ఓ చిన్నమాట!
విమర్శ( సండేగీత )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రతి విషయాన్ని విమర్శించడం సులువు.
సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంలో ప్రతి వస్తువును విమర్శించవచ్చు.
టీవీ లేక ముందు మనుషుల మధ్య సంబంధాలు బాగా వుండేవి. అది వచ్చిన తరువాత మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయాయని విమర్శించవచ్చు.
మొబైల్ ఫోన్లు లేని కాలంలో మనుషులు ఎలా బతికారో అని ఆ వ్యక్తులు మొబైల్ ఫోన్లకి బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత ఇంకా వాటికి పూర్తిగా బానిసలుగా మారిపోయినారు. ఈ రోజు స్మార్ట్ఫోన్లు లేని వ్యక్తులు అరుదుగా కన్పిస్తారు. స్మార్ట్ ఫోన్లకి బానిసలు అయిన వ్యక్తులు స్మార్ట్ ఫోన్లని విమర్శిస్తూ వుంటారు.
సాంఘిక మాధ్యమాలు మనిషి నిత్యావసర వస్తువులు అయిపోయాయి. అవి చూడనిది అందులో పాల్గొనని వ్యక్తులు కూడా తక్కువే. వాటిని విమర్శించని వ్యక్తులు లేనే లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
దేన్నైనా విమర్శించవచ్చు.
ఎవరినైనా విమర్శించవచ్చు.
మతాన్ని విమర్శించవచ్చు.
వ్యాపారాలని విమర్శించవచ్చు.
రాజకీయాలని విమర్శించవచ్చు.
రాజకీయ నాయకులని విమర్శించవచ్చు.
వాహనాలని విమర్శించవచ్చు.
పోలీసులని విమర్శించవచ్చు.
ఉద్యోగులని విమర్శించవచ్చు.
న్యాయ వ్యవస్థని విమర్శించవచ్చు.
ఇవన్నీ చూసినప్పుడు మనం నివసిస్తున్న ప్రపంచం పూర్తిగా చెడిపోయిందని అన్పిస్తుంది. భవిష్యత్తు మీద చాలా తక్కువ కన్పిస్తుంది.
ఇది నిజమా?
కానే కాదు.
ప్రతి వస్తువుని, విషయాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం, ఎట్లా వాడుకుంటున్నాం అన్న దాని మీద మంచీ చెడూ ఆధారపడి ఉంటాయి.
అందుకని ప్రతిదాన్ని మంచికే వాడుకుందాం. మంచికే వినియోగించుకుందాం.