తెలంగాణ

2018 నాటికి పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు: ఎకె గోయల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మార్చి 10: 2018 నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో ఆన్‌లైన్ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఎకె.గోయల్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఈపంచాయతీ పనితీరును సమీక్షించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అన్ని గ్రామపంచాయతీలలో ఆన్‌లైన్ సౌకర్యం కల్పిస్తూ మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ప్రతి పైసాను ప్రజా సంక్షేమానికే ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలకు రూ.2లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఏ.కె.గోయల్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని పీపల్‌పహాడ్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. గ్రామజ్యోతి అభివృద్ధి కమిటీలతో సమావేశమయ్యారు. గ్రామజ్యోతి కమిటీల పనితీరుపై ఆరాతీశారు. గ్రామసభల తీర్మానాల మేరకే పనులు జరుగుతున్నాయా అని తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్యం పనులపై సమీక్షించారు. ప్రజల ఒప్పందం మేరకే పనులు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అధికారులు - ప్రజాప్రతినిధులు కలిసి ప్రణాళికలు రూపొందిస్తే ఆశించిన అభివృద్ధి జరగదన్నారు. గ్రామాభివృద్ధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. గ్రామసభల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సూచించారు. ప్రశ్నించేతత్వంతోనే పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీని సందర్శించారు. ఇ-పంచాయతీ పనితీరును పరిశీలించారు. ఇ - పంచాయతీ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గ్రామాభివృద్ధి కోసం తీసుకుంటున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ కమిషనర్ రామారావు, జెడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, డిపివో ప్రభాకర్‌రెడ్డి, డిఎల్‌పివో శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణమోహన్, సర్పంచ్ బొంగు లావణ్యజంగయ్యగౌడ్, ఇవోపిఆర్డీ నర్సిరెడ్డి, శేషాద్రి, ఎంపిటిసి కొండ యాదగిరి, ఉపసర్పంచ్ తాళ్ల యాదగిరి, ఎండి.బాబాషరీఫ్, ఎం.ఎ.సలీం, జి.రామలింగం, జావీద్ తదితరులు పాల్గొన్నారు.