Others

సమాజ హితైషి.. స్వామి జయేంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సేవే మాధవసేవని భావించి హరహర శంకర నినాదంతో హైందవ మత వికాసం కోసం మనదేశంలోని అన్ని ప్రాంతములే గాక ఇతర దేశాలలోను ప్రవచనాలను వల్లెవేసిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణం చెందడం ఆధ్యాత్మిక ప్రపంచానికే కాక వారి భక్తులకు తీరని లోటు. మనదేశం ఓ గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిని, సామాజిక సంస్కర్తను కోల్పోయింది. మానవాళి అభ్యున్నతికి, ఆధ్యాత్మిక నాయకుడిని, సామాజిక సంస్కర్తను కోల్పోయింది. మానవాళి అభ్యున్నతికి, ఆధ్యాత్మికతను ప్రజలలో పెంచడానికి జయేంద్ర సరస్వతి విస్తృతంగా పర్యటించారు. కంచి పీఠాధిపతులలో విదేశాలకు వెళ్లిన తొలి వ్యక్తిగా గుర్తింప బడ్డారు. కంచి మఠం అన్ని మతాలను సమానంగా చూస్తూ సర్వమత సమ్మేళన వేదికగా నిలవడం అభినందనీయం. ప్రజలంతా క్షేమంగా వుండాలి. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలి అంటూ అందరికీ ఆశీస్సులు చెప్పే జయేంద్ర సరస్వతి శివైక్యాన్ని నమ్మలేకపోతున్నాము.
అభినవ శంకరులుగా పేరుగాంచిన జయేంద్ర సరస్వతి 18వ యేటనే సన్యాస ఆశ్రమం స్వీకరించి ఆలయాలతో పాటు, విద్యాలయాలు, వైద్యశాలలు, వృద్ధాశ్రమాలు, గోవుల రక్షణకు గోశాలలు ఏర్పాటు చేసి సమాజహితానికి తోడ్పాటు నందించారు. తన సందేశాల ద్వారా ప్రజలలో చైతన్య కాంతులను నింపారు. జయేంద్ర సరస్వతి భౌతికంగా మన ముందు లేకున్నా ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్నత కాలం వారి ప్రసంగాలు, అనుగ్రహ భాషణలు ప్రతీ ఒక్కరి మదిలో కలకాలం నిలిచి వుంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా సంతాపం ప్రకటిస్తున్నాము.

- కామిడి సతీష్ రెడ్డి