అంతర్జాతీయం

కువైట్‌లో భారీ వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువైట్ సిటీ, మార్చి 8: కువైట్‌లో పురాతన సిల్క్ రోడ్డు వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించేందుకు దేశంలోని మారుమూల సుబియా ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం దాదాపు 36 కిలోమీటర్ల(22 మైళ్ల) పొడవైన వంతెనను నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుబియా ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేయడంలో భాగంగా అక్కడ స్వేచ్ఛా వాణిజ్య మండలిని ఏర్పాటు చేయడం ద్వారా గల్ఫ్ ప్రాంతాన్ని మధ్య ఆసియా, ఐరోపా ప్రాంతాలను అనుసంధానం చేయడం కోసం ఈ వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నారు. దాదాపు300 కోట్ల డాలర్ల (90.4 కోట్ల దిర్హామ్‌లు) వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన దాదాపు మూడు వంతులు నీటిలోనే ఉంటుంది. సిల్క్ సిటీ ప్రాజెక్టు కోసం సిబియా ప్రాంతాన్ని పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్న కువైట్ ప్రభుత్వం అక్కడ ఇప్పటికే 5 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మూడు వంతులు పూర్తయిన ఈ వంతెన నిర్మాణం జరిగితే కువైట్ సిటీ, సుబియాల మధ్య ప్రయాణ సమయం 20-25 నిమిషాలకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ దూరానికి 90 నిమిషాల సమయం పడుతోంది. కాగా, ఈ వంతెనకు గత ఏడాది జనవరిలో మృతి చెందిన కువైట్ ఎమిర్ షేక్ జబెర్ అల్-అహ్మద్ అలా సబా పేరు పెట్టారు. కువైట్ ప్రభుత్వ రాబడిలో 95 శాతంగా ఉండే చమురు రాబడి గణనీయంగా తగ్గిపోయినప్పటికీ ఎమిరేట్ మాత్రం ఈ ప్రాజెక్టు కోసం భారీగానే నిధులు ఖర్చు చేస్తూ వస్తోంది.