Others

విశ్వచైతన్యం -3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకులుడు! న-కులుడు=కులం లేనివాడు! జలం అంటే నీరు! నీటికి కులం లేదు. స్వాధిష్ఠానం అంటే నీరు- విస్తృతం. నీరు పల్లెమెరుగు! ప్రవహించడమే నీటి లక్షణం. అలా నీటిలాగా కులాతీతమైంది ఆత్మజ్ఞానం.
నీటికి జాతి మత కుల వర్గ దేశ కాలాలు, భేదాలు లేవు. నైలునది అరేబియా దేశాల్లో ఈజిప్టు వరకూ ఏడు దేశాల్లో సమృద్ధిగా ప్రవహిస్తూ ఈజిప్టు దేశం చివరలో ఫ్రాన్స్ సరిహద్దులో సముద్రంలో కలుస్తుంది. మరి అరేబియా దేశాల్లో వర్షపాతం చాలా తక్కువ. ఆ నైలు నది ఏడు దేశాల్లో సమృద్ధిగా ప్రవహించేంత నీరు ఎక్కడినుండి వస్తుందో ఆశ్చర్యం. అలాగే గంగానది హిమాలయాల్లో పుట్టి గంగ- అలకనంద- భాగీరథి.. ఇలా వివిధ నామాలతో ప్రసిద్ధమవుతూ, ఎన్నో ఉపనదులను కలుపుకుంటూ చివరికి కలకత్తాలో హుగ్లీ అని పిలవబడి సముద్రంలో కలుస్తుంది- ఇదీ జల సమృద్ధి.
ఎలాగైతే నీటికి అవధి లేదో అలాగే జ్ఞానానికీ అవధి లేదు. అది పుస్తకంలో పది శాతం, మరి మస్తకంలో తొంభై శాతం దొరుకుతుంది. పుస్తకం అంటే మన మెదడు (బాహ్య చేతనం- కాన్సియస్ మైండ్)! మస్తకం అంటే మేధస్సు (అంతఃచేతనం-సబ్‌కాన్షియస్ మైండ్)!
ధ్యానం ద్వారా జ్ఞానం - జ్ఞానం ద్వారా ముక్తి
మూలాధారంలో స్థిరత్వం- ‘సహదేవుడు’- తనను తాను తెలుసుకుంటున్నవాడు. స్వాధిష్ఠానం అంటే విస్తృతత్త్వం- ‘నకులుడు’- తాను తెలుసుకున్నది ఎప్పటికపుడు ఇతరులకు బోధించేవాడు. ఒక దేశంలో పుట్టినది ఎన్నో దేశాల్లో ప్రవహిస్తూ తనలోని జలధారను కోట్లాది జీవులకు ప్రాణం పోస్తున్నట్లుగా, అక్షరం ముక్క రాని వారు కూడా ధ్యానం చేస్తే తమలోని జన్మ జన్మల ప్రేరణలతో జ్ఞానం పొందుతారు. ఆధ్యాత్మికమైన సత్యాలను వినడం ప్రారంభిస్తారు. తాము తెలుసుకున్న కొద్దో గొప్పో ఇతరులకు బోధించడం ప్రారంభిస్తారు- ఇదీ జ్ఞానసమృద్ధి.
ఇలాంటివారు జాతి మత కుల భేదాలను పాటించక నీరు ఎలా ప్రవహించి తనను తాను సమర్పించుకుంటుందో, అలాగే తమ జ్ఞానాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ విస్తృతి పొందుతారు- విదేశాంగ శాఖా మంత్రులు వీరు! నకులురు!
జాతి మత కుల భేదాలకు అతీతమైనవారు! ఇదే స్వాధిష్ఠానం!
అర్జునుడు - అగ్ని-విభూది-మణిపూరకం
‘అర్జునుడు అంటే ఆర్జించేవాడు’! అగ్ని- తేజం-విభూది- ఇది మణిపూరక స్థితి. స్వాధిష్ఠాన స్థితిలోని న-కులుడు తన ఆత్మ ప్రయాణంలో తదుపరి మజిలీగా మణిపూరకాన్ని చేరుకుంటాడు. అర్జునుడవుతాడు. అతడు ఆర్థిక మంత్రి.
స్వాధిష్ఠానమైన నీరు అంటే వరుణుడు. వరుణుడు అగ్నికి గాండీవాన్ని అక్షయ తూణీరాన్ని ఇస్తాడు. అగ్ని వాటిని మణిపూరక స్థితిలోని అర్జునునికి ప్రసాదిస్తాడు. ప్రతి ఆత్మ స్వరూపుడూ తన ఆత్మ ప్రయాణంలో తన సాధన - బోధన వల్ల మణిపూరకానికి చేరుకున్నపుడు అతడి వెనె్నముక ‘గాండీవం’లో ఒక ఇంద్రాస్త్రం (వజ్రాయుధం)లా తయారవుతుంది. ఈ స్థాయిలోని ‘యోగి’ యొక్క మణిపూరకం ఒక ఎనర్జీ రిజర్వాయర్‌లా ఉంటుంది. ఇదొక అనంత శక్తి క్షేత్రం- అనేక విభూదులకు నిలయం- తేజోమండలం- అక్షయతూణీరం! ఇదొక గీజా మహాపిరమిడ్! శక్తి మాథ్యమం!
అర్జునుడు నిండు కుండ- అగ్నిప్రసాదితమైన గాండీవం అనే ధనుస్సు అతని ఆయుధం! అక్షయతూణీరం అర్జునుడి సంపద- ఎనర్జీ. ఎన్ని బాణాలు వేసినా అక్షయ తూణీరంలోంచి అనంతంగా బాణాలలు వస్తూనే ఉంటాయి. అలాగే ఒక యోగి ఎంత ఎనర్జీని (శక్తిని) విడుదల చేసినా అనంతంగా శక్తి ప్రభవిస్తూనే ఉంటుంది గంగానదిలా! ‘కండ కుండలించి కుండలినాడించి జమిలి మోత నాగస్వరము నూప
నాగుపాము లేచి నాట్యమ్ము చేయును కాళికాంబ హింస కాళికాంబ!
..........................ఇంకావుంది

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908