Others

ఆది అంతము లేనిది! (పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
అవ్యక్త్యో యమచిన్త్యో యమవికార్యో యముచ్యతే
తస్మాదేవం విదిత్యైనం నానుశోచితుమర్హసి
భావార్థం: ఆత్మ యిట్టిదని చెప్పరానిది, అది అవ్యక్తము, మార్పులేనిది, ఊహింపరానిది. ఇంతకుముందు చెప్పినట్లుగా అధిక శక్తిగల సూక్ష్మదర్శినితో గూడా ఆత్మను చూడజాలము కావుననది అవ్యక్తము. ఆత్మయొక్క ఉనికి, వేద ప్రమాణమువలన తప్ప, ఇంకొక ప్రయోగాత్మక విధముగా నెవ్వరును, నిశ్చయింపలేరు. ఎందువననగా ఆత్మ యొక్క ఉనకి, భావనలో యధార్థమైన, అవగాహన చేసికొనుటకితరాధారములు లేవు. తల్లి చెప్పిన ప్రమాంమును బట్టియే కదా తండ్రిని గుర్తించుట లోకమున జరుగుచున్నది. ఇదియునట్టిదే యని భావించవలెను.
శ్లో జాతస్యహి, ధృవో మృత్యుర్ద్రువం, జన్మమృతస్యచ
తస్మాద పరిహార్యే - ర్దే నత్వం శోచితుమర్హసి

అవ్యక్తాదీని, భూతాని వ్యక్తమధ్యని భారత
అవ్యక్తనిధనానే్యన, తత్రకా పరిదేవనా

ఆశ్చర్యవత్, పశ్యతి, కశ్చిదేనమ్, ఆశ్చర్యవద్, వదతి, తథైవచాన్యః
ఆశ్చర్యవచ్చైనమన్యః శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్

దేహి నిత్యమవధ్యో యందేహే సర్వస్య భారత
తస్మాత్, సర్వాణి భూతానినత్వం శోచితుమర్హసి
ఇవి భగవద్గీత రెండవ అధ్యాయంలో వరుసగా 27, 28, 29, 30 శ్లోకాలు.
భావార్థం: పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించినవాడు మరల పుట్టక తప్పదు, అందుచే పరిహరించుటకు వీలులేని ధర్మ నిర్వహణయందు వ్యక్తి దుఃఖింప పనిలేదు. సృజింపబడిన జీవులన్నియు మొదట అవ్యక్తములే కదా! పుట్టిన తరువాతనే వ్యక్తములగుచున్నవి. మరణించిన పిదప, మరల అవ్యక్తములగుచున్నవి. పంచభూతములవలె, ఆకావ, వాయు, అగ్ని, నీరు, భూమి, ఒకదాని నుండి ఒకటి వ్యక్తమైనట్లు, సూక్ష్మమైన అవ్యక్త స్థితి నుండి, వ్యక్తస్థితి బయటపడును. కాలక్రమమున, భౌతిక దేహములన్నియు నశించుననియు (అస్త వస్త ఇమే దేహాః) ఆత్మ నిత్యమనియు (నిత్యస్యోక్తాః శరీరిణః)చెప్పు వైదిక సిద్ధాంతము ననుసరింపవలసియున్నది. దేహమునందు వసించు ఆత్మ ఎన్నటికిని చంపబడదు కావున ఏ జీవుని గురించియు దుఃఖించవలసిన పనిలేదని భగవద్గీత మనకు తెలియచేయుచున్నది.
మనిషి, మృత్యుస్పహ కలిగినప్పుడల్లా నాకు మరణం రాకూడదని కోరుకుంటాడు. మృత్యువు ప్రతి జీవికి అనివార్యమని తెలిసి కూడా మనిషి అతి విచిత్రంగా అది తనకు తెలియనట్లు, తనకు సంబంధించిన విషయం కానట్లు ప్రవర్తిస్తుంటాడు.
శరీర అశాశ్వతను గురించి, నిత్యము సత్యము అయిన ఆత్మ తత్త్వాన్ని గురించి తెలుసుకున్నవారు కూడా వారి నిజ జీవితాలలో ఆ విషయం తెలియనట్లే ప్రవర్తిస్తుంటారు. ప్రతి వ్యక్తి మరణ సన్నివేబులు, సంఘటనలను చూచినపుడు తాత్కాలిక వైరాగ్యాన్ని పొందుతుంటారు. స్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం లాంటివిట్టివే! మరణం గురించి స్వానుభవం కాని అనుభూతిగాని తెలిసికొనుటకువీలు లేదు. కారణం ఏమంటే మరణించిన వ్యక్తి తాను పొందిన మరణానుభూతిని గురించి కాని, మృత్యువు యొక్క నిజ స్వరూపాన్ని గురించి కాని తెలియచెప్పటానికి అవకాశం లేకపోవడమే.
కానీ శ్రీ భగవాన్ రమణ మహర్షి ఒకసారి తీవ్రమైన జ్వరీపడితుడైనపుడు తాను ఆత్మరూపుడై సాక్షీభూతునిగా ఉండి తాను మరణించినట్లు అప్పటి తన శరీర స్థితని మరణానికి ముందు తర్వాత తన శరీరంలో జరిగిన మార్పులు, క్రియలు ఇతరులకు వివరించగలిగారు. మహాయోగులకు సిద్ధ పురుషులకు మాత్రమే ఇది సాధ్యము. కొందరు ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు చెప్పినదానిని బట్టి కొన్ని వేల తేళ్ళు ఒకేసారి కుడితే కలిగేంత బాధను ప్రాణం విడిచే సమయంలో వ్యక్తి అనుభవిస్తాడని విశదమవుతోంది. చేసిన పాప పుణ్యాలను బట్టి మరణానంతరం సూక్ష్మ శరీరం నరకాది బాధలను పొందుతుందని చెబుతారు. శ్రీ అరవిందులు రచించిన ‘సావిత్రి’ అనే గ్రంథం మరణం గురించి విస్తృతంగా విశే్లషించింది. ఇటీవలి కాలంలో పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, షిర్డీ సాయిబాబా, సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, రాఘవేంద్రస్వామి లాంటి మహానుభావులు మరణమాసన్నమయ్యే సమయాన్ని తెలుసుకుని తమ శిష్యులకు వీడ్కోలు చెప్పి మృత్యువునొక అతిథివలె ఆహ్వానించి స్వర్గస్తులయ్యరు. శరీర భ్రాంతి లేని పరిపూర్ణ వైరాగ్యం కలిగిన మహాత్ములు మాత్రమే అనాయస మరణాన్ని పొందగలరని తెలుస్తోంది.
భగవాన్ రమణ మహర్షి కూడా వారి ‘ఉపదేశ సారము’ ద్వారా ఆత్మ గురించియు, బంధవిముక్తి గురించియు ఇట్లు వివరించారు. ఈ క్రింది శ్లోకములను పరిశీలిద్దాం.
శ్లో. కిం స్వరూపమిత్యాత్మదర్శనే
అవ్యయా భవా పూర్ణచిత్సుఖమ్
శ్లో. బంధ ముక్త్యతీ, తం పరం సుఖమ్
విన్దతీహజీ వస్తుదైవికః
భావం:తన నిజ స్వరూపమిట్టిదని, తాను (సాధకుడు) విచారము చేసి తెలిసికొనినపుడు, తాను గొప్పదైన జ్ఞానమే స్వరూపముగా గలదియు, ఆద్యంతములు లేనిదియు, అఖండ, పూర్ణంబైన సుఖస్వరూపమనియు తెలియును. అనగా అనంతాద్య ఖండచిత్ సుఖమే తానని తెలుసుకొనును.
ఆ విధముగా తన్ను తానెరిగిన పుణ్యాత్ముడు, బంధముక్తులు లేని యట్టి పర సుఖసిద్ధిని పొందును. అట్టి పర సుఖస్థితిలో బంధముగాని, ముక్తిగాని యుండవు. ఆత్మస్థితి యట్టిది. కావున, ఆత్మ, ఆది, అంతములు లేనిదనియు, సచ్చిదానంద స్వరూపము, మరియు నిత్యము అగుట చేత, ఆత్మకు బంధ ముక్తులు లేవు. కాని దేహమట్టిది కాదు, యిది పంచభూత నిర్మితమైన జడపదార్థము, అట్టిదానికి, బంధముక్తులు కలవనుట అసంగతము. ఇక బంధ ముక్తులనగానేమి యనినచో తన నిజ స్వరూపమును తెలియకుండుటయే బంధము. తన నిజ స్వరూపము (ఆత్మ) నెరుగుటయే ముక్తి, అది తెలిసిన పిమ్మట బంధ స్మరణపోవును, ముక్తిస్మరణము కూడా పోవును. కావున ఆత్మ నెరిగిన స్థితి, బంధ ముక్తులకతీతమై యుండును. ఆత్మవిచారణ గురించి రమణ మహర్షి ఇంకనూ రుూ విధంగా చెప్పారు. శిష్యులడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆత్మవిచారణ చాలా ఉత్కృష్టమైనది. అది యెన్నడును వ్యర్థమైన విషయం కాదు. అది మంత్రజపం కంటే ఉత్తమమైనది. నేనెవడను? అని ప్రశ్నించుకోవడం, మనోవ్యాపార మాత్రమైనట్లయితే, దానివల్ల అంతగా ప్రయోజనం సిద్ధించదు. ఆత్మవిచారణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనసునంతటిని కూడగట్టి దాని మూలమంలో నిలిపి ఉంచటం. అందువల్ల ఆత్మవిచారమంటే ఒక ‘నేను’ ఇంకొక ‘నేను’ను వెతకటం కాదు. అది శుద్ధాత్మ జ్ఞాననిష్ఠలో మనుస్సను నిలిపి వుంచే అత్యంత క్రియాశీలమైన శక్తి. కాబట్టి ఆత్మ విచారము ద్వారా, వ్యావహారికములైన భౌతిక విషయములను వెంటనే అధిగమించటమే లక్ష్యంగా పెట్టుకుంటే, భౌతిక శరీరానికి చెందిన, నేను ‘నీవు’ అనే భేదదృష్టికి అవకాశమెక్కడిది? తలపుల (ఆలోచనల) మూలాన్ని వెదకేందుకు, మనస్సును వెనక్కు (లోపలికి త్రిప్పితే) ఈ ‘నేను’, ‘నీవు’ అనేవెక్కడున్నాయి? కాబట్టి అంతా తానుగానున్న ఆత్మను అవలోకన చేస్తూ, ఆత్మగా నిలవాలి సాధకుడు.
ఆత్మ విచారణ తప్ప మిగిలిన అన్ని రకముల సాధనా క్రమాలలోను, అట్టి సాధనల నాచరించటానికి, ముందుగా, మనస్సును, నిశ్చలంగా నిలిపి వుంచుకోవడమనేది, ప్రధానోపకరణంగాంటుంది. మనస్సు లేకుండా ఏ సాధనను చేయడానికి వీలు లేదు. ఆ విధంగా చేసే సాధనలలోని వివిధ దశలలో ‘అహంత’ అనేక సూక్ష్మ రూపాలు ధరించే అవకాశముంటుంది. ‘అహంత’ మాత్రం నశించదు, తాను మిగిలే వుంటుంది.
*
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590