అంతర్జాతీయం

హర్నీశ్ హత్య ఎంతో బాధించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్/ న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికాలో హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యతో మొదలయిన జాతి విద్వేష దాడులు కొనసాగుతుండటం పట్ల భారతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతాన్ని మరువక ముందే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం లాంకస్టర్‌లో హర్నీశ్ పటేల్ అనే భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయుడయిన వ్యాపారవేత్త హత్యకు గురికావడం, వాషింగ్టన్‌లోని కెంట్‌లో దీప్ రాయ్ అనే భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయుడు జాతి విద్వేష దాడిలో తీవ్రంగా గాయపడటం సర్వత్రా కలవరం సృష్టిస్తోంది. హర్నీశ్ పటేల్ హత్య తనను ఎంతో బాధించిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మన కాన్సుల్ లాంకస్టర్‌కు వెళ్లి పటేల్ కుటుంబాన్ని కలిశారని ఆమె తెలిపారు. మృతుడు పటేల్‌కు తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కూచిభొట్లను బలితీసుకున్న జాతి విద్వేష దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌లో చేసిన తొలి ప్రసంగంలో తీవ్రంగా ఖండించిన రెండు రోజులకే హర్నీశ్ పటేల్ దారుణ హత్యకు గురయ్యారు. ఇదిలా ఉండగా, కెంట్‌లో దీప్ రాయ్‌పై జరిగిన దాడి పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి తండ్రి సర్దార్ హర్‌పాల్ సింగ్‌తో తాను మాట్లాడానని, తన కుమారుడు భుజంలో తూటా దిగి గాయపడ్డాడని అతను చెప్పారని సుష్మా స్వరాజ్ ఆదివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. దీప్ రాయ్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆమె తెలిపారు.
జాతి విద్వేష దాడిగా కేసు పెట్టాలి
కెంట్‌లో దీప్‌రాయ్‌పై జరిగిన దాడిపై సిక్కు వ్యతిరేక జాతి విద్వేష దాడిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపించాలని సిక్కు హక్కుల సంఘం అమెరికా అధికారులను కోరింది. వివక్ష నిరోధక చట్టాలను మెరుగుపరచాలని కూడా స్థానిక నాయకులతో కలిసి సిక్కు కొయలీషన్ స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ అధికారులను కోరింది.