Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.వనస్పతులు - పువ్వులు లేకుండానే కాయలు కాచే చెట్లు
2.ద్రుమములు - పువ్వులు, కాయలు రెండూ గల చెట్లు
3.లతలు - పాకే తీగలు
4.గుల్మములు - బాగా పొట్టిగా ఉండి నిండా కొమ్ములుండే చెట్లు. ఇలాంటి చెట్లను నాటేందుకు ఈ గ్రంథం మూడు విధానాలను సూచిస్తోంది.
1.గింజలను నాటడం 2.కొమ్మలను నాటడం 3.అంటు కట్టడం.
వీటి వివరాలను ఈ గ్రంథంలో చర్చించారు.
ఇళ్ళలో చెట్లు పెంచుకోవటానికి కొన్ని విధి నిషేధాలను ఈ గ్రంథం సూచిస్తోంది. ఉదాహరణకు ఇంటికి తూర్పున మఱ్ఱిచెట్టు మంచిది, దక్షిణాన మేడి మంచిది, పశ్చిమాన రావి మంచిది. ఉత్తరాన జువ్వి మంచిది.
ఇవికాక ఈ గ్రంథంలో మట్టిలోగల రకరకాల గురించి, వృక్షపోషణ గురించి, వృక్షాల వ్యాధుల గురించి, వాటిని నివారించే ఔషధాలగురించి, పురుగు మందుల గురించి, నేలలోని దోషాల గురించి, చెట్లకు చలిగాలుల వంటి బహిరంగ కారణాల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి, ప్రకృతి సిద్ధమైన ఎరువుల గురించి చర్చించారు. ఇవాళ మనం ఆధునికమని భావిస్తున్న అనేక హార్టికల్చర్ విధానాలు ఈ గ్రంథంలో కనిపిస్తున్నాయి.
ఉదాహరణ: 1.పుష్పోత్తికి, ఫలోత్పత్తికి ఋతువులను మార్చడం. 2.వాటి పరిమాణాన్ని, రంగును, వాసనను కూడా మార్చడం. 3.సంకర వంగడాల సృష్టి. 4.పండ్లను కృత్రిమంగా పండించడం వగైరాలు.
ఈ రంగంలో అనే్వషించవలసిన గ్రంథాలు
1.ఆగతత్త్వలహరి 2.కృషికౌముది 3.వశిష్ఠతంత్రము 4.లోకసంగ్రహము 5.సౌదామినికళ 6.మేఘోత్పత్తి 7.కృషిశాస్తమ్రు 8.కారక ప్రకరణము 9.సూచివాన కర్మ 10.ఉద్భిజ్జతత్త్వ ప్రకరణము
పశుశాస్తమ్రు
పశుపక్షులను గృహావసరాలకోసం కానీ, వ్యవసాయ అవసరాల కోసం కానీ, యుద్ధావసరాల కోసం కానీ, చికిత్సావసరాల కోసం కానీ వినియోగించుకునే విధానాలను ఈ శాస్తమ్రు చర్చిస్తోంది.
ఈ శాస్త్రంలో అనే్వషించవలసిన గ్రంథాలు
1. మృగచర్మీము 2. గోశాస్తమ్రు 4. కుక్కుటశాస్తమ్రు వగైరా.
5. భూగర్భ శాస్తమ్రు (నిధి శాస్త్ర, రత్నశాస్త్రాలు దీనిలో విభాగాలే)
భూమి లోతుపొరలలో ఉండే లోహాది పదార్థాలను అంచనా వేయడం, అవసరమైన చోట్ల గనులను తవ్వటం, ఆ తవ్వకాలలో లభించిన రకరకాల పదార్థాలతో ఔషధాలను తయారుచేయటం, ఆ పదార్థాలలో వుండే దినుసులను గుర్తించేందుకోసం ధూమశాస్త్రాన్ని వినియోగించడం మొదలైన విషయాలు ఈ శాస్త్రంలో వున్నాయి. ఈ శాస్త్రంలో మణి అనే పదాన్ని రత్నజాతి ద్రవ్యము, విలువైన రాయి మొదలైన అర్థాలలో వాడారు. దర్పణం అనే పదాన్ని వివిధ ఆకారాలు గల అద్దాలు, స్ఫటికాలు మొదలైన అర్థాలలో వాడారు.
వరాహమిహిరుడి జలార్గళ శాస్తమ్రు: ఈ గ్రంథం భూగర్భ శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగము. ఇది 125 శ్లోకాలున్న చిన్న గ్రంథం. దీనిలో జ్యోతిశాస్త్రం కొంత, భూగర్భ శాస్త్రం కొంత కలిసిపోయి వున్నాయి. భూగర్భము లోపలి పొరలలో నీరు ఎక్కడ వుంది, దాని లోతెంత, దానికోసము భూమిని తవ్వేటపుడు అడ్డంవచ్చే రాళ్ళను పగులగొట్టడం ఎట్లా- ఇలాంటి విషయాలను చర్చించారు. ఉప్పునీటి బావిని తీపి నీటి బావిగా మార్చే ప్రక్రియలను కూడా దీనిలో చర్చించారు. దీనికోసం వాడవలసిన దినుసులను చెప్పారు గానీ, వాటి మోతాదులను దీనిలో చెప్పలేదు.
ఈ రంగంలో అనే్వషించవలసిన కొన్ని ముఖ్య గ్రంథాలు
1. ధాతు సర్వస్వము 2. మణిరత్నాకరము 3. ధూమప్రకరణము 4. నవరత్న లక్షణము 5. మణికల్పప్రదీపిక 6. నిధి ప్రదీపిక 7. మణిప్రకరణము 8.రత్నపరీక్ష.
లోహశాస్తమ్రు
ఈ శాస్త్రంలో ప్రస్తావించిన లోహ మిశ్రమాలు కొన్ని ఈనాటి ఆధునిక విజ్ఞానానికి సాధ్యంకావని పరిశోధకులు అంటున్నారు. విమాన శాస్త్రంలో అనేక లోహ మిశ్రమాలు వర్ణింపబడినాయి. వాటిల్లో కొన్ని అపూర్వ మిశ్రమాలను డా. సి.ఎస్.ఆర్.ప్రభు లాంటివారు ప్రాచీన లోహశాస్త్రం ఆధారంగా తయారుచేశారు. ఈ విధానాలన్నీ ఈనాటి ఫర్నేసుల రూపంలో కాకుండా, ప్రకృతి మైత్రీ సంపన్నమైన విధానాలలో వున్నాయి.
ఈ రంగంలో వెతకవలసిన కొన్ని ముఖ్య గ్రంథాలు
1.లోహతత్త్వ ప్రకరణము 2.ప్రపంచలహరి 3.తోమలక్ష్మి ప్రయోగతంత్రము 4.లోహరహస్యము 5.లోహరత్నాకరము 6.స్వర్ణరత్నాదిపరీక్ష 7.లోహప్రకరణము 8.అండకౌస్త్భుము
7.రస శాస్తమ్రు లేక రసాయన శాస్తమ్రు
ఈ శాస్త్రంలో పాదరసానికి చాలా ప్రముఖ సాధనముంది. ఆనాటి వారు పాదరస వినియోగంతోనే రకరకాల యంత్రాలను నిర్మించినట్లు తెలుస్తోంది. ఔషధాలలో కూడా పాదరసాన్ని విరివిగా వాడేవారు. రసాయన ద్రవ్యాలను, రసాలు, ఉపరసాలు, మహారసాలు అని మూడుగా విభాగం చేశారు.
ఈ రంగంలో లభించవలసిన కొన్ని ముఖ్యమైన గ్రంథాలు
1.రసరత్నముచ్చయము
2.రసరత్నాకరము- రసఖండము, రసాయనఖండము, రసేంద్ర ఖండము, మంత్ర ఖండము, వాదఖండము
3.రసేంద్ర చూడామణి, 4.రససారము, 5.రసకౌముది, 6.రసేంద్ర విజ్ఞానము, 7.రసపద్ధతి, 8.రసేంద్రసార సంగ్రహము, 9.ద్రావక ప్రకరణము, 10.రసేంద్ర చింతామణి, 11.రసకామధేనువు, 12.రసమాధవము, 13.రసాధ్యాయము, 14.నాగార్జునతంత్రము,15.రసోపనిషత్తు.
8.ఆయుర్వేదము
లభిస్తున్న ఆయుర్వేద మూల గ్రంథాలను పరిశీలించగా, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్య సంబంధమైన సమాచారాన్ని సేకరించి విశే్లషించే పద్ధతి అలనాటి వైద్య పరిశోధకుల దగ్గర ఉండేదని అర్థమవుతోంది. ఇలా వివిధ ప్రాతాలనుంచి సమాచారాన్ని సేకరించే వైద్యులను ‘చరకులు’ (సంచార వైద్యులు) అని పిలిచేవారు. ఆ రోజుల్లో శస్తచ్రికిత్సను విస్తారంగానే ఉపయోగించేవారు కానీ దాన్ని అనివార్య పరిస్థితులలోనేవాడేవారు. గర్భంలో ఉండే శిశుకి బయటినుంచి శస్త్ర చికిత్స చేసే విధానాలు వారి దగ్గర వుండేవని తెలుస్తోంది. అవయవాల మార్పిడి చేసే శస్త్ర చికిత్స వారికి తెలుసు.
వారు ఆ రోజుల్లో అనేక విధాల పశువుల పక్షుల మల మూత్రాలను, మరణించిన జంతువుల ఎముకలనూ- ఇలా పశుపక్షి సంబంధమైన పదర్థాలను వైద్యం కోసం విస్తారంగా వినియోగించేవారు. పరిశోధనల కోసం పశువులను హింసించడం ఆనాటి వారికి సమ్మతం కాదు. దాని బదులు పశుపక్ష్యాదుల సహజ సిద్ధమైన చర్యలను పరిశీలించడం ద్వారా వారు, అనేక వైద్యరహస్యాలను కనుక్కోగలిగారు.
ఈ రంగంలో అనే్వషించవలసిన కొన్ని గ్రంథాలు
1. రుక్‌హృదయతంత్రము 2. అగ్నివేశతంత్రము 3. ప్రాణలక్ష్మీ ప్రయోగ తంత్రము 4. మాండవ్యతంత్రము 5. సుశ్రుత శరీరము 6. ఓషధీకల్పము 7. విషనిర్ణయాధికారము 8. అగస్త్యతంత్రము 9. ఔషధకల్పము
9.వ్యోమయాన శాస్తమ్రు (విమాన శాస్తమ్రు)
ఇది వాయు ఆధారిత విమాన శాస్తమ్రు, ఆకాశాధారిత రోదసి వాహన శాస్తమ్రుల మిశ్రమంగా కనిపిస్తోంది. ఈ శాస్త్రంలో ఆకాశాన్ని ఏడు భాగాలుగా విభజించి, వాటికి సప్తమారుత స్కంధములు అని పేరు పెట్టారు.
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి