Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పెట్టి భాగిస్తే ఒకటి వస్తుంది. దాంట్లో నించి ఒకటి తీసివేస్తే శూన్యం వస్తుంది అని పై వాక్యానికి అర్థం. దీనిని బట్టి నన=0 అనే రూపంలో సున్నా అనేది పింగళుడి నాటికే అస్తిత్వంలో వుందని నిరూపితవౌతోంది.
ఇంతకూ పింగళుడు సున్నా యొక్క సృష్టికర్త కాదు. ఆయన ప్రధాన శాస్త్రం గణితశాస్తమ్రే కాదు. ఆనాటి గణిత శాస్త్రంలో ప్రసిద్ధంగా వున్న సున్నాను ఆయన వాడుకున్నాడు, అంతే- అనే విషయాన్ని మనం మరిచిపోరాదు.
ఈయనకంటే చాలా పాతవాడు మయుడు. ఆయన రచించిన గ్రంథం సూర్య సిద్ధాంతం. దీని వయసు 1000 బి.సి. ప్రాంతమని ఆధునికుల భావన. ఈ గ్రంథకర్త తన గ్రంథంలో మాత్రం ‘‘అల్పావశిష్టే కృతయుగే’’ (కృతయుగం కొద్దిగా మిగిలి వుండగా) తానీ గ్రంథం వ్రాశానని చెప్పుకున్నాడు. దీనిలో ఒకచోట - ‘‘ఖ చతుష్కరద అర్ణవైః’’అనే ప్రయోగం వుంది. దీనిలో ‘ఖ’అంటే సున్న‘రదా’అంటే 32 ‘అర్ణవ’ అంటే నాలుగు. కాగా ఖ చతుష్కరద అర్ణవైః అంటే 4,32,000 అని అర్థం. దీనినిబట్టి సూర్య సిద్ధాంత కాలానికి సున్న అనే అంకెకు స్థానం విలువ కూడా వుండేదని నిశ్చయవౌతోంది.
దీనికంటే వెనకాలే ఋగ్వేదంలో
అగ్నేస్థూరం రయిం భర పృథుం
గోమస్త మశ్వినం అంగ్ధిఖం వర్తయా పణిమ్’’ (ఋక్.10-56-1/3)
అని వుంది. దీనిలో ‘అంగ్ధిఖం’ అనే పద బంధంలో ‘ఖం’అనే శబ్దానికి సున్నా అనే అర్థం కూడా వుంది కనుక, ఈ మంత్రం సున్నాను సూచిస్తోందని కొందరు వ్యాఖ్యాతలు చెపుతున్నారు. అయితే మరికొందరు విమర్శకులు ఆనాటికి సున్నా అనే భావన లేదని వాదిస్తున్నారు. అలాంటివారు ఈ కింది అథర్వవేద మంత్రాన్ని గమనించాలి.
ఏకా (1) చ మే దశ (10) చ మే పవక్తార ఔషధే
- నాకు 1 మరియు 10 కలుగు గాక
ద్వే (2) చ మే వింశతిశ్చ (20) మే పవక్తార ఔషధే
- నాకు 2 మరియు 20 కలుగు గాక
త్రిసశ్చ (3) మే త్రింశచ్చ (300) మే పవకార్త ఔషధే
చతుస్రశ్చ (4) మే చత్వారింశచ్చ (40) మే పవకార్త ఔషధే
- నాకు 4 మరియు 40 కలుగు గాక
పంచ (5) చ మే పంచాశచ్చ (50) మే పవక్తార ఔషధే
- నాకు 5 మరియు 50 కలుగు గాక
షట్ (6) చ మే షట్త్రిశ్చ (60) మే పవక్తార ఔషధే
- నాకు 6 మరియు 60 కలుగుగాక
సప్త (7) చ మే సప్తతిశ్చ (70) మే పవక్తార ఔషధే
- నాకు 7 మరియు 70 కలుగుగాక
అష్ట (8) చ మే శీతిశ్చ (80) మే పవక్తార ఔషధే
- నాకు 8 మరియు 80 కలుగు గాక
నవ (9) చ మే నవతిశ్చ (90) మే పవక్తార ఔషధే
- నాకు 9 మరియు 90 కలుగు గాక
దశ (10) చ మే శతం (100) చ మే పవక్తార ఔషధే
- నాకు 10 మరియు 100 కలుగు గాక
శతం (100) చ మే సహస్రం (1000) చ మే పవక్తార ఔషధే
- నాకు 100 మరియు 1000 కలుగు గాక
ఇలాంటి సంఖ్యా సముచ్చయం సున్నా అనే భావన కానీ, దానిమీద ఆధారపడిన దశాంశ గణన పద్ధతి గాని లేకుండా సాధ్యమవుతుందా? అది అసంభవం. కనుక ఆనాటికే సున్నాని గురించిన పరిపూర్ణ అవగాహన వుండేదని నిశ్చయంగా చెప్పవచ్చు.
అనంతము (.....)
అలాగే అనంతానికి ..... (infinity) సంబంధించిన భావన కూడా వేదాలలో విస్తృతంగానే కనిపిస్తోంది. దీనికి ఉదాహరణగా సుప్రసిద్ధమైన-
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే॥
అనే శాంతి మంత్రాన్ని స్వీకరించవచ్చు. ‘‘ఈ ప్రపంచం అనంతం. ఎవరిలోంచి ఇది ఉద్భవిస్తోందో ఆ పరమాత్మకూడా అనంతుడే. అనంతం లోంచి అనంతాన్ని తీసివేస్తే మిగిలేది అనంతమే’’అని పై మంత్రానికి భావం. కొందరు ఆధునికులు ఈ మంత్రంలోని పూర్ణ శబ్దానికి సున్న అని అర్థం చెపుతున్నారు. అది పొరపాటు. భారతీయ గణిత పరిభాషలో శూన్యం, ఖం వంటి పదాలే సున్నాను సూచిస్తాయి. భాషాపరంగా కూడా శూన్య శబ్దమే సున్నాగా మారింది. పూర్ణశబ్దం ఎప్పుడూకూడా అనంత వాచకమే.
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి