Others

సుపరిపాలనే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశంలోనైనా ఆర్థికాభివృద్ధికి మూలధనం, శ్రామిక శక్తి, సాంకేతిక విజ్ఞానం అవసరం. అభివృద్ధి ఫలాలు అర్హులకు అందాలంటే సుపరిపాలన అనివార్యం. దారిద్య్ర నిర్మూలన, ఉపాధి కల్పన కార్యక్రమాలపై మన దేశం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా, ఈ సమస్యలు ఇంకా తొలగిపోలేదు. దీనికి ప్రధాన కారణం కార్యక్రమాల అమలులో లోపాలే. సుపరిపాలనను కచ్చితంగా అందించకపోయినా దీనిపై మనకు కొంత అవగాహన ఉంది. ఐక్యరాజ్యసమితి సుపరిపాలనకు ఏం కావాలో వివరించింది. పరిపాలనా వ్యవహారాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ భాగస్వామ్యం ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం సాధించాలి. జవాబుదారీతనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది లోపించడం వల్లే మనం సుపరిపాలనకు దూరమయ్యాము. విధాన నిర్ణయాలు తీసుకోవడం లోను, వాటిని అమలు పరచడంలోను పారదర్శకత ఉండాలి. సమస్యలను గుర్తించగానే ప్రభుత్వం నుండి సత్వర స్పందన ఉండాలి. సమ్మిళిత వృద్ధిపై దృష్టిపెట్టాలి. అందరి సహకారంతో అభివృద్ధి ఫలాలు అందరికీ అందేట్టు చూడాలి. పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలకు చట్టబద్ధత ఉండాలి.
మన దేశంలో సుపరిపాలన సాధించడం అంత తేలిక కాదు. అవినీతి ఇప్పటికీ హెచ్చుస్థాయిలో ఉంది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంది. అవినీతిని అంతం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. నిజాయితీపరులకు తగిన ప్రోత్సాహకాలు లేవు. అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్షలూ లేవు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా మాత్రమే సుపరిపాలన సాధించగలము. వికేంద్రీకరణను పాటిస్తే సంబంధిత సంస్థలు సమస్యలను తేలికగా పరిష్కరించగలవు. ఎందుకంటే అవి ప్రజలకు దగ్గరలో ఉంటాయి. సమస్యల పరిష్కారానికి నూతన మార్గాలు చూపగలవు. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీరాజ్ సంస్థలపై ప్రభుత్వ సిబ్బంది ఆధిపత్యం ఉండకూడదు. స్థానిక సంస్థలను అన్ని విధాలా పటిష్ఠపరచాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా దృఢ నిశ్చయం ప్రదర్శించాలి. కేవలం చిన్న రాష్ట్రాలు ఏర్పరచడం ద్వారా సుపరిపాలన సాధించలేము. పటిష్టమైన నాయకత్వమే కీలకం.
మన దేశానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల సమయంలో ధన ప్రభావం బాగా ఉంది. ఎంత నిజాయితీపరులైనా డబ్బు ఖర్చు చేయనిదే ఎన్నికలలో గెలవలేరన్నది నిజం. డబ్బు ప్రభావం తగ్గించడానికి అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలి. రాజకీయ ప్రభావం పరిపాలనపై వుంటుంది. ఉదాహరణకు ప్రజాప్రతినిధులు చాలా తేలికగా పార్టీలు మార్చేస్తున్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. విలువలు లేని ఇటువంటి నాయకులు సుపరిపాలనకు తోడ్పడగలరా? వీరు ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులని పాలన సంస్కరణల కమిషన్ (2007) అభిప్రాయపడింది. జిల్లాలు మరీ పెద్దవిగా వుండరాదు. సుపరిపాలన అందించడంలో ప్రభుత్వ సిబ్బంది కీలకపాత్ర పోషించాలి. ఈ విషయంలో మనం బాగా వెనుకబడి ఉన్నాం. సుపరిపాలన సాధించడానికి మనకు ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ఉంది. అనుభవం వల్ల కూడా సుపరిపాలన సాధించవచ్చు. సుపరిపాలన సాధించడంలో కొన్ని రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు వీటిని ఆదర్శంగా తీసుకోవాలి. సామాజిక మీడియా కూడా సుపరిపాలన విషయంలో శ్రద్ధ చూపాలి.

-ఇమ్మానేని సత్యసుందరం