అంతర్జాతీయం

కళ్లముందే కూరుకుపోయన ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మషికి (జపాన్), ఏప్రిల్ 17: కేవలం 24 గంటల వ్యవధి.. రెండు భూకంపాలు.. చూస్తుండగానే ఇళ్లూ, రోడ్లూ, వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి.. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రకంపనలకు భవనాలు పేకమేడల్లా కూలిపోవటం అందరికీ తెలిసిందే.
జపాన్‌లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7 పాయంట్ల తీవ్రతతో 41మంది ప్రాణాలను బలిగొంది. నేలలో ఇళ్లు కూరకుపోయి ఊపిరి ఆడక చనిపోయినవాళ్ల సంఖ్యే ఎక్కువ. భూకంపం వచ్చినప్పటి కంటే ఆ తరువాత జరిగిన విధ్వంసమే ఎక్కువ. భూప్రకంపనలకు కదిలిపోయిన కొండల చరియలు భారీగా విరిగిపడటంతో కుమామోటో ప్రాంతం మొత్తం చరియల నుంచి కొట్టుకువచ్చిన బురదతో మునిగిపోయింది. రోడ్లు, కార్ పార్కింగ్ ప్రాంతాలు, ఇళ్లు, భవనాలు అన్నీ ఈ బురదలో, కొండ చరియల శిథిలాలలో కూరుకుపోయాయి. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన ఆసో మందిరం ధ్వంసమైంది. 250 ఏళ్లనాటి దీని ప్రధాన ద్వారం కూలిపోయింది. ప్రకృతి అందానికి ప్రతిరూపమైన ఆసో పర్వతం అందవిహీనంగా శిథిలమైపోయింది.
రంగంలోకి అమెరికా సైన్యం
జపాన్‌కు అండగా ఉండేందుకు అమెరికన్ సైన్యం రంగంలోకి దిగింది. శిథిలాల కింద ఇంకా చిక్కుకుని పోయి ఉన్న వారిని రక్షించేందుకు జపాన్ సహాయ కార్యకర్తలకు అండగా అమెరికా సైన్యం పూర్తి సాంకేతిక సాధన సంపత్తితో ముందుకు వచ్చింది. వైమానిక సాయంతోపాటు మందులు, ఇతర అవసరమైన సామగ్రిని తీసుకుని దాదాపు 25వేల మంది సైన్యం జపాన్‌కు వస్తోందని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తెలిపారు.

అమెరికా సాయానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కుమామొటో ప్రాంతాన్ని ఒక్కసారిగా అల్లాడించిన భూకంప తీవ్రతకు 41మంది మరణించిన సంగతి తెలిసిందే.

జపాన్‌లో భూకంపానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న సైనికులు