Others

దివ్య సుగుణ బాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఎదుట తీపి మాటలు మాట్లాడి
వెనుక జేరి కీడు వెదుకుచుంద్రు
చాపకింద నీరు చందము కొందరు
దివ్య సుగుణ బాల ధీవిశాల!

సారహీనమైన చదువు చదువుకాదు
అడుసులోన కవియు అత్తరునది
జ్ఞానహీనమైన జన్మంబు వ్యర్థము
దివ్య సుగుణ బాల ధీవిశాల!

వినయ సంపదున్న విద్యార్థి ధరలోన
గురువు మెప్పు వడసి గురువు యగును
ఆకు చాటు కాయ అలరిన చందము
దివ్య సుగుణ బాల ధీవిశాల!

విద్యలేనివారు వింతగా దోచుచు
లోకువ గును యతడు లోకమునకు
దివ్వె లేని గృహము దీప్తి చెందని యట్లు
దివ్య సుగుణ బాల ధీవిశాల!

లయన్. సి. కామేశ్వరరావు 9290541254