అంతర్జాతీయం

ఆధిక్యతను మరింత పెంచుకున్న ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెట్రాయిట్: అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో తన సొంత పార్టీవారినుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటివరకు ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ బుధవారం మరో మూడు ప్రైమరీలను దక్కించుకోవడం ద్వారా తన ఆధిక్యతను మరింతగా పెంచుకున్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీలో ఇప్పటివరకు ముందు వరసలో ఉండిన హిల్లరీ క్లింటన్‌కు మిచిగాన్ రాష్ట్రంలో ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ చేతిలో ఊహించని రీతిలో పరాజయం పాలవడంతో ఎదురుదెబ్బ తగిలింది. విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ ఇటీవలి కాలంలో తనపై విమర్శలు చేస్తున్న పార్టీలోని తన ప్రత్యర్థులపై విరుచుకు పడ్డారు. మిస్సిసిపి రాష్ట్రంలో ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల ఓట్లలో దాదాపు 50 శాతం లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి టెడ్ క్రుజ్ రెండో స్థానంలో ఉన్నారు. కాగా, ఇదాహో రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ వారికోసమే జరిగిన ఎన్నికలో క్రుజ్ విజయం సాధించగా, హవాయిలో ట్రంప్ విజయం సాధించారు.
కాగా, ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండే మిస్సిసిపి రాష్ట్రంలో హిల్లరీ క్లింటన్ అద్భుత విజయం సాధించడంతో తన సమీప ప్రత్యర్థి అయిన శాండర్స్‌కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు ఆమె ఖాతాలో ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో హిల్లరీ క్లింటన్‌కు 88 శాతం ఓట్లు రాగా శాండర్స్‌కు కేవలం 10 శాతమే వచ్చాయి. అయితే ఆటో పరిశ్రమ రాజధానిగా పిలిచే డెట్రాయిట్, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో కూడిన మిచిగాన్ రాష్ట్రంలో ప్రత్యర్థి శాండర్స్ చేతిలో ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలవడం మిగతా రాష్ట్రాల్లో ప్రచారం సందర్భంగా ఆమె ఎదుర్కోబోయే గట్టి సవాలుకు ఓ సంకేతంగా భావిస్తున్నారు. మిచిగాన్ రాష్ట్రంలో హిల్లరీ క్లింటన్ సునాయాసంగా విజయం సాధిస్తారని కొన్ని ప్రీపోల్ అంచనాలు పేర్కొన్నాయి.
అయితే అక్కడ శాండర్స్ 50 శాతం డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల ఓట్లను సంపాదించగా, హిల్లరీ క్లింటన్‌కు 48 శాతం ఓట్లే వచ్చాయి. మిచిగాన్‌లో విజయంతో ఈ నెల 15న ఫ్లోరిడాలో జరిగే కీలక ఎన్నికలకు ముందు శాండర్స్ శిబిరంలో నూతనోత్సాహం నెలకొంది. అయితే మిచిగాన్‌లో అనూహ్యంగా పరాజయం పాలయినప్పటికీ హిల్లరీ క్లింటన్‌కు శాండర్స్‌కన్నా ఎక్కువ మంది డెలిగేట్ల మద్దతు ఉండడం గమనార్హం. ఇప్పటివరకు 21 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు పూర్తికాగా, హిల్లరీ క్లింటన్ 12 రాష్ట్రాల్లో, శాండర్స్ తొమ్మిది రాష్ట్రాల్లో విజయం సాధించారు.

జూపిటర్‌లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్