Others

సుమధుర రామాయణం.. (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

218. సీత కడకేగి జనకజా యింక నన్ను
జెట్ట బట్టి యఖండ భోగముల దేలు
మింకనా నరు రాజ్యవిహీను దీను
నేల గోరెడు యోగ్యుడ నేనె నీకు

219. అనగ జానకి యొక తృణమున్ గ్రహించి
రావణున కడ్డుగా నుంచి రాక్షస విను
ధర్మపరుడు నా భర్త సత్యస్వరూపు
డంబుజయుత సరోవర రాజహంస
కీటకంబువు నా దృష్టి కసుర నీవు

220. సీత బల్కిన పరుష భాషణల కతడు
కృద్ధుడై పిశాచ స్ర్తిలతో నశోక
వనము నందుంచి రుూమెను వశమునకును
దెండు మీరని వారికాదేశమిచ్చి

221. రావణుండట్లు బెదిరించిపోవ సీత
యా పిశాచవనితల మధ్యమున జిక్కి
పులుల నడుమను జిక్కిన లేడిరీతి
వనరు చుండె విధిన్ దూరుకొనుచు సాధ్వి

222. అంత రాముడు మాయలేడిని వధించి
తిరిగి వచ్చుచు దుర్నిమిత్తముల గనుచు
జానకీ లక్ష్మణులకు రాక్షసుల పీడ
గలుగకుండెడు గాకని దలచుచుండ

223. దీనవదనుడై యెదురుగ వచ్చుచున్న
తమ్మునింగని లక్ష్మణా సీత నట్లు
నొంటిగను వీడివచ్చితివేమి యసురు
లేమిజేతురొ కందుమే మరల సతిని

224. అగ్రజా సీత బల్కిననిష్టురోక్తు
ల విన శక్యముగాగిట్లు వచ్చితినన
నబల నొంటిగ విడిచి నీవిట్లువచ్చు
టంత సబబు గాదయ్య సుమిత తనయ

225. అనుచు రాముడు వడివడి పర్ణశాల
జేరవచ్చెడు సమయ మందెదరె వామ
నేత్ర భుజములు తడబడె నడుగులబట్టి
యవగుణములకు రఘపతి కలత జెందె

226. పర్ణశాల జొచ్చి పడతిని గాకన
సీత ధవుడు శోకతపత్తుడయ్యె
జనక రాజనందినీ నిన్నువిడిచి నీ
వెందు బోతి వంచు వగచె బిట్టు

227.మాలతీ పొద మాటున మగువ కొరకు
జూచు హరిణిమా నువు జూచితే మృగాక్షి
గౌతమీ తల్లి వైదేహి యెందు బోయె
దెల్పుడని దీనుడై భూత తతిని యడుగు

228.రాముడట్లు సీత నరయుచు మృగపక్షి
సంతతుల నడుగగ తలలనెత్తి
జివుకున నవిలేచి జూచె దక్షిణ దిశ
లక్ష్మణుండు వాని సంజ్ఞ నరసి

229.జూచితే అన్న! మృగముల సంజ్ఞ మనకు
లెలమి సూచించు చున్నవి నైరుతి దిశ
వెదకుదము మన మా దిక్కు వసుధ పుత్రి
నగ్రజా పొందెదవు మర్ల నీదు సతిని

230. అనుచు లక్ష్మణుండు బలుకగ రఘువంశ
వర్థనుండు తమ్ము తోడ గూడి
కొంత దూరమరుగ రాలిన పువ్వులు
బంగరు నగలు బడియుండ నేల

231. తమ్ముడూ ఈసుంబులె వుదయ మందు
సీకిచ్చితినని విలపించె రాము
డింక కొంత దవ్వరుగగ విరిగియున్న
రధము దానికి బూన్చిన గార్ధ్భములు

232. జచ్చి పడియుండె తునిగిన చాప కవచ
ములును ధూళిన బడియుండ జూచి రాము
డిచట జానకికై పోరి రిర్వురసురు
లనిదలంచెద సౌమిత్రి యనుచు బల్కి

233. తమ్ముడూ నేను పూజించు దేవతలును
నే నొనర్చెడు ధర్మకర్మలును నాదు
సతిని రక్షించగా లేదు జగతి నన్ను
ఇట్లు భావించె పౌరుషహీనుడనుచు

టంగుటూరి మహాలక్ష్మి