Others

విశ్వపు అంచులు తెలియతరమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం....

చాలాకాలం వరకు పాశ్చాత్యులు 200 మైళ్ళ మందమైన భూవాతావరణ పొర దాటిన తరువాత ఇక వాతావరణం వుండదని అంతా ఖాళీ ప్రదేశమే వుంటుందని భావించారు. తరువాత జరిగిన పరిశోధనలు ఈ అభిప్రాయం తప్పు అని నిరూపించాయి. అంతరిక్షం శూన్యమూ కాదు, నిర్జీవము కాదు. అది అత్యంత సజీవమైనదని తెలిసింది. ఇప్పుడు శాస్తజ్ఞ్రులు కెప్లర్ వోమనౌక ద్వారా అందిన సమాచారాన్ని అంచనా వేసి సౌర కుటుంబానికి అవతల 50వేల గ్రహాలున్నాయని తెలుసుకున్నారు. వీటిలో కొన్నింటిపై జీవం వుండవచ్చునని భావిస్తున్నారు. వీటిలో కొన్ని భూమి కంటే పెద్దవి. మనకు వందల కాంతి సంవత్సరాల దూరంలోని చిన్న నక్షత్రాల చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయిట. విశ్వం అనంతం. దాని అంచులు తెలియతరమా! జగన్మాత బ్రహ్మాండ భాండోదరి, విశ్వభ్రమణకారిణి కదా!
భూమిలోనున్న ఏ విత్తనమైనా సూర్యుని ప్రేరణవల్లనే మొలకెత్తి భూమిపైకి వచ్చి ఉద్భిజవౌతుంది. పిండ దశలోని మొక్క పెరుగుదలకు సూర్యుడే ప్రేరణ శక్తి. వృక్షం యొక్క కాండంలో ఏర్పడే వలయాలనుబట్టి ఆ వృక్షం యొక్క వయసు నిర్ణయించవచ్చని మనకు తెలుసు. కానీ అమెరికాలోని ట్రీరింగ్ రీసెర్చి సెంటర్ వారు 50 సంవత్సరాలుగా ఈ వలయాలపై పరిశోధన చేశారు. ఈ సంస్థ అధిపతి ప్రొ. డగ్లస్ ఒక ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నాడు. అది ప్రతి పదకొండు సంవత్సరాలకు రింగులు చాలా వెడల్పుగా ఉంటాయి దీనికి కారణం ప్రతి పదకొండవ సంవత్సరంలో సూర్యుడిపై అత్యధికంగా పరమాణువుల చర్య వుంటుందని, అపుడు సూర్యతేజం చాలా చురుకుగా వుంటుంది. అంటే సూర్యుడికి ఒక ప్రత్యేక నియతితో లయ వుంటుందని. ఆ సమయంలో రేడియో ధార్మిక శక్తి అత్యధిక ప్రమాణంలో వున్నట్లు తెలుస్తుంది. అలాంటి సంవత్సరంలో చెట్టు కాండంలో వెడల్పయిన వలయం ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం చెట్టులో ఏర్పడే వలయాలు, సంబంధిత సంవత్సరంలోని ఋతువుల స్థితిని తెలియజేస్తాయి. అనావృష్టి వున్నపుడు వలయం స్పష్టంగా వుండదు. ఎపుడు అనావృష్టి వుందో ఎపుడు అతిశీతలంగా వుందో ఈ వలయాలవల్ల తెలుస్తుందని వారి పరిశోధనలు తెలుపుతున్నాయి. తీవ్రమైన రేడియో ధార్మిక శక్తినుండి కాపాడుకోవడానికి భూమిపైన చెట్లన్నీ ఒకే రీతిగా స్పందిస్తాయి. ప్రతీ పదకొండవ సంవత్సరం వాటి బెరడును మందంగా మార్చుకుంటాయి. శీతోష్ణస్థితులలోని మార్పులను చెట్లు తప్పనిసరిగా గుర్తించి నమోదు చేస్తాయి అని తెలుస్తోంది. సూర్యుడు నాలుగు లక్షల కోట్ల సంవత్సరాల నుండి భూమిని వేడెక్కిస్తూనే వున్నాడు. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలవరకూ అది కొనసాగుతూనే వుంటుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ పదికోట్ల మైళ్ళ దూరం నుండి భూమి ఆ వేడిని గ్రహిస్తూనే వుంది. మన సౌర కుటుంబంలోని సూర్యుడు ఒక చిన్న నక్షత్రం. ఆకాశంలో మనం చూసే నక్షత్రాలు మన సూర్యుడికంటే చాలా పెద్దవి. వాటినుండి వేడి కిరణాలు నిరంతరం మనవైపు ప్రవహిస్తూనే వుంటాయి. విశ్వచైతన్యాన్ని అధ్యయనం చేస్తున్న శాస్తజ్ఞ్రులు, నిరంతరం ప్రవహించే విశ్వశక్తులలో కనీసం ఒక శాతం కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటారు. అందుకే అతి గంభీరమైన నామాలతో జగజ్జనని అయిన శ్రీమాతను ‘విశ్వభ్రమణ కారిణ్యై నమః, బ్రహ్మాండభాండో దర్యైనమః’ అంటోంది శాక్తేయ వాఙ్మయం విశ్వంలో ప్రతిదీ వేరొకదాని చుట్టూ పరిభ్రమిస్తూనే వుంటుంది. కానీ తిరగనిదీ పరిభ్రమించనిదీ ఏదైతే వున్నదో అది అంతిమం. అదే అనంతం యొక్క అంతిమ కేంద్రం. దానినే బ్రహ్మమని, సమగ్ర సత్యమెరిగిన మన మహర్షులు చెప్పారు. ఈ అంతిమ కేంద్రం దేనిచుట్టూ పరిభ్రమించదు.
సృష్టిలోని ప్రతి జీవికి ఏదో ఒక విభూతినిచ్చాడు పరమాత్మ. ఉదాహరణకు ప్రతి సంవత్సరం కొన్ని రకాల పక్షులు వేలాది మైళ్ళ దూరం ఎగిరి వలసపోతుంటాయి. మంచు బాగా కురిసే ప్రాంతం నుంచి వలసపోతాయి. మంచు కురిసే సమయాన్ని ముందుగానే అంచనా వేసి సరిగ్గా నెల ముందు వలస వెడతాయి. ఆధునిక పరికరాలు పరిశోధనాలయాలూ అందుబాటులోనున్న వాతావరణ శాస్తజ్ఞ్రులు కూడా అంత కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఏ రోజు మంచు కురవడం ఆరంభమవుతుందో సరిగా ఒక నెల ముందే ఆ పక్షులెలా తెలుసుకుంటాయి? జపానులో ఒక జాతి పక్షులు భూకంపం రావడానికి 24 గంటలు ముందుగానే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేస్తాయి. భూగర్భ శాస్తజ్ఞ్రులు ఆధునిక పరికరాలు పరిశోధనలు అందుబాటులో ఉన్న కనీసం రెండు గంటల ముందువరకూ భూకంపం వచ్చే విషయాన్ని నిర్దుష్టంగా చెప్పలేకపోతున్నారు.
..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590