Others

యువశక్తి అక్కరకొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశ జనాభాలో సగం మంది పాతికేళ్ల లోపు యువకులే. అరవై శాతం మంది 35 సంవత్సరాల లోపువారు. వచ్చే రెండు సంవత్సరాలలో భారతదేశ జనాభాలో సగటు వయసు 29 ఏళ్లు ఉంటుంది. యువశక్తి అధికంగా ఉండడం అన్నది దేశం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. యువతరంతో వర్థిల్లుతున్న భారత్‌కు ఈ పరిణామం మేలు చేస్తోందా? ఉపయోగపడుతుందా? అంటే ఔనని గట్టిగా చెప్పలేకపోతున్నాం. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభం పొందడమా, లేక నిర్లక్ష్యంతో భారం చేసుకోవడమా అన్నది ప్రభుత్వం చేతిలో ఉంది. చిత్తశుద్ధి, సరైన ప్రణాళికతో నడింపించవలసిన ప్రభుత్వం చేతిలో ఉంది. క్షేత్ర స్థాయి వాస్తవాలు మాత్రం ప్రస్తుతం నిరాశాజనకం.
‘ప్రథమ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతీ సంవత్సరం దేశంలో విద్య సంబంధిత నాణ్యత, తదితర విషయాలపై శాస్ర్తియంగా సర్వే జరిపి నివేదికను విడుదల చేస్తుంది. ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (డఉ్గ)’ పేరిట రూపొందే ఈ నివేదిక వాస్తవాలను కళ్లకుకట్టేట్టు ఉంటుంది. 2017 సంవత్సరానికి సంబంధించి తన 12వ నివేదికను ప్రథమ్ ఇటీవల విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలలోని యువతరంపై ఆ నివేదికలో పొందుపరచిన వివరాలు, కఠోర వాస్తవాన్ని మన కళ్ల ముందు ఉంచింది. చదువుకుంటున్న టీనేజీ (14-18 ఏళ్ల మధ్యవారు) విద్యార్థుల్లో తమ సొంత భాషలో ఉన్న రాత ప్రతిని ధారాళంగా చదవడం రాదు. 36 శాతం మంది దేశ రాజధాని ఏదో చెప్పలేకపోయారు. డిజిటల్ యుగం అని పిలవబడుతున్న ఈ రోజుల్లో 61 శాతం మంది అంతర్జాలం వినియోగించి ఎరగరు. వీరిలో 43 శాతం మంది తేలికపాటి లెక్కలు కూడా చేయలేకపోయారు. కచ్చితమైన సమయం ఎంతో గంటల్లో చెప్పగలిగేవారు కేవలం 83 శాతం. అటూఇటూగా చెప్పగలిగేవారు 60 శాతం మాత్రమే. ఇక వీరిలో 76 శాతం మంది నగదును సరిగ్గా లెక్కపెట్టలేకపోయారు. గణితంలో అర్ధమెటిక్స్‌పై కాస్తంత అవగాహన ఉన్న యువకుల్లో 90 శాతం మంది మాత్రం నగదును చక్కగా లెక్కపెట్టగలిగారు. బరువును కిలోగ్రాములలో చెప్పగలిగే సామర్థ్యం కేవలం 56 శాతం మందికి మాత్రమే ఉంది. దేశ, రాష్ట్ర పటాలను, రాజధానిని గుర్తించడం, తాము నివసిస్తున్న రాష్ట్రం ఏదో మ్యాప్‌లో గుర్తించగలిగినవారి సంఖ్య 42 నుంచి 79 శాతం మధ్యనే ఉండటం గమనార్హం. ఈ లెక్కలన్నీ చదువు కొనసాగిస్తున్న కొద్దిమందికి సంబందించినవి. చదువుకు దూరమైన ఎంతోమందిని లెక్కలోకి తీసుకొంటే దేశం ఎంత దయనీయమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది. అందరికీ నాణ్యమైన విద్యనందించడం ప్రభుత్వానికి ప్రాధామ్యం కావాలి. నాణ్యమైన విద్య ద్వారానే, వివిధ నైపుణ్యాలను, కౌశలాలు పెంపొందించడం ద్వారానే యువశక్తిని సద్వినియోగం చెయ్యగలం. మానవ వనరులను విద్య, ఆరోగ్యం, ఉపాధి విషయాల్లో బలోపేతం చెయ్యడం ద్వారా చైనా తాను ఆర్థికంగా బలపడింది. ఏ దేశమైనా బలపడేది ఈ మార్గంలోనే, యువశక్తి నిర్వీర్యం కాకుండా, భారం కాకుండా ప్రణాళికాయుతంగా భారత్ ముందడుగు వెయ్యాలి. చేదు వాస్తవాలతో కళ్లు తెరచి తన కర్తవ్యాన్ని గుర్తెరగాలి. యువశక్తి నైపుణ్యం పెంచుకోవడం, అవకాశాలను సృష్టించుకోవడం, అందిపుచ్చుకోవడం, కొత్త విషయాలపై పట్టు సాధించడం వంటివి సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనదేశానికి ‘యువతరం’ ఉపయోగపడ్డట్టు లెక్క.

-డా.డి.వి.జి.శంకరరావు