Others

అధికార పక్షానికి ఆకులు.. అల్లుడికి ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయంగా ఉపఎన్నిక గురించి మాట్లాడటానికేం ఉండదు. యధాలాపంగా అధికారపక్షం గెలిచేస్తూ ఉంటుంది. ఇంకా అధికారంలో ఉన్న పక్షంవైపు ఉంటే పోయేదేముంది అని ఓటర్లు భావించడం వల్ల కావొచ్చు. ప్రభుత్వ వర్గాల సహకారం వల్ల, చేతిలో ఉండే వనరుల వల్ల అధికారపక్షం వైపే త్రాసు మొగ్గుచూపుతుంది. ఇక తమిళనాడులో ఆరేకేనగర్ ఉపఎన్నిక అధికారపక్షం దేవతగా కొలిచే జయలలిత మరణం వల్ల వచ్చింది. ఏఐడిఎంకే గుర్తు పొంది అమ్మకి అసలైన వారసులమని ముద్ర వేయించుకున్న ఈపీఎస్-ఓపీఎస్ వర్గాలే అధికారంలో ఉన్నాయి. సకల లాంఛనాలతో రెండాకులు ఎండ ధాటికి సోలిపోకుండా కమలం తగినంత నీడనిస్తోంది హస్తం లెవెల్లో. వారిని కాపాడడమే కాదు, వారికి వ్యతిరేకంగా గ్రూపు కట్టగల శక్తి ఉన్న, అమ్మ వారసత్వానికి అర్రులు చాస్తున్న పిన్నమ్మ శశికళ వర్గాన్ని కట్టడి చేస్తూనే ఉంది. అందులో భాగంగానే శశికళ మేనల్లుడు, నేడు ఉప ఎన్నికల్లో గెలిచిన దినకరన్ ‘అధికారిక రెండాకుల’ గుర్తు తమ వర్గానికి కేటాయించుకోవడానికి నాలుగు డబ్బులు ఎరవెయ్యడానికి ప్రయత్నించాడన్న నేరారోపణతో గతంలో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా అధికార ప్రతిపక్షాలు కలసి సాధించుకున్న ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు సాధించడం అసలైన మలుపు. డబ్బుతో గెలిచాడనడం శుద్ధ వేస్ట్. ఎందుకంటే గతంలో ఈ ఎన్నిక డబ్బు ప్రవాహం వల్ల రద్దయ్యింది. అలాగే ఈసారి కూడా డబ్బు ప్రవాహం జరిగితే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మళ్లీ రద్దు చెయ్యాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, ఎన్నికల సంఘం, వివిధ అధికారాంగాలూ కలిసినా ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక ఉప ఎన్నికలో అవినీతికి పాల్పడినా ఏమీ నియంత్రించలేకపోయాయంటే అది సిగ్గు చేటు. ఇక బలమైన ప్రతిపక్షం డిపాజిట్లు కోల్పోవడమంటే అది తీవ్రలోపమైనా అయ్యుండాలి లేదా లోపాయికారీ ఒప్పందమైనా అయ్యుండాలి. నోటా ఓట్లకన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి ఆ రాష్ట్రంలో తన పాత్ర ఎంత నామమాత్రమో తెలిసి ఉండాలి. ఇక దినకరన్ బలపడుతున్నకొద్దీ ఏఐడీఎంకె శ్రేణులు ఆయన వెనకబడే అవకాశాలే ఎక్కువ. ఈపీఎస్ ఓపీఎస్ వర్గాలు మళ్లీ తమతమ ద్వితీయ స్థానపు పాత్రల్లోకి ఒదిగిపోయినా ఆశ్చర్యం లేదు. తమిళనాడులో జాతీయ పార్టీలకు కాలూనే అవకాశాలు దరిదాపుల్లో లేనట్టే.

-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం