Others

నేతన్నకు న్యాయం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో చేనేత రంగం సంక్షోభం ఈనాటిది కాదు. ఆధునిక సమాజ పురోగమనంలో యాంత్రీకరణ మూలంగా- సంప్రదాయ జ్ఞానం, ఉత్పత్తులు నిరాదరణకు గురవుతున్నాయి. సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా ఆనాడు బ్రిటిష్ పాలకులు చేనేత పరిశ్రమ నడ్డివిరిచారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను నేసారు. వేలి ఉంగరంలో దూరిపోయే చీరలను తయారు చేసి ఆశ్చర్యపరిచారు. 5వేల ఏళ్లకు పూర్వమే దేశం పట్టువస్త్రాల తయారీలో ఎన్నో దేశల కన్నా ముందుండేది. స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిగా, చేనేత రాట్నం దేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచేది. స్వతంత్రం తరువాత కూడా ఉపాధి రంగంలో చేనేత ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఏటా మొక్కుబడిగా జరిగే చేనేత దినోత్సవం సందర్భంగా పాలకుల మాటలు తాత్కాలికకంగా నేతన్నలకు ఊరట కలిగిస్తాయి. తర్వాత షరా మామూలే!
తరాల తరబడి నమ్ముకున్న ఈ వృత్తిని వదలలేక, ఆధునికతకు అలవాటు పడలేక నేత కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆకలి బాధలతో ఎక్కడైనా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నపుడు పాలకులు విచారణ కమిటీలు వేస్తారు, హడావుడి చేస్తారు. నేతన్నది మాత్రం నిరంతర పోరాటం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ చేనేత కార్మికుల పొట్ట గడవడం లేదు. పెరిగిన నూలు ధరలపై ఫ్రభుత్వ నియంత్రణ లేదు. శ్రమకు తగిన కూలీ లభించడం లేదు. దేశవ్యాప్తంగా చేనేత, పట్టు ఉత్పత్తులపై ఆధారపడిన కార్మికులు 50 లక్షల వరకు వున్నారు. పట్టుసాగు, అనుబంధ ప్రక్రియల ద్వారా దాదాపు 66 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. పట్టుసాగు, పట్టు చీరల తయారీపై ఇలా కోటిమందికి పైగా జనం ఆధారపడిన దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. చేనేత, పట్టు ఉత్పత్తులపై ఆధారపడిన కార్మికులు తెలుగు రాష్ట్రాల్లో సాయం కోసం అలమటిస్తున్నారు. గుజరాత్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పట్టువస్త్రాలు మరమగ్గాలపై తయారవుతుండగా ఏపిలో చేనేత రంగంలోనే తయారవుతున్నాయి. కాటన్ నూలుపై ఆధారపరడిన మగ్గాలు కలిపితే 4 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వాటిపై సుమారు 12 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఓ వైపు పత్తి రైతుకు గిట్టుబాటు ధరలు లేవు. చేనేతకు నాణ్యమైన చిలప నూలు దొరకడం లేదు.
కాలం మారుతోంది. పాలకులు మారుతున్నారు. ప్రజల అభిరుచి మారుతోంది. పరిస్థితులు మారాలంటే పథకాలతోపాటు మన నాయకుల్లో చిత్తశుద్ధి అవసరం. ఎన్‌టిఆర్ హయాంలో జనతా వస్త్రాల ద్వారా కార్మికులకు చేతినిండా పని దొరికింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి శనివారం విధిగా అందరూ నేత వస్త్రాలు ధరించి వాటికి ఆదరణ పెంచాలన్నారు. సరైన విధానాలు అమలు కానంతవరకు నేతన్నల బతుకులు బాగుపడవు. చేనేత రంగం కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలి. సబ్సిడీపై నూలు, విద్యుత్ సౌకర్యం అందజేయాలి. గుజరాత్, మహారాష్ట్ర మాదిరి సహకార సంఘాల భాగస్వామ్యంతో ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలట. క్లష్టరు విధానంలో లొసుగులు తొలగించాలి. చేనేత దుస్తుల వినియోగం పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగేట్టు చేయాలి. చిలపల నూలు ఉత్పత్తి ఖర్చును తగ్గించాలి. పత్తి ఎగుమతులు నియంత్రించాలి. చేనేత కార్మికుల రుణ మాఫీ సక్రమంగా చేయాలి. ఇలాంటి చర్యలు నేత కార్మికుల్లో మనో ధైర్యాన్ని పెంచుతాయి.

-లోకనాధం సత్యానందం