి నెల 997 కోట్లు రావాల్సి ఉంటే, కేంద్రం హఠాత్తుగా దాదాపు ఐదువందల కోట్ల వరకు కోత విధించింది. ఇదే సమయంలో కరెన్సీ రద్దుతో రాష్ట్ర సర్కారు తీవ్ర ఆందోళనకు గురైంది. ఇటు గవర్నర్, అటు ప్రధాని దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లారు. తరువాతి పరిణామాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థికంగా పూర్తి మద్దతు లభించింది.
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోనూ కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అడ్డంకులు తొలగిపోవడం రాష్ట్రానికి మంచి పరిణామమని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్లు కేటాయిస్తున్నందున అనుకున్న మేరకు ప్రాజెక్టులు నిర్మించగలమన్న ధీమా ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ సమీక్షలోనూ సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి అడ్డుంకులు లేవని, నిధుల కోరత లేదని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచిస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడం పట్ల సిఎం కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలకు ఏ ఒక్క అంశం కూడా లేదని అభిప్రాయపడ్డారు. విపక్షాలు 20 రోజులపాటు సమావేశాలు నిర్వాహించాలని డిమాండ్ చేస్తే, నెలపాటు సమావేశాలు నిర్వహించేందుకు సిఎం సిద్ధమయ్యారంటే ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో అర్థమవుతోందని మంత్రులు అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరగడం అధికార పక్షానికే మేలని మంత్రులు చెబుతున్నారు. రెండున్నరేళ్లలో అన్ని శాఖల్లో, విభాగాల్లో జరిగిన అభివృద్ధిని సభలో చెప్పుకోవడానికి అవకాశం లభించిందని చెబుతున్నారు.
కొత్త సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సిఎం కె చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందంగా, ఉత్సాహంతో కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2016లో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని, అదే స్ఫూర్తితో 2017లో విజయాలు సాధిస్తామని ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు భరోసానిచ్చారు.