అంతర్జాతీయం

ఇక శూన్య పదార్థం గుట్టువిప్పే కొత్త టెక్నిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 9: విశ్వమంతా ఆవహించిన శూన్య పదార్థం ఆనుపానులు తెలుసుకునే దిశగా శాస్తవ్రేత్తలు ఓ బలమైన ముందడుగు వేశారు. పూర్తిగా అంతుబట్టని ఈ శూన్య పదార్థం ఆవహించి వున్న స్వల్ప నక్షత్ర మండలాలను గుర్తించేందుకు అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టింది. భారత్ సంతతికి చెందిన అమెరికా శాస్తవ్రేత్త సుకన్యా చక్రవర్తి సారథ్యంలోని ఈ బృందం మరుగుజ్జు గెలాక్సీలను గుర్తించడం ద్వారా ఈ శూన్య పదార్థం ఉనికిని తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా గెలాక్సీల మధ్యలో ఉండే అంతర్గత ద్రవ్యరాశి దాని నిర్మాణంలో తలెత్తే కొన్ని రకాలు తరంగాల ఆధారంగా శూన్య పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చని ఈ బృందం తెలిపింది. భూ కంపాలను గుర్తించేందుకు ఏ రకమైన ప్రక్రియను అనుసరిస్తారో అదే రకమైన టెక్నిక్ ద్వారా శూన్య పదార్థ ఉనికిని కూడా తెలుసుకోవచ్చని చక్రవర్తి స్పష్టం చేశారు.

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షలకు నిరసనగా శనివారం
సియోల్‌లో నిరసన తెలుపుతున్న దక్షిణ కొరియన్లు

రాజస్థాన్‌లోని బికనీర్‌లో శనివారం ప్రారంభమైన 23వ ‘అంతర్జాతీయ కామెల్ ఫెస్టివల్’లో
ఒంటె చేత విన్యాసాలు చేయస్తున్న దృశ్యం.