Others

తరగతి గది ఒక రీసెర్చ్ ల్యాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఉపాధ్యాయుడు ‘పాఠం అర్థమైందా?’ అని మధ్యలో అంటుంటాడు. అది ఆయనకు ఊతపదమా? ఆ పదం ఆయన ఉచ్ఛరించగానే ముందు బెంచీలో కూర్చున్న విద్యార్థులు వెంటనే తల ఊపుతారు. పిల్లలు తల ఊపటానికి, ఆ పదానికి సంబంధం ఏమిటి? కొన్నిసార్లు విద్యార్థే ఒంటరిగా కూర్చొని పుస్తకం చదువుతూ చదువుతూ.. ఆలోచిస్తూ చెంగున ఒక్కసారి ఎగురుతాడు. ‘పాఠం ఇంతేనా?’ అంటాడు.. దొరికిందిరా పిట్ట అని కూడా అంటాడు. పాఠ్యాంశాలు అవగాహన అయితే విద్యార్థి ముఖవర్చస్సే మారుతుంది.
అర్థమైందా? అని ఉపాధ్యాయుడు అడగటమంటే? విద్యార్థి మెదడులో ఏదో ఒక ప్రక్రియ జరిగితేనా కదా? ఈ ప్రక్రియపై మానసిక శాస్త్రం పరిశోధించవలసిన అవసరం ఉంది కదా! ఇది పరిశోధనా యుగం అంటాం కాబట్టి అవగాహనకు మేధస్సులో జరిగే ప్రక్రియకు శాస్తవ్రేత్తలు చాలా శోధించవలసి ఉన్నది. విద్యార్థికి ప్రకృతిలో కచ్చితంగా ఏదో ఒక క్రమం కనపడుతుంది. జూన్ వచ్చిందంటే వర్షాకాలం. అక్టోబర్ నుంచి చలికాలం, ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఎండాకాలం. ఇలా ప్రకృతిలో ఒక క్రమం ఉంది. ‘రెండు, నాలుగు, ఆరు’ అన్న తర్వాత ఉపాధ్యాయుడు నోటి నుంచి తర్వాతి పదం రాకముందే- విద్యార్థి ‘ఎనిమిది’ అంటాడు. ఒక పదాన్ని మనం ఉచ్ఛరిస్తే దానిలో ఉండే అక్షరాలను విద్యార్థి చెబుతాడు. క్యాట్ అనగానే సిఎటి అంటారు. ధ్వనికి అక్షరానికి ఒక ప్యాట్రన్ (క్రమం) ఉన్నది అదే మాదిరిగా విద్యార్థి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కొన్ని ప్యాట్రన్స్‌ను గుర్తుపడతాడు. ఆ గుర్తుపట్టటమే ‘అవగాహన’. గుర్తించానన్న ఆనందంలో విద్యార్థి నవ్వుతాడు, గంతువేస్తాడు. కాబట్టే సాధనలో అవగాహనే ప్రధానం. అవగాహనే విద్యార్థికి ప్రేరణ కలిగిస్తుంది. అవగాహన లోపమైనప్పుడు విద్యార్థికి విసుగు కలిగినట్లవుతుంది. ఇలాంటి ఎన్నో ప్యాట్రన్స్‌ను విద్యార్థులు తమంతటతామే శోధిస్తుంటారు. అది తెలియగానే సాధనలో కొత్త మార్గం వారికి కనపడుతుంది. విద్యార్థి కొన్నిసార్లు ఉపాధ్యాయుని కంటే ముందే సమస్యకు పరిష్కారం చెబుతాడు. ఆ ప్యాట్రన్స్ జ్ఞానంతో- సమస్యల చిక్కుముళ్లను విప్పుతూ ఉంటాడు. అవగాహన అనేది విద్యార్థి సంపాదించిన మేధోపరమైన ప్రక్రియ. తరగతి గదిలో 40 మంది విద్యార్థులుంటే ఒక్కొక్కరికి ఒక రకమైన అవగాహన ఉంటుంది. అందుకే ‘పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి’ అన్నారు. సాధనతో విద్యార్థి జ్ఞానంలో, ప్యాట్రన్స్‌లో అవగాహన పెంచుకొని వివిధ భాష్యాలు చెబుతాడు. అదే విద్యార్థి పరిశోధన. అందుకే తరగత గది ఒక రీసెర్చ్ ల్యాబ్ వంటిది.

-చుక్కా రామయ్య