అంతర్జాతీయం

ఆధార్‌తో తగ్గిన అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 14: భారత్‌లో ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడాన్ని, వాటివల్ల వస్తున్న సత్ఫలితాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఆధార్ కార్డులను ప్రవేశపెట్టడం వల్ల దేశంలో అవినీతి తగ్గిందని, ఫలితంగా భారత ప్రభుత్వానికి ఏటా సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ.650 కోట్లు) ఆదా అవుతోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. వివిధ కార్యకలాపాలను సమీకృతం చేయడానికి, సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతోందని పేర్కొంది. డిజిటల్ టెక్నాలజి వల్ల చేకూరిన సత్ఫలితాలపై రూపొందించిన ఒక నివేదికను ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు ఇక్కడి బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భారత్‌లో ఆధార్ గుర్తింపు కార్డులు దాదాపు వంద కోట్ల మంది వరకు చేరాయని, ఫలితంగా ప్రజలు వీరిలో అధికులు పేదలు సులభంగా ప్రభుత్వ సేవలను పొందుతున్నారని తెలిపారు. ఆధార్ కార్డుల జారీవల్ల భారత ప్రభుత్వం మరింత సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతోందని ఆయన చెప్పారు. భారత్ తన మొత్తం జనాభా 125 కోట్లకు ఆధార్ కార్డులను జారీ చేసే పథంలో కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.