Others

తరగతి గదిలో వ్యక్తిత్వ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పిల్లలు బడిలో చేరి తరగతి గదికి వెళ్లాలంటే ఆరేళ్ల వయసు వచ్చేవరకు ఆగాల్సి వచ్చేది. ఈనాడు సమాజంలో వచ్చిన మార్పువలన మానసిక శాస్త్రంలో నూతన ఆవిష్కరణలవలన బడిలో గడపవలసిన సమయం ఎక్కువైంది. ఆనాడు 12 సంవత్సరాలే స్కూల్లో గడపటం జరిగేది. ఈనాడు పిల్లలు స్కూల్లో ఉండి తోటి సమాజంలో గడుపుతున్నది 15 సంవత్సరాలు. మొదటి మూడు సంవత్సరాలు బాల్యదశలో చాలా కీలకమైనదని విశే్లషిస్తున్నారు. దీనివలన ‘కేజీ’ స్కూళ్లకు ప్రచారం ఎక్కువగా పెరిగిపోయింది. ఈ కాలంలో చేయవలసిన పని గురించి స్పష్టత రాకపోవటమే ఈ అస్తవ్యస్తానికి కారణం. కొన్ని దేశాల్లోనైతే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు ఏ పుస్తకాలు చదవాలో, శిశువుకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో? అందుకు సంబంధించిన పుస్తకాలు కూడా వచ్చాయి. ఈనాడు ఏ తల్లి కూడా ఒకరు లేదా ఇద్దరికన్నా ఎక్కువగా పిల్లల్ని కనటానికి సిద్ధపడటంలేదు. ఆనాడు ఎంతమంది పిల్లలు అని అడిగేవారు. ఇపుడు మీ పిల్లల ప్రతిభ ఏమిటని అడుగుతున్నారు. చాలామంది క్యారెక్టర్ అంటే శీలమని అనుకుంటారు. శీలం కంటే మొదట వ్యక్తిత్వం ప్రధానంగా చూస్తారు. పిల్లల వ్యక్తిత్వం ఆ కుటుంబాల సంస్కృతి, చరిత్రతో ఏర్పడుతుంది. చిన్నపిల్లకు తన కుటుంబ చరిత్రను చెప్పటం చాలా ప్రధానం. తల్లిదండ్రుల దగ్గరనుంచి తన కుటుంబ చరిత్రను మొదట అధ్యయనం చేయాలి. కుటుంబం అంటే తండ్రి తరఫుననే కాదు, తల్లిదండ్రుల పూర్వీకుల జీవన శైలిని తెలుసుకోవాలి. వారు గత జీవితంలో ఏ రకమైన జీవితాన్ని గడిపారో విపులంగా చెప్పాలి. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంపై ఇది ప్రభావం చూపుతుంది. జ్ఞానం, టెక్నాలజీ భవిష్యత్తుకు ఉపయోగపడితే కటుంబం సంస్కృతి ఆ బిడ్డల పునాదికి ఉపయోగపడుతుంది. ఆ సమయంలోనే పిల్లల తమ జీవితానికి మెట్లు కట్టుకుంటారు. ఒకనాటి ఊహలే మరోకాలానికి వాస్తవాలవుతాయి. కల్చర్ నిర్మాణం, కల్చర్ పాత్రను తక్కువ అంచనా వేయకూడదు. రాబోయే కాలాల్లో టెక్నాలజీ ప్రాధాన్యత ఎంత ఉంటుందో కల్చర్ ప్రభావం కూడా అంతే ఉండబోతోంది. తండ్రికన్నా మొదటి గురువు తల్లి.
ప్రతి ఉపాధ్యాయునికి మదర్ థెరిసా ఆదర్శం. మదర్ థెరిసా యుగొస్లవేనియాలో పుట్టింది. ప్రపంచ మనిషిగా ఎదిగి ఇండియాకొచ్చి చిన్న పిల్లలను తీసుకుని అది కూడా దళిత పేద వర్గాల నుంచి వచ్చిన వారిని తీసుకువచ్చి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ ఇచ్చి సన్మానించింది. అనాధలను ఆదరించి వారికి సంస్కారం నేర్పింది. కొత్త జీవితాన్నిచ్చింది. జీవితంలో సాంస్కృతిక వారసత్వం లేనటువంటి వారికి గొప్ప వారసత్వాన్ని అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. కొంతమంది పిల్లలకు ఏ కారణాలవల్లనో తల్లీ, తండ్రి ఎవరో తెలియదు. అలాంటి పిల్లలకు అలవాట్లను, దినచర్యలను నేర్పింది. అది కూడా మిషనరీ జీల్‌తో వారిని తీర్చిదిద్దింది. ఆమె చేసిన కృషి తరగతిగదిలోని ఉపాధ్యాయులందరికీ ఆదర్శం. దానికే ఆకర్షితుడై చిన్మయానంద చిన్న పిల్లలకోసం ఆశ్రమాలు నిర్మించారు. సమాజంలో సింగిల్ పేరెంట్ ఉన్నవారి పిల్లలను ఆదుకోవటం, వారిని మంచి పౌరులుగా తయారుచేయటం తరగతి గది చేయాలి. కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని గుర్తించి వారికి ఆసరాగా నిలవాలి. సామాజిక రంగంలో ఉండే కార్యకర్తలు ఇలాంటి పిల్లలను గుర్తించటం వారికి కల్చరల్ హెరిటేజ్‌ను అందించగలిగిన వాళ్లంతా గురువులే. ఆ పిల్లలకు వీళ్లే కల్చరల్ గురువులు. ఉపాధ్యాయులకు అందుకు అనువైన క్షేత్రమే తరగతి గది.

-డా.చుక్కా రామయ్య