Others

యాజ్ఞసేని-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత విదురుడు పాంచాల రాజ్యానికి చేరాడు. ద్రుపద మహారాజును దర్శించుకున్నాడు. అప్పుడు అక్కడ వున్న శ్రీకృష్ణవాసుదేవుని చూచాడు. వినయంతో నమస్కరించాడు. ద్రుపదుడు కూడా ధర్మంగా విదురుని ఆదరించాడు. ఇరువురూ కుశల ప్రశ్నలడిగి క్షేమ సమాచారాన్ని పంచుకున్నారు.
తరువాత పాండవులను చూచి ప్రేమతో కౌగిలించుకున్నాడు. వారికి ధృతరాష్ట్రుడు పంపిన కానుకలను, ఆభరణాలను, రత్నాలను ఇచ్చాడు. శ్రీకృష్ణపాండవుల యెదుట వినయంతో-
‘‘ద్రుపద మహారాజా! పుత్రులు మంత్రులతో కలిసి మీరు నా మాటలను వినండి. ధృతరాష్ట్ర చక్రవర్తి పుత్ర మిత్ర బంధు మంత్రిగణ సహితులైన మిమ్ములను క్షేమం అడిగాడు. మీ సంబంధం తనకు ఎంతో ప్రీతి కలిగించిందని అన్నాడు. భీష్మపితామహుడు కౌరవులందరితో కూడి మీ క్షేమాన్ని అన్ని విధాలా కాంక్షించాడు. మీ ప్రియ స్నేహితుడు మిమ్ములను కుశల ప్రశ్నడిగాడు.
యజ్ఞసేనా! కౌరవులందరికీ మీ సంబంధం రాజ్యంకన్నా అంత ప్రీతి కలిగించింది. అన్నివిధాలా ప్రసన్నులను చేసింది. ఇది తెలిసి మీరు పాండవులను హస్తినాపురానికి పంపాలి. హస్తినాపురంలో శ్రేష్ఠులైన స్ర్తిలు, గాంధారి మొదలగువారు, హస్తినాపుర ప్రజలు పాంచాల రాజపుత్రిని చూడాలని కోరికతో ఆమె రాకకై ఎదురుచూస్తున్నారు. మీరు ఆజ్ఞాపిస్తే నేను వారి రాకను హస్తినాపురానికి చేరవేస్తాను’’ అని వినయంగా విన్నవించాడు. అందుకు ద్రుపదుడు-
‘‘విదుర మహాశయా! నీవు చెప్పినదంతా సత్యమే! కౌరవుల ఈ సంబంధం నాకూ ఆనందాన్ని కలిగించింది. పాండవులు వారి హస్తినకు చేరటం ఉచితం. నేను వారిని వెళ్ళమని చెప్పటం సరైనది కాదు. ధర్మరాజ భీమార్జున నకుల సహదేవులు, బలరామకృష్ణులు ఎక్కడికి వెళ్లటం మంచిదని భావిస్తారో అక్కడికి వెళ్లాలి’’ అని అన్నాడు.
ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ‘‘సర్వధర్మాలూ తెలిసిన ద్రుపద మహారాజు అనుకొన్నట్లుగా వెళ్ళడమే నా యిష్టం’’ అని అన్నాడు.
‘‘దాశార్హుడైన శ్రీకృష్ణుని అభిప్రాయమే నాకూ సమ్మతమే. కుంతీపుత్రులు నాకు ఇప్పుడు ఎట్టి బంధువులో శ్రీకృష్ణునకూ వారు అలాంటివారే అనే మాట సత్యం. పురుషోత్తముడు ఎప్పుడూ పాండవుల హితం ఎంతగా కోరుకుంటాడో అంతగా కుంతీపుత్రుడైన ధర్మరాజు కూడా వారి హితాన్ని కోరుతాడో లేదో తెలియదు’’ అని అన్నాడు ద్రుపదుడు.
తరువాత తేజస్వి అయిన విదురుడు కుంతీదేవి భవనాన్ని చేరాడు. భూమిని శిరస్సుతో తాకి కుంతీదేవి పాదాలకు నమస్కరించాడు. కుంతీదేవి మరదిని చూచి మిక్కిలి విలపించింది. విదురునితో..
‘‘్ధర్మపక్షపాతివైన విదురా! మరదీ! నీ పుత్రులైన పాండవులు ఎలాగో నీ అనుగ్రహం వలన లక్క యింటినుండి బయటపడి తిరిగి వచ్చారు. తాబేలు తన పిల్లల గురించి ఆలోచన చేయటమే వాటిని పెంచటం, పోషించటం అవుతుంది. అవి తెలివితేటలు సంపాదిస్తాయి.

- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము