Others

నూతన సమగ్ర కార్యక్రమం ‘భారత్‌మాల పరియోజన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌మాల అనేది హైవేల రంగంలో చేపట్టే ఒక నూతన సమగ్ర కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా రహదారి మార్గం గుండా సాగే వాహనాల రాకపోకలకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, కీలకమైన అవస్థాపన సంబంధిత అంతరాలను పూడ్చడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ‘భారత్‌మాల’ కార్యక్రమం దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రధానమైన చోదక శక్తిగా ఉంటుందని, అంతేకాకుండా ఒక నవ భారతదేశాన్ని ఆవిష్కరించాలనే ప్రధానమంత్రి మోదీ ‘విజన్’ను సాకారం చేయడంలో తోడ్పడగలదని గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఉన్న హైవేల వౌలిక సదుపాయాలలోని అంతరాలను పూడ్చటం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, దీని ద్వారా మనుషులు మరియు సామాగ్రి, రవాణాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్నదే ధ్యేయమని ఆయన వివరించారు. వెనుకబడిన మరియు ఆదివాసీ ప్రాంతాలు ఇంకా ఆర్థిక కార్యకలాపాలకు నెలవైన ప్రాంతాలు, మత సంబంధ మరియు పర్యాటక ప్రధానమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాలతోపాటు, ఇరుగు పొరుగు దేశాలతో వ్యాపారం సాగే మార్గాల అనుసంధాన సంబంధిత అవసరాలను తీర్చడంపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో శ్రద్ధ వహిస్తారు.
భారత్‌మాల కార్యక్రమం దేశానకి, ఇప్పుడు ఉన్నటువంటి ఆరు నేషనల్ కారిడార్లకు బదులుగా 50 నేషనల్ కారిడార్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా సరకు రవాణాలో 70 నుంచి 80 శాతం వరకు జాతీయ రహదారుల వెంబడి సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి వెసులుబాటు 40 శాతం వరకే ఉంది. ఈ కార్యక్రమం 550 జిల్లాలను, జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో తోడ్పడనుంది. ఇప్పుడు దేశంలోని సుమారు 300 జిల్లాలు మాత్రమే జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. ఇంతేకాకుండా భారత్‌మాల పరియోజన దేశం యొక్క లాజిస్టిక్ ఫెర్మాన్స్ ఇండెక్స్ (ఎల్‌పిఐ) పైన సకారాత్మక ప్రభావాన్ని కూడా పరిష్కరించనుందని, ఈ కార్యక్రమం నిర్మాణరంగ కార్యకలాపాలలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పెద్ద సంఖ్యలో ఉపాథి అవకాశాలు ఏర్పడటానికి సహాయపడగలదని, అలాగే హైవేల వెంబడి సదుపాయాలను అభివృద్ధి పరచడానికి సహకరించగలదని, మెరుగైన రహదారి అనుసంధానం ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు వర్థిల్లడానికి తోడ్పడనుందని భావన.
భారత్‌మాల ఒకటవ దశలో భాగంగా మొత్తం సుమారు 24,800 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకొంటున్నారు. దీనికి తోడు భారత్‌మాల పరియోజన ఒకటవ దశలో భాగంగా ఎన్‌హెచ్‌డిపి కింద మిగిలి ఉన్న 10 వేల కిలోమీటర్ల రహదారుల పనులను కూడా చేర్చుతారు. దీనితో 5,35,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 34,800 కిలోమీటర్ల మేర రహదారులను ఏర్పరుస్తారు. 2017-18 నుండి 2021-22ల మధ్యకాలంలో భారత్‌మాల ఒకటవ దశను అమలు చేయనున్నారు. దారుల విస్తరణ, రింగు రోడ్ల నిర్మాణం, బైపాస్‌లు/ ఎలివేటెడ్ కారిడార్లు, మరియు గుర్తించిన ప్రదేశాలలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ద్వారా రద్దీని తగ్గించే చర్యలు చేపట్టి నేషనల్ కారిడార్ (సవర్ణ చతుర్భుజి మరియు ఎన్‌ఎస్‌ఇడబ్ల్యు కారిడార్) సామర్థ్యాన్ని మెరుగుపరచాలనేది భారత్‌మాల పరియోజన ముఖ్య ఉద్దేశం. భారత్‌మాల ఒకటవ దశలో 1,00,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దాదాపు 5వేల కిలోమీటర్ల మేర నేషనల్ కారిడార్ పనిని చేపడుతారు. భారీ సరకు రవాణా జరుగుతున్న మార్గాలు లేదా సుమారు 26,200 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్లను ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించారు. ఇందులో 9 వేల కిలోమీటర్ల పనులను 1,20,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒకటవ దశలో భాగంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇదే కాకుండా దాదాపు 8 వేల కిలోమీటర్ల ఇంటర్ కారిడార్స్ మరియు దాదాపు 7,500 కిలోమీటర్ల మేర ఫీడర్ కారిడార్లను కూడా భారత్‌మాలలో భాగంగా గుర్తించారు. ఇందులో సుమారు 6 వేల కిలోమీటర్ల పనులను 80 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తీర్చిదిద్దుతారు. ఈ కారిడార్లను అభివృద్ధి పరచడం వల్ల ప్రస్తుతం చాలాచోట్ల తలెత్తుతున్న అవస్థాపన సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుంది. భారత్‌మాలలో భాగంగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్‌లతో వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసం 2వేల కిలోమీటర్ల అంతర్జాతీయ అనుసంధాన రహదారులను మరియు 3,300 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకంగా ప్రాముఖ్యం కలిగిన సరిహద్దు రహదారులను కూడా నిర్మిస్తారు.