Others

విశ్వచైతన్యం -2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శరీరం పంచభూత సమ్మేళనం అంటే పంచతత్త్వాలు కలిగినది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం- పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంధాలు. అంటే పంచతన్మాత్రలు. పంభూత స్థితినే ‘ప్రపంచం’ అని చెప్పుకోవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో పంచభూతాలను పాండవులతో పోల్చారు మహావతార్ బాబాజీ ముఖ్య శిష్యులైన లాహిరీ మహాశయులు. వారి ప్రేరణతో వ్రాస్తున్న విషయ విస్తృతి. మూలాధారం - భూమి- సహదేవుడు- స్థితి- హోంమినిస్టర్- లక్షణం-గంధం! స్వాధిష్ఠానం- నీరు- నకులుడు- స్థితి- విదేశాంగ శాఖ మంత్రి-లక్షణం- నేయి. మణిపూరకం - అగ్ని-అర్జునుడు-స్థితి-ఆర్థికమంత్రి- లక్షణం- విభూది! అనాహతం- వాయువు - భీముడు- స్థితి- రక్షణ మంత్రి- లక్షణం- ఆవిరి! విశుద్ధం - ఆకాశం- ధర్మరాజు-స్థితి- ప్రధానమంత్రి- లక్షణం- శబ్దం/వాక్కు ఆజ్ఞాచక్రం - నక్షత్రం - చంద్రుడు- స్థితి - రాజు- లక్షణం- వెనె్నల! సహస్రారం - పాలపుంత - సూర్యుడు- స్థితి - చక్రవర్తి - లక్షణం - వెలుగు! అంతా మనమే! అన్నీ మనమే! మనలోని దివ్యతత్త్వం పరిమళిస్తుంది ధ్యానంవల్ల! ధ్యానం అంటే ఆత్మ పరిమళం! ధ్యానయోగం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం! ప్రతి మనిషికి తనలో పలు దివ్య పరిమళం ఉంటుంది. అయితే తనలోకి తానే చూసుకుంటే తప్ప ఆ దివ్య పరిమళం సోకదు. అది గులాబీల వాసన కాదు. అది గంధం- సుగంధం- దివ్యపరిమళం! ‘సహదేవుడు’ అంటే తనను తాను తెలుసుకుంటున్నవాడు. ఆధ్యాత్మిక పథంలో కుండలినీ ప్రయాణంలో మొదటి మెట్టు ధ్యానం! సోల్ ఎవల్యూషన్ యొక్క ప్రథమ స్థితి. ధ్యానంవల్లనే మనను మనం తెలుసుకోగలం. మనమెవరం, ఈ భూమిపైకి ఎందుకొచ్చాం, మన జీవిత ప్రణాళిక ఏమిటి? మన జీవన సాఫల్యానికి మనం ఏం చేయాలి? ఈ జ్ఞానం అంకురిస్తుంది ధ్యానంలో! మన పట్ల మనకు ఇష్టం కలగడం ప్రారంభమవుతుంది. మనపట్ల మనకు ధ్యాస మొదలవుతుంది. శ్వాసమీద ధ్యాసవల్ల! ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస!
ధ్యానం చేసినపుడు- ఆ ధ్యానంలో స్థిరపడినపుడు అది మూలాధార స్థితి! స్థిరత్వం! ఈ స్థిరత్వం భూమితత్త్వం- భూమాత లక్షణం- ఇది సహదేవ స్థితి! ధ్యానంలో స్థిరత్వం దొరికినపుడు ఇక మరేమీ చేయాలని అనిపించదు. ఆ అద్భుత ధ్యానస్థితిలో బ్రహ్మరంధ్రం తెరచుకుని విశ్వశక్తి ఆవాహనం (కాస్మిక్ ఎనర్జి) జరుగుతూ వుంటే నోరంతా విశ్వశక్తితో నిండిపోతుంది. పళ్లు విశ్వశక్తితో నిండిపోయి ఆనందం అంటే ఏమిటో అవగతం కావడం ప్రారంభిస్తుంది. శరీరమంతా ఒక విభ్రమానికి లోనయి పులకించిపోతుంది. విశ్వశక్తి శరీరమంతా ప్రాకుతూ శరీరంలోని అణువణువూ నిండిపోతుంది. నాడీమండలమంతా శుద్ధి ప్రక్రియ నడుస్తూ ఉంటుంది.
క్రమకాలంలో ధ్యానంలో ‘స్థిరత్వం’ కలుగుతుంది. ఇక ఎక్కడికీ వెళ్ళాలని అనిపించదు. అది గృహ మంత్రిత్వ స్థితి తనను తాను తెలుసుకుంటున్న స్థితి- సహదేవస్థితి! గంధం అంటే పరిమళం. తొలకరి చినుకులు పడినపుడు మట్టివాసన చాలా అద్భుతంగా పరవశంగా అనిపిస్తుంది. అదే భూమాత లక్షణం- గంధం. ధ్యానంలో ఇలాంటి గంధం వాసన కలుగుతుంది. ధ్యాన వర్షంలో మనలోని దివ్య పరిమళం విశ్వశక్తితో జతగూడి మన ‘ఆత్మ గుబాళింపు’ మనకు అవగాహనలోకి రావడం ప్రారంభిస్తుంది. అంగిట్లోంచి క్రమకాలంలో అమృతధార ప్రవహిస్తుంది జొల్లు రూపంలో! ఆ దివ్యధార ధ్యానుల స్వంతం! కస్తూరి మృగం తన జోడును వెతుక్కోవాలనే భావన తనలో కలగగానే తన శరీరం నుండి కస్తూరిని భూమిపైకి విడుస్తుంది. ఆ తన స్వంత కస్తూరి పరిమళం ఆ కస్తూరి మృగాన్ని విపరీతమైన ఆనందానికి లోనుచేస్తుంది. అయితే తన శరీరం వెనుక భాగం నుండి విడుదల అయ్యే పరిమళ కస్తూరి దానికి కనిపించదు. ‘్ధ’అంటే ఆత్మతో ‘యానం’ అంటే ప్రయాణం! ధ్యానం అంటే ఆత్మప్రయాణం. శరీరంతో ప్రయాణిస్తూ ఉన్నాం రెండు కాళ్ళతో. మనస్సుతో ప్రయాణిస్తూ ఉన్నాం ఆలోచనలతో! బుద్ధితో ప్రయాణిస్తూ ఉన్నాం నిర్ణయాలతో- వికాసంతో! అలాగే ఆత్మతో చేసే ప్రయాణమే ‘్ధ్యనం’ స్థిరత్వం! భూతత్వం!

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908