అంతర్జాతీయం

ముషారఫ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: దేశద్రోహంసహా అనేక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు బుధవారం ఆ దేశ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముషారఫ్ విదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని పాకిస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేస్తే తప్ప 72ఏళ్ల ముషారఫ్ విదేశీ ప్రయాణాలపై ఎలాంటి చట్టబద్ధమైన నిషేధం లేదని పాకిస్తాన్ సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. మాజీ దేశాధ్యక్షుడు ముషారఫ్ విదేశాలకు వెళ్లవచ్చునని సింధ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ముషారఫ్ విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటివరకు అక్రమంగా అడ్డుకున్నదని అతని తరపు న్యాయవాది ఫరోగ్ నసీమ్ మీడియాకు చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముషారఫ్ విదేశాలకు వెళ్లకుండా ఎలాంటి నిషేధం లేదు’ అని ఆయన వివరించారు. అయితే ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ఇసిఎల్) పేరు చేర్చటం ద్వారా ఎవరినయినా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం 2013లో దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేసినప్పటినుంచి అతని విదేశీ ప్రయాణం అంశం తెరపైకి వచ్చింది.

పాకిస్తాన్ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో ముషారఫ్ విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించింది. అయితే 2014 జూన్‌లో కరాచీలోని సింధ్ హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న ఈ నిషేధం నిర్ణయాన్ని తోసిపుచ్చింది. సింధ్ హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం హైకోర్టు తీర్పును సమర్థించింది.