Others

సమస్యలోనే పరిష్కారమూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సందేహమే’ సగం సమస్య అంటాడు ఓ ప్రముఖ మానసిక శాస్తవ్రేత్త. అసలు సమస్య కానిదానిని ‘సమస్య’ అనుకొని భయాన్ని పెంచుకోవడం, ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలోంచి చూసి భీతావహులు కావడం సర్వసాధారణంగా సామన్య మానవులంతా నిత్యం చేసే పని!
అందువల్లనే కొంతమందికి అన్నీ సమస్యలుగానే- అడ్డంకులుగానే అనిపిస్తాయి- కనిపిస్తాయి! అందుకే అన్నారు మన పెద్దలు- ‘అనుమానం పెనుభూతమని’! ఇక్కడ ‘అనుమానం’ అంటే అనవసరంగా మన మనసును కలవరపరిచే సందేహాలని- అభివృద్ధికి ఆటంకప్రాయమయ్యే అనవసర భయాలని విశే్లషించుకోవాలి!
‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై- యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయాత్తులై మధ్యముల్ - ధీరుల్ విఘనిహన్యమానులగుచు దృత్యున్నతొత్సాహులై ప్రారబ్థార్థము లుజ్జగింపరు ప్రజ్ఞానిధలన్ గావునన్’’ అని అక్షర లక్షలుగా చెప్పిన ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం ఎప్పటికీ నిత్య సత్యం!
పనిని మొదలే పెట్టకపోతే, పెట్టకుండానే అది చేయగలనా లేదా అని ఆలోచిస్తూ సమయం వృథా చేసుకొంటే సమయం, పని రెండూ కూడా వృథా నే అవుతాయ. అవగాహన కలిగించుకోకుండానే పనిని మొదలెట్టి ఆటంకం రాగానే అమ్మో ఎంత పెద్ద సమస్య వచ్చిందో దీనిని అధిగమించడం చేతకాని పని అంటూ పనిని నామం పెట్టడం కూడా అర్థం లేని వ్యర్థమైన శ్రమకిందే జమ అవుతుంది. అందుకే పెద్దలంతా పనిని గురించిపూర్తిగా తెలుసుకో ఆ తరువాత పని ని ప్రారంభించు. అపుడు ఫలితాలు అనుకొన్నట్టుగా ఉంటాయ అంటారు.
కనుక విజయంకన్నా దానికోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది. ప్రయత్నం లేని ఫలితం ఎలా ఆవించగలం? ఓటమి భయంతో ప్రయత్నించకుండా- ఏ పనీ ప్రారంభించలేకపోవటమే అన్నిటికన్నా పెద్ద సమస్య! నిజానికి మన జీవన పయనంలో అడ్డంకులుగా నిలిచేవి అనవసర భయాలు- సందేహాలూ- అనుమానాలే!
గెలుపు కేవలం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది- కానీ ఓటమి మనలో ఓర్పును పెంచి సహనంగా సానుకూల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నేర్పును అనుభవ పాఠంలా అందిస్తుంది. గాలిపటం గాలికి ఎదురీదినప్పుడే ఎత్తునకు ఎగురగలుగుతుంది.అదే గాలి వాలుని ఆశ్రయిస్తే దిగువకు దిగజారిపోతుంది. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా - మనం జీవితాన్ని ఎదురీది ఎగబ్రాకడానికే ఇతోధికంగా ఉపయోగపడతాయి.
జయాపజయాలు దైవాధీనాలు. గెలుపుఓటములు ఏ ఒక్కరికో అంటిపెట్టుకుని ఉండవు. ఒకరోజు ఒకరు గెలిస్తే మరోరోజు ఇంకొకరు గెలుస్తారు. అందుకే గర్వాన్ని ఎక్కించుకోకూడదు. ఈ నిజాన్ని నిగ్రహంతో గ్రహించగలిగేవాడు వివేకి- ఆ సమస్యల్నే అడ్డంకిలుగా భావించేవాడు అవివేకి! మేడమీదకి చేరాలంటే మెట్లుండాలి. అదే మెట్లను ఆటంకాలుగా భావిస్తే- మనం ఎప్పటికీ మేడమీదకి చేరుకోలేం.
కాబట్టి సమస్యలపట్ల సదవగాహన సానుకూల దృక్పథం- సరైన మార్గానే్వషణ వగైరాది లక్షణాలను అలవరచుకుంటే లక్ష్యం చేరుకోవడం మనం భయపడినంత అసాధ్యమైన పని కాదు. ఉత్తమ పురుషులెప్పుడూ తాము తలపెట్టిన కార్యాచరణలో ఎన్ని ఆటంకాలెదురైనా చేపట్టిన పనిని కడదాకా పట్టుదలతో కొనసాగించి విజయ లక్ష్యాన్ని చేరుకుంటారు.
విజయసారధి నెపోలియన్ కూడా- అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుందని ఘంటాపథంగా చెప్పాడు. వైఫల్యం నిరాశకు ప్రేరణ కాకూడదు. సరిక్రొత్త ప్రేరణకు నాంది కావాలి. ముఖ్యంగా నేటి యువతీయువకుల్లో పేరుకుపోతున్న నైరాశ్య ధోరణి లేని సమస్యలకు జీవం పోస్తోంది. తాళంతో బాటే దాని చెవి కూడా కనిపెట్టబడిందని తెలుసుకుంటే ఈ లోకంలో ఏదీ సమస్య కాదు! అన్నీ అత్యంత సన్నిహితమైన సమాధానాలే!

--మరువాడ భానుమూర్తి