అంతర్జాతీయం

కోర్టు ప్రాంగణంలో ఆత్మాహుతి దాడి పాక్‌లో 17 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని షాబ్‌ఖదర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. కనీసం 30 మంది గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్ హంతకుడి ఉరిశిక్షను ప్రతికారంగా నిషేధిత తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్(టిటిపి) ఈ ఘాతుకానికి పాల్పడింది. ఖైబర్- ఫఖ్తున్‌ఖ్వాలోవని ఛార్‌సద్దా జిల్లాలోని షాబ్‌ఖదర్‌లో కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు 17 మృతి చెందారని జిల్లా పోలీసు అధికారి సొహాయిల్ ఖలీద్ తెలిపారు. దాడి తమ పనేనని జమతుల్ అరార్ నాయకత్వంలోని టిటిపి ప్రకటించుకుంది. తసీర్ హంతకుడు ముంతాజ్ ఖాద్రీ ఉరిశిక్షకు ప్రతికారంగా పేలుళ్లు సృష్టించినట్టు చెప్పారు. మరణశిక్షను సవాల్ చేస్తూ ఖాద్రీ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో గత గురువారం రావల్పిండి జైలులో అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. రద్దీగా ఉండే కోర్టు ప్రాంగణంలో పేలుడు జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతాదళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయ. దాడి జరిగిన షాబ్‌ఖదర్ తాలూకా ప్రాంతం మహ్మండ్ గిరిజన ప్రాంతానికి ఆనుకునే ఉంటుంది. పాక్షిక స్వయంప్రతిపత్తిగల ఏడు గిరిజన ప్రాంతాల్లో మహ్మండ్ ఒకటి. తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాదులు గట్టిపట్టున్న ప్రాంతం కూడా. జనవరి 20న ఛార్‌సద్దాలోని యూనివర్శిటీపై ఉగ్రవాదులు దాడి చేసి 21 మందిని బలితీసుకున్నారు. దాడి జరిగిన ప్రాంతం ఛార్‌సద్దాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు పేర్కొన్నారు. పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ వద్ద బాడీగార్డుగా ఉన్న ఖాద్రీ 2011లో హత్యచేశాడు. అదే ఏడాది అతడిని కోర్టు దోషిగా తీర్పునిచ్చింది. ఖాద్రీ ఉరిని అమలుచేసినందుకు వేలాదిమంది నిరసన దినంగా పాటించారు.
chitram..
పేలుడు జరిగిన ప్రాంతంలో కాపలా కాస్తున్న పాక్ సైనికుడు