Others

ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళి ముందున్న ప్రధాన సమస్యలలో వాయుకాలుష్యం ఒకటి. మనుషులకే కాదు జీవరాశి మనుగడకు ఇది హాని కలిగిస్తోంది. పార్టికిల్ పొల్యూషన్ లేదా పార్టిక్యులేట్ మేటర్ (పి.ఎం) అనేది గాలిలో తేలియాడే కణరూపద్రవ్యం. ఇది సూక్ష్మ ఘన, ద్రవ కణాల మిశ్రమం. ఇది వాయు కాలుష్యానికి సూచిక. ఇది సహజంగా లేదా మానవకారకంగా ఏర్పడుతుంది. ఈ మిశ్రమం వివిధ పరిమాణాలలో ఉంటుంది. పది మైక్రోమీటర్ల వ్యాసం పరిథిలో గల ఈ మిశ్రమాన్ని పి.ఎం.10గా వ్యవహరిస్తారు. ఇది మన ఊపిరితిత్తులలో చేరి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతుంది. పది మైక్రోమీటర్లు అంటే మన తల వెంట్రక మందంకన్నా తక్కువే.
ఇక పిఎం 2.5 అన్నది 2.5 మైక్రోమీటర్ల వ్యాసం పరిథిలోగల వాయు కాలుష్య కారమైన కంటికి కనిపించని కణరూపద్రవ్యాన్ని సూచిస్తుంది. దుమ్ము, వివిధ రకాలమైన పొగ, వివిధ లవణాలు, సూక్ష్మ బిందువులుగా వ్యాపించిన సల్ఫ్యూరిక్ యాసిడ్‌లాంటి రసాయనాలు మొదలైనవి వాయు కాలుష్యానికి కారణమవుతాయి. గాలిలో వీటి సాంద్రత ఎక్కువైనప్పుడు ఆకాశంలో పొగమంచు కమ్మినట్లు అనిపిస్తుంది. ఇది శ్వాససంబందమైన, గుండె సంబంధమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇటీవలి కాలంలో పిఎం 2.5లో కార్బన్ మోతాదు ఎక్కువౌతోంది. ఇది మన ఆరోగ్యానికి హాని చెయ్యడమే కాదు. వాతావరణంలోని మార్పులపై కూడా ప్రభావం చూపిస్తోంది. వాయుకాలుష్యం కారణంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో ‘ఆస్త్మా’ ఒకటి. మనదేశంలో 2010-15 మధ్యకాలంలో ఈ వ్యాధి బారిన పడినవారిలో 15 నుండి 49 ఏళ్లలోపు, 5-60 ఏళ్ల లోపు మగవారిలో ఎక్కువగా ఉన్నారు. 45-14, 15-49, 50-69 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో ఆస్తమా వ్యాధిగ్రస్థులుగా నమోదైనవారి సంఖ్య 2010-15 మధ్య కాలంలో పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఒక్క 2015లో పిఎం 2.5 యొక్క దీర్ఘకాలిక ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్ ప్రజలు మరణించినట్లు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ పేర్కొంది. ఈ నివేదిక అందించిన వివరాలను బట్టి గాలిలో పి.ఎం. 2.5 పెరగడం కూడా మనదేశంలో ఆస్త్మా ప్రబలడానికి కారణమని తెలుస్తోంది. పి.ఎం. 2.5 కారణంగా భారత్, చైనాలతో అధిక సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పి.ఎం. 2.5 కారణంగా మరణించినవారిలో భారత్, చైనాలకు చెందినవారు 52 శాతం మంది. అంటే ఈ దేశాలలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. పర్యావరణంరీత్యా మనం ఎంతో నష్టపోయాం. ఇందుకు గల ఒకే ఒక కారణం మానవతప్పిదం. ఇప్పటికైనా మనమంతా తేరుకుని మానవజాతి ప్రాణాలను కాపాడుకోవడానికి భూ, వాయు కాలుష్యాలను నిరోధించేందుకు నడుం బిగించాలి. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తొలి అడుగుగా విరివిగా మొక్కలను పెంచాలి. ఉన్న వృక్ష సంపదను పరిరక్షించుకోవాలి.

-దుగ్గిరాల రాజకిశోర్