Others
కేశవ ప్రార్థనే మోక్షహేతువు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 February 2018
జనార్దన
21.జలజలోచన నీదాస జనుల కెలమి
యర్ధ కామములిచ్చు జనార్దనుడవు
నిన్ను నిరసించు మూఢ దానవుల బటిట
దండితులజేయు చక్రహస్తుండ వీశ
ఉపేంద్ర
22.ఇంద్రునకు సోదరుండవు యింద్రియముల
కర్మ మార్గమునందు సక్రమము తోడ
నడుపు నేతవు నిన్ను పేద్రుండటంచు
బుధ జనంబుల సేవింత్రు భక్తితోడ
హరి
23.కర్మవశమున జన్మల నెన్నోయెత్తి
పుణ్యలేశంబుచే హరీ పూజ్యమైన
నీదు నామము జపింయించ నేర్చినాను
వెరపు లేదింక షడ్వర్గ వేదనలకు
శ్రీకృష్ణ
24. భువన మోహనా శ్రీకృష్ణ పురుష సింహ
దివ్య మంగళ విగ్రహా దీన పోష
గీత బోధించి పార్థుని రీతి మార్చి
నట్టి యోగేశ్వరేశ్వరా నతులు దేవ
విష్ణునామములీ యిరువదియు నాల్గు తేటగీతల శ్రీహరిన్‌మేటి విభుని
కీర్తనము జేయు భక్తుల కోర్కెలరసి
దీర్చు మహాలక్ష్మి పూజితుం డచ్యుతుండు