Others

సుమధుర రామాయణం.. (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

203 సీత దూషణలకు నతిక్రోధమునను
యెవడ ననుకొంటివో సీత రుూ త్రిలోక
ములను యెవ్వరి పేర్విన భూతకోటి
కంప మొందునో యాదశ కంధరుడను

204 భీతిగొల్పెడు దశ శిరంబులు నిరువది
కన్నులలో విస్పు లింగముల్ రాలుచుండ
పర్వతాకారుడై రామపత్ని నెత్తి
రథమున నిడుకొని గగన వీధినేగె

205 సీత భయమున ప్రాణేశ్వరా రఘువర
లక్ష్మణాయని యార్త నాదమ్ముతోట
ఈ దురాత్ముడు నన్నధర్మగతి నపహ
రించుకొని పోవ నేలరారంచు నేడ్చె

206 కొండ గోగులార యంబర చరులార
భూరుహంబులార రామ విభున
కెరుక పరచుడంచు విలపించు చున్ననా
రాము సతిని విహగ రాజు జూచి

207.రావణా యెంత నీచపు వర్తనమ్ము
జేయుచుంటివి ముల్లోక సార్వభౌము
రామచంద్రుని కులసతి నపహరిచి
కాలపాశంబు బంధించు కొనకు మెడకు

208. అని జటాయువు రావణ అగు మనుచు
రాక్షశేశ్వరు రధమున కడ్డునిలచి
రామ హృదయేశ్వరి నపహరింపగలవె
ప్రాణములతోడ నేనుండ బంక్తి కంఠ

209.వాడి ముక్కున నిశితపు గోళ్ళ గీరి
రావణాసురు గాత్రంబు రక్తసిక్త
మొనరపం దానవ విభుడు మండిపడుచు
విహగ రేనిపై బాణ వర్షంబు గురిసె

210.పౌరుషంబున నెగసి పక్షీంద్రుడపుడు
వైరి రధముపైదూకి ధనుస్సు విరిచి
యరదమును గల్చ లంకేశు డవని దూకి
జానకిని వీడి ఖడ్గంబు చేతబూని

211.రామచంద్రుని పత్నికై పోరు సల్పు
వృద్ధుడౌ విహగపతి పక్షముల నరికె
పృధ్వి బడియె జటాయువు స్పృహను దప్పి
నాతనిం గౌగలించుక నేడ్చె సీత

212.రామ రామాయని విలపించు ధరణిజను
బట్టి రధమున వేసుక బరచె నసురు
డంబరపు వీధి లంకాభి ముఖముగాను
యట్టి దుష్కృత్యమునకు కంపించె పృధ్వి

213.దుష్టుడనను మృచ్చిలి పరువెత్తి పోవు
ఇన్నునా భర్తగనిన నా క్షణము నందె
నీవు నీవారు నంతమొందెదరు సుమ్ము
హీన చరితుడ రాక్షస గణవినాశ

214.అప్పుడొక్కరు డైనను తన్నుగావ
రామికిం క్షితిసుతవిలపించి పర్వ
తాగ్ర మందుగనె కపీశ పంచకమును
వీరు దెల్పరె నాగతి విభున కనుచు

215.్భషణంబుల కొంగున ముడిచి వారి
ముందుకు న్విసరె ఖలుండు జూడడయ్యె
కమలనయనను గొని ధర్మ గతిని వీడి
సంభ్రమంబునబరచు రయంమునందు

216.లంకకు నే్జరి తన తోడ దెచ్చుకున్న
మృత్యు దేవత నంతి పురమున దింపి
రాక్షస స్ర్తిల సీత రక్షణకు నునిచి
శీఘ్రమే రహస్యపు మందిరమును జేరి

217.గూఢచారుల నెనమండుగురను బిల్చి
మీరలేగి దండక వనమందు నున్న
మానవుల బరికింపుచు నదను దొరికి
నంత యిరువుర కడదేర్చు డనుచు బంపె

టంగుటూరి మహాలక్ష్మి