Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తం చికీర్షుః శరది గిరి సానుజం శుచిరుపోష్య
ప్రశస్తే‚ హని ప్రశస్త దేశజాతం అనుపహతం
మధ్యమవయసం మహాంతం అసిత ముష్కక
మధివాస్య అపరేద్యుః పాటయిత్వా
ఖండశః ప్రకల్ప్య అవపాట్య నిర్వాతే దేశే
నిచితం కృత్వా సుధాశర్కరాశ్చ ప్రక్షిప్య
తిలనాళైః అదీపయేత్‌
అథ ఉపశాంతే అగ్నౌ తద్భస్మ
పృథక్ గృహ్ణీయాత్ భస్మ శర్కరాశ్చ
తతః క్షార ద్రోణం ఉదకద్రోణైః
పరిశ్రావ్య మహతి కటాహే శనైః దర్వ్యా
అవఘట్టయన్ విపచేత్
తమాదాయ మహతి వస్త్రే
పరిశ్రావ్య ఇతరం విభజ్య పునః అగ్నౌ అధిశ్రయేత్
స యథా నాతిసాంద్రో నాతి ద్రవశ్చ భవతి మధ్యమః ఏష ఏవ అప్రతీవాపః
పక్వః మృదుః! స ఏవ సప్రతీవాపః పక్వః పాక్యః తీక్ష్ణః॥
ఈ కాస్టిక్ సోడా తయారుచేయాలనుకునేవారు ముందు శరత్కాలంలో మంచిరోజున శుచిగా ఉపవాసం వుండి, ఒక రాత్రి మంచి ప్రదేశంలో పెరిగినదీ, మధ్యమ వయస్కున్నదీ, బాగా పెరిగినదీ, ఐన అసిత ముష్కకమనే చెట్టుదగ్గర నివసించి, మర్నాడు దాన్ని కట్టెల్లాగా చీల్చి, నరికి, ముక్కలుచేసి, గాలిలేని చోట గుట్టగా కూర్చి, దానిమీద సున్నం రాళ్ళు చల్లి నువ్వు కట్టెలు కూరి, మంట రాజెయ్యాలి.
మంట చల్లారిన తరువాత చెట్టు భస్మాన్ని, సున్నపు భస్మాన్ని, విడివిడిగా పోగుచెయ్యాలి.
ఆ బూడిదను పెద్దకాగులోకి నీటిలో కలిపి కరిగిన తర్వాత ఒక పెద్ద భగోణీలాంటి దాంట్లో పోసి, కట్టె గరిటెతో మెదుపుతూ బాగా వండాలి.
దాన్ని పెద్ద వస్త్రంతో వడపోయాలి. మడ్డి తొలగించి, మళ్ళీ వండాలి.
మరీ చిక్కగా, మరీ పలచగా కాకుండా మధ్యమంగా పాకం పట్టాలి. ఇదే ‘‘సోడా’’ (అప్రతీవాపః). అదే పాకం ముదురుగా వుంటే, అది ‘‘సప్రతీవాపము’’ అనబడుతుంది. ఇది తీక్ష్ణ స్వభావము గలది. ప్రతీవాపము అంటే- కరిగిన లోహాదుల ద్రవ్యాంతరము చేర్చి చూర్ణము చేయుట.
ఇంత వివరంగా ఇచ్చిన దాన్నిబట్టి రసాయన శాస్తక్రారులు ఎంత శ్రద్ధతో ఆ పరిజ్ఞానాన్ని గ్రంథస్థం చేశారో తెలుస్తోంది.
సోమరసం:
ఇంతేగాక ప్రాచీన భారతదేశ శాస్తజ్ఞ్రులకు బంగారము, సీనారేకు (టిన్) వంటి లోహాలు, వాటి మిశ్రమాలు మాత్రమేగాక రకరకాల చవుడులు (సోప్‌లు) గాజులు, చర్మాలు, కలంకారీ రంగులు, రాతి పాత్రలు, మద్యాలు, ద్రాక్ష సారాలు వంటి అనేక పదార్థాలను తయారుచేసే రసాయనిక విధానాలు కూడా తెలుసు.
వేదాలలో సోమలత, సోమరసం గురించి ప్రస్తావన విస్తారంగా వుంది. వేదోక్తమైన యజ్ఞాలలో సోమరస ప్రసక్తిలేని యజ్ఞమే లేదని చెప్పవచ్చు. ఋగ్వేదంలో నవమకాండ అంతా సోమరస ప్రశంసతో కూర్పబడి వుంది. ‘‘పవమాన సోమసూక్త’’మని ప్రసిద్ధమైన సూక్తాన్నిబట్టి ఆరోజుల్లో సోమరసం తయారీని నిగూఢమైనదిగానూ, పవిత్రమైనదిగానూ భావించారని చెప్పవచ్చు.
బహుశా దీని నిగూఢత్వంవల్లనే ఇది అంతరించిపోయి వుండవచ్చు.
‘‘మకరధ్వజం’’అనే ఆయుర్వేద ఔషధం తయారీలోకూడా రసాయన శాస్త్రం వుంది.
‘‘రసేంద్ర చింతామణి’’అనే ప్రాచీన గ్రంథంలో మకరధ్వజంలో ఎన్ని రకాలున్నాయి, వాటిని గంధకంతో ఏఏ పాళ్ళలో కలపాలి అన్న వివరాలున్నాయి. ఏ రకం మకరధ్వజం, ఏ రకం వ్యాధి నివారణకు ఉపయోగిస్తుందో కూడా తెలపబడి వుంది.
వివిధరకాల లోహభస్మాల తయారీకూడా వైదిక కాలంనాటి రసాయన శాస్త్ర విద్యకు నిదర్శనం.
లోహపు ఖనిజాన్ని వివిధ రసాయనిక పదార్థాలతోనూ, ద్రావకాలతోనూ కలిపి, అగ్నితో కాల్చి, వచ్చిన భస్మంనుంచి మూలలోహాన్ని వేరుచేసే రసాయనిక విద్య ఆనాటి వారికి బాగాతెలుసు. ఇలాంటి ప్రసక్తులు శ్రీమద్భాగవతం వంటి పురాణాలలో కూడా వున్నాయి.
వీటికోసం వాడే ద్రవాల, రసాయనిక పదార్థాల, పేర్లు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు-
బాగా అగ్నితప్తమై ఎర్రగా కాలిన లోహాన్ని మజ్జిగ, పులిసిన గంజి, గోమూత్రం, నువ్వుల పిండి వంటి పదార్థాలలో ముంచేవారు. ఆ తరువాత ఆ లోహాన్ని భస్మంగా తయారుచేసేవారు. ఈ ప్రక్రియను లోహ హననం (లోకాన్ని చంపుట)గా వ్యవహరించేవారు. ఈ ప్రక్రియ ద్వారా వారు లోహంలోని దోషాలను సంహరించి దాన్ని ఔషధాలలో వాడేందుకు అర్హమైనదిగా చేసేవారు. ఈ లోహహనన ప్రక్రియను ఇటీవలి వైజ్ఞానికులు కొందరు పునఃపరిశీలన చేసి, దాని సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు.
ఈ భస్మాల తయారీ సరిగా జరిగిందో లేదో నిర్ణయించేందుకు రకరకాల పరీక్షలు కూడా ఉన్నాయి.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి