ఓ చిన్నమాట!
శ్రీరాములు నీవే కలవు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిన్నప్పుడు మా బాపుకి వచ్చిన ఉత్తరాలని గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. మా పెద్దనాయన చాలా దూరంలో వుండేవాడు. ఆయన దగ్గర నుంచి మా బాపుకి నెలకి రెండు ఉత్తరాలు వచ్చేవి. ఉత్తరాల మీద ‘శ్రీరాములు నీవే కలవు’ అని వుండేది. బాగోగులు, ప్రకృతి గురించి పంటల గురించిన ప్రస్తావన ఎక్కువగా ఉండేది.
‘శ్రీరాములు నీవే కలవు’ అన్న పదబంధం నన్ను బాగా ఆకర్షించేది. ‘నీవే కలవు’ అంటే నువ్వే దిక్కు అని అర్థంగా నాకన్పించేది. ఈ పదబంధం మా స్కూలు దూలాల మీద కూడా కన్పించేది. ఇంకా చాలా విషయాలు మా తరగతి గదిలో స్కూల్లో కన్పించేవి. ‘పెద్దలను గౌరవించుడు’ ‘అబద్ధాలు ఆడరాదు’ ‘క్రమశిక్షణతో మెలగాలి’ ఇట్లాంటివి ఎన్నో వుండేవి.
ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఇలాంటి ‘కొటేషన్స్’ అకాడెమీల్లో ఎక్కువగా కన్పించేవి. విలువల గురించి, సంస్థ మిషన్ గురించిన ప్రస్తావన గురించి చెబుతూ పెద్దపెద్ద బోర్డులు కూడా చాలా సంస్థలలో కన్పిస్తున్నాయి.
లక్ష్యాలు, విలువలు, మిషన్ అన్నీ ఎన్నో సంప్రదింపుల తరువాత, చర్చల తరువాత సంస్థల ముందు అవి దర్శనం ఇచ్చేవి.
రాజకీయ పార్టీలు కూడా ఎన్నో చర్చల తరువాత తమ మేనిఫెస్టోలని తయారుచేస్తాయి. అందులో కూడా ఎన్నో గొప్ప మాటలు కన్పిస్తాయి.
మాటలు గొప్పవే.
కానీ
అవి హృదయం నుంచి రావాలి. వాటిని గౌరవించాలి. పాటించాలి.
అలా కానప్పుడు అవి అలంకరణ ప్రాయంగా మిగిలిపోతాయి.
ఆ పదబంధాలని పాటించినప్పుడే, వాటికి జీవం వస్తుంది.
అలా కానప్పుడు-
అవి జీవచ్ఛవంలా వుండిపోతాయి.
కొటేషన్స్‌కి, పద బంధాలకి జీవం కలిగించే బాధ్యత అందరి మీద వున్నప్పటికీ, నాకు మాత్రం శ్రీరాముడే దిక్కని అన్పిస్తుంది. శ్రీరాములు నీవే కలవు.