Others

రంగులనుబట్టి చూడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులవల్ల తరగతి గదిలో ఒకే రంగున్న పిల్లలు కనబడరు. ఒకే రకమైన ముఖవర్ఛస్సున్న పిల్లలు కనపడరు. వాటితోనే ఆ పిల్లలపైన మన అభిప్రాయాలను పెంచుకుంటున్నారు. ముక్కు లొందకు పోతే అస్సామీ, నేపాలీ అనుకుంటారు. లేదా చైనీయుడు అనుకుంటాం. మనిషి రంగు చామనఛాయగా ఉంటే మధ్యప్రాచ్యం (ఆస్ట్రేలియా, ఈజిప్టు) వారని, తెల్లగా ఉంటే ఐరోపా వారని అనుకుంటాం. రంగుతో కొంతమందిని, ఆకారంలో కొంతమందిని అంచనావేస్తారు. అదేవిధంగా మానవ సంబంధాలపై అది ప్రభావితం చూపించే కాలం వచ్చింది. మనిషి రంగైనా, స్వరూపమైనా ఆ వ్యక్తి డిఎన్‌ఎ పైననే ఆధారపడి ఉంటుంది. మనిషి జీవకణాలే ఆ వ్యక్తి క్యారెక్టరును కూడా విశే్లషణ చేస్తున్నాయి. చివరకు మన పూర్వీకులు వానరజాతివారని అంటారు. మన డీఎన్‌ఏ వానరాలకు దగ్గరగా ఉందని శాస్తవ్రేత్తల అభిప్రాయం. అదేవిధంగా మన పొడవు, మన ఎత్తుకూడా వారి డిఎన్‌ఏపైననే ఆధారపడి ఉంటుంది. తరగతి గదిలో ఆడ, మగ పిల్లలు ఉంటారు. ఆడపిల్లల ఎత్తు తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఒకనాటు పురుషుడు సాహసంతో పుష్ఠికరమైన ఆహారాన్ని సంపాదించుకున్నాడు. ఆడవారికి పుట్టుకతో పలం లేకపోవడం వలన దొరికిన ఆకులు, ఫలాలు తిని బతికారు. మగపిల్లల జీన్స్ ఆడపిల్లల జన్యువుల మార్పువలన వారి ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది. అదేకాకుండా వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. 11వ శతాబ్దం పురుషుని ఎత్తు 173 సెంటీమీటరుల, అదే 19వ శతాబ్దం వచ్చేసరికి 167 సెంటీమీటర్లయ్యింది. కాలక్రమేణ ఆడమగ మనుషుల ఎత్తుల్లో 12 సెంటీమీటర్ల తేడా వచ్చింది. నాగరికతలో పురుష ఆధిపత్యంవల్ల తనకన్నా తక్కువ ఎత్తులో ఉన్న ఆడపిల్లలను సహచరిగా స్వీకరించాడు. జీన్స్‌లో తేడా ఉంది కాబట్టి అది ఎత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతమాత్రాన ఆడవారి ఎత్తు పెరగదని కాదు. వ్యాయామంతో ఒకటి రెండు సెంటీమీటరుల పెరగవచ్చును. తరగతి గదిలో కనపడే రంగైనా, ఎతె్తైనా అది జీన్స్‌వల్ల జరిగిందే, దాన్ని ఆధారం చేసుకు విద్యార్థులపై ఒక అభిప్రాయానికి రావడం సరైంది కాదు. దేహాలపై విద్యార్థుల నియంత్రణ ఉండదు. తల్లి గర్భకోశంలో కూడా తేడా ఉంటుంది. అక్కడే జన్యువుల రూపాలు నిర్ణయవౌతాయి. ఉపాధ్యాయుడు శాస్ర్తియమైన అవగాహనతో విద్యార్థులను చూడాలి. తరగతి గదిలో రంగుతో, ఆకారంతో వారి గురించి నిర్ణయం తీసుకోకూడదు. ఈనాడు మారుతున్న పరిస్థితులలో రంగు వైషమ్యాలకు కారణమవుతుంది. రంగువలల వ్యక్తులను శత్రువులుగా చూడకూడదు. చామనఛాయ ఉన్న ప్రతివాడూ టెర్రరిస్టుకాదు. ఈ నేపథ్యాన్ని తరగతి గదిలో చూపించగలిగితే సమాజంలో వైషమ్యాలను నివారించవచ్చును. ఉద్యమానికి శాస్ర్తియ దృక్పథం అవసరం.
సూర్యుడే ఆలోచనలకు మూలం
సూర్యుడు ఒక జ్ఞాన దీపిక. సూర్యుడు స్వతహాగా ఒక్క వెలుగునే ప్రసాదించడు. హైడ్రోజన్, హీలియం ఈ రెండు వాయువులు సూర్యుడి నుంచి వస్తాయి. సూర్యుడు స్వయం ప్రకాశం ప్రసాదిస్తాడు. అందుకే పిల్లలను, ముసలివాండ్లను ప్రతిరోజు ఎండలో అరగంట కూర్చోమని చెబుతారు. అది విటమిన్ ‘డి’కి కారణభూతమైంది. ప్రతిక్షణం 700 మిలియన్ టన్నుల హైట్రోజన్‌ను హీలియంగా మార్చుతుంది. అదే అణుశక్తికి కారణం. 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఒక హీలియంగా మారుతుంది. కానీ బరువు మాత్రం 4 హైట్రోజన్ అణువులకన్నా తక్కువే. దీనినే ఐనిస్టీన్ శక్తిసూత్రంగా చెప్పాడు. సూర్యుడు జ్ఞాన నిధి. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అది పరిశోధనకు కేంద్రం. అందుకే తరగతి గదికి సూర్యునికి సంబంధం ఉంది. అది కారుకు, పెట్రోలుకు ఉన్న సంబంధంలాంటిది.

-డా.చుక్కా రామయ్య