Others

అలుపెరుగని అక్షర యోధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ‘కుడి చేతి వాటం’ వారే ఎక్కువ. ఎడమ చేతి వాటం వారు ఉన్నది కేవలం 10 శాతం మంది మాత్రమే. రెండు చేతులతోనూ రాసేవారు ఒక శాతం మాత్రమే. అయితే- ఏకకాలంలో రెండు చేతులతో, రెండు భాషలలో రాసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇది చాలా క్లిష్టతరమైనది కూడా. అటువంటి క్లిష్టమైన ప్రక్రియను చిన్నారుల చేత అత్యంత సులువుగా అభ్యాసం చేయిస్తున్నారు ఒక మాజీ సైనికుడైన వి.పి.శర్మ.
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ‘బుధేలా’ ఓ చిన్న గ్రామం. ఇటీవలి కాలం వరకూ ఈ గ్రామం ఉన్నదన్న సంగతి రాష్ట్రంలోనే చాలామందికి తెలియదు. మాజీ సైనికుడు వి.పి.శర్మ దృఢ సంకల్పం, చిన్నారుల అకుంఠిత దీక్షల కారణంగా నేడు బుధేలా గ్రామం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం ఆ శర్మ ఏర్పాటుచేసిన ‘వీణ వందిని పాఠశాల’. ప్రస్తుతం ఈ పాఠశాలలోని మూడు వందలమంది విద్యార్థులు ఏకకాలంలో రెండు చేతులతో రెండు భాషలలో రాయగలరు. వి.పి.శర్మ సైన్యం నుంచి రిటైర్ అయిన తరువాత తమ స్వగ్రామం అయిన బుధేలాలో స్థిరపడ్డారు. ఒకసారి ఆయన ఒక పత్రికలో భారతదేశ మొదటి రాష్టప్రతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఏకకాలంలో రెండు చేతులతో రాసేవారన్న విషయాన్ని చదివాడు. ఈ విషయంపై ఆయన తీవ్ర కసరత్తు చేశారు. పట్టుదల, కృషి ఉంటే రెండు చేతులతో ఏకకాలంలో రాయడం సాధ్యమేనని గుర్తించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్ఫూర్తితో ఆయన తమ గ్రామంలో 1999 జూలై 8వ తేదీన వీణ వందిని పాఠశాలను ఏర్పాటుచేసి, చిన్నారులకు రెండు చేతులతో ఏకకాలంలో రాయడంపై శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
పాఠశాలలో విద్యార్థులకు ప్రతి పీరియడ్‌లో 45 నిముషాలు పాఠ్యాంశాల బోధన, 15 నిముషాలు రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఒకటవ తరగతి నుంచే పాఠశాలలోని విద్యార్థులకు ఏకకాలంలో రెండు చేతులతో రాయడంపై శిక్షణ ఇస్తారు. వారు మూడవ తరగతికి వచ్చేటప్పటికీ, రెండు చేతులతో ఏకకాలంలో రాయగలుగుతారు. ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు అయితే ఏకకాలంలో రెండు చేతులతో, రెండు భాషలలో తొందరగా రాయగలుగుతారు. ఈ విధమైన శిక్షణ కారణంగా పిల్లలకు పలు భాషలు తెలియడమే కాకుండా, వారిలో ఏకాగ్రత పెరుగుతుందని పాఠశాల వ్యవస్థాపకుడు శర్మ చెబుతుంటారు. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఒక ప్రతినిధి బృందం వీణవందిని పాఠశాలను సందర్శించి, ఏకకాలంలో రెండు భాషలలో రెండు చేతులలో రాయడంపై అధ్యయనం చేయడం గమనార్హం.

-పి.్భర్గవరామ్