Others

అలుపెరుగని కళాతపస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పధ్నాల్గవ స్నాతకోత్సవం నేడు (మంగళవారం- జూన్ 3న) జరుగుతోంది. విశ్వవిద్యాలయం అధ్యక్షులు, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. స్నాతకోపన్యాసం (కీనోట్ అడ్రస్) సంస్కృతాంధ్ర పండితులు ఆచార్య రవ్వా శ్రీహరి ఇస్తున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘తెలుగు ఆత్మగౌరవం’ నినాదాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ మానస పుత్రిక. తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్ 2న స్థాపించబడింది. తరువాత ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. ఈ మధ్య మళ్ళీ (రాష్ట్ర విభజన నేపథ్యంలో) దీని పేరును మారుస్తున్నారని ప్రతిపాదన వచ్చింది. కాని అది రూపుదాల్చలేదు. అనతికాలంలోనే తెలుగు విశ్వవిద్యాలయం శాఖోపశాఖలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించింది. హైదరాబాద్‌లో లలిత కళాతోరణం, రాజమండ్రిలో నన్నయ్య ప్రాంగణం, శ్రీశైలంలో పాల్కురికి సోమనాథ ప్రాంగణం, వరంగల్‌లో పోతన ప్రాంగణం, కూచిపూడిలో శ్రీ సిద్ధేంద్ర యోగి ప్రాంగణం ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ కేంద్రాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ప్రస్తుతం ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు తూమాటి దోణప్ప, డాక్టర్ సి.నారాయణరెడ్డి, పేర్వారం జగన్నాథం, నాయని కృష్ణకుమారి, ఎన్.గోపి, జి.వి.సుబ్రహ్మణ్యం, ఆవుల మంజులత, ఎల్లూరి శివారెడ్డిలు దీనికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా ఆచార్య అలేఖ్య పుంజాల ఇపుడు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా రిజిస్ట్రారుగా ఆమె రికార్డు సృష్టించారు.
గతంలో తెలుగు విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్లుగా టి.డి. ప్రసాదరావు, ఎన్.శివరామమూర్తి, బి.రామకృష్ణారెడ్డి, టి.వెంకటరెడ్డి, డి.పి. సుబ్బారావు, సి. రమణయ్య, ఎన్.శివరామమూర్తి, టి.గౌరీశంకర్, ఎ.గురుమూర్తి, ఎన్.్భక్తవత్సల రెడ్డి, శ్రీపాద సుబ్రహ్మణ్యం, భట్టు రమేష్, కె. ఆశీర్వాదం, కె.తోమాసయ్య, వి.సత్తిరెడ్డి వ్యవహరించారు. ప్రస్తుతం ఆచార్య అలేఖ్య పుంజాల తొలి మహిళా రిజిస్ట్రారుగా ఉండటం మహిళలు ఎంతో సంతోషించదగ్గ విషయం.
ఆంధ్రపద్రేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు విశ్వవిద్యాలయం శాఖలున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా పంపకాలు జరిగాక రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి శాఖలు వేరుపడిపోతాయి. ‘తెలుగు విశ్వవిద్యాలయం కేవలం భాష కోసం మాత్రమే కాదు, ఇది భాషా-సంస్కృతి విశ్వవిద్యాలయం. ఇక్కడ సంప్రదాయ నృత్యములు, శిల్ప, సంగీతం, జ్యోతిష్యము, జానపదము, రంగస్థలము వంటి అన్ని కళలకూ కేంద్రం. దీనిని లలిత కళాపీఠం అని అంటారు రిజిస్ట్రారు ఆచార్య అలేఖ్య పుంజాల.
ఒకప్పుడు వౌఖికంగా సాగే సంప్రదాయానికి సరైన రూపురేఖలను ఇక్కడ ఇస్తున్నారు. మన ప్రాచీన కళలను కాపాడుకుని, భద్రపరిచి, పరిశోధన చేసి, గ్రంథస్థం చేసి ఎందరో వ్యక్తులు ఎనలేని కృషిచేస్తున్నారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో లలిత కళాపీఠంలో నృత్య శాఖ నుండి ఇప్పడి దాకా ఎన్నో పిహెచ్‌డీలు, ఎంఫిల్‌లు వచ్చాయి. వాటి వివరాలు:
డాక్టర్ కె.రత్నశ్రీ - కూచిపూడి యక్షగానాలు - మేలట్టురు భాగవత మేళాలు - తులనాత్మక పరిశీలన.
డాక్టర్ ఆర్. సుధాకర్ - కూచిపూడి - కర్ణాటక - తంజావూరు యక్షగానాలు తులనాత్మక పరిశీలన.
డాక్టర్ వనజ ఉదయ్ - కూచిపూడి - రీజనల్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ - ఇంపాక్ట్ ఆఫ్ టూరిజం.
డాక్టర్ పి.రమాదేవి - కూచిపూడి - కథాకళి తులనాత్మక పరిశీలన
డాక్టర్ సుమిత్ర పార్థసారథి - కూచిపూడి నాట్య ఆవిర్భావం, వికాసము, భామాకలాపం పై ప్రత్యేక దృష్టి.
డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి - తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర, వికాసం, నాట్యంలో అవతరణి.
డాక్టర్ భాగవతుల సేతురాం - భాగవతుల రామకోటయ్యగారి కళాసేవ.
డాక్టర్ సత్యసాయి జ్యోతి - దక్షిణాత్య ఆహార్యాభినయం
డాక్టర్ సజని వల్లభనేని - అన్నమయ్య అలమేల్మంగ సిద్దేంద్ర యోగి సత్యభామ తులనాత్మక పరిశీలన
డాక్టర్ యేలేశ్వరపు శ్రీనివాసులు - యక్షగానంలో ప్రతినాయక పాత్రలు.
డాక్టర్ చింతా రవి బాలకృష్ణ - రూపానురూపం - వేదాంతం సత్యనారాయణ శర్మ
డాక్టర్ శ్రీలేఖ కె. - సారంగపాణి కళానుశీలనమ్
డాక్టర్ రజని మల్లాది- అష్టపదులు - సాత్త్వికాభినయం
ఇప్పటిదాకా ఈ విశ్వవిద్యాలయం నుండి ఎం.్ఫల్ పొందిన వారి వివరాలు:
విజయవేణి - కూచిపూడి యక్షగానాలు- సంప్రదాయపాత్రలు.
గోవిందరాజు శ్రీదేవి - కూచిపూడి నృత్యం శిక్షణ పద్ధతులు.
శ్రీలత - దక్షిణాత్య సంప్రదాయ నృత్యముల ఆహార్యాభినయం.
రేణుక - నాయక భేదములు
వీరుకాక, ఇంకా ఎంతోమంది ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. ఎంఫిల్, పిహెచ్‌డి కోసం. గత కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది ఎంఎలు, పిహెచ్‌డిలు పొందారు. ఉన్నత చదువులు, పరిశోధనలు చేసిన వారికి ఉద్యోగావకాశాలు లేకపోతే ఎంతో సమయం, శక్తి, వనరులు వృథా అయినట్లు ఉంటుంది. ప్రతి డిగ్రీ కాలేజీలో సంగీతం, నృత్యం, జానపదం శాఖలు పెట్టి వీరందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. అప్పుడే డిగ్రీలు పొందినవారికి ఉపాధి, ప్రోత్సాహం ఉంటుంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం చేస్తున్న తపస్సుకి ఒక సార్థకత ఉంటుంది. అయితే ఇది కేవలం విశ్వవిద్యాలయం పరిధికి మించిన ప్రణాళిక. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీక్ష వహించి, భగీరథ ప్రయత్నం చేసి, ప్రతి డిగ్రీ కాలేజీలో కళాకారులకి ఉద్యోగావకాశాలు కల్పించాలి. అప్పుడే ఈ కళాతపస్సు ఫలిస్తుంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి