Others

ఆత్మకు చలనముందా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా
ఆప్నువన్ పూర్వమర్షత్
తద్దానతో అన్యానత్యేతినిష్ఠ
తస్మిన్నపో మాతరిశ్వాదాధాతి
(ఈశావాస్యోపనిషత్తు శ్లో. - 4)

శ్లో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదన్తరస్య సర్వస్యతద్దూ సర్వస్యాన్యబాహ్యతః
(ఈశా.ఉప. శ్లో. - 5)

శ్లో యస్తు సర్వాణి భూతా నాత్మనే్యవానుపశ్యతి
సర్వభూతేషు చాత్యానం తతోనవజగుప్సతే
(ఈశా.ఉప. శ్లో. - 6)

శ్లో యస్విన్ సర్వాణి భూతాన్యాత్మైవా, భూద్విజానతః
తేత్రకోమోహః కః శోకః ఏకత్వ మనుపశ్యతః
(ఈశా.ఉప. శ్లో. - 7)

శ్లో సపర్యగాచక్రమకాయ మవ్రణ
మస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధమ్
కవిర్మనిషీపరిభూః స్వయం భూర్యాథా
తధ్వతో ర్దాన్ వ్యదధాచ్ఛా శ్వతీభ్యః సమాభ్యః
(ఈశా.ఉప. శ్లో. - 8)
వివరణ: ఆత్మ ఒక్కటే చలనము లేనిది (అవికార్యమైనది. అయినప్పటికి మనుస్స కంటే వేగవంతమైనది. మనస్సుకంటే ముందు వేగంగా వెళ్ళడం చేత అది ఇంద్రియాలకు కూడా అందుకున్నది. ఆత్మ నిత్య స్థిరమైదైనప్పటికి వేగవంతమైన వాటినన్నిటిని దాటిపోవుచున్నది. కేవలం తన సాన్నిధ్యం చేతనే ప్రాణికోటి సర్వకార్య నిర్వహణకు కావలసిన సామర్థ్యాన్ని శక్తిని ప్రాణానికిస్తుంది. ఆత్మ కదిలేదిగాను కదలనిదిగాను ఉంటుంది. ఆత్మ తన నిజమైన కేవల స్థితిలో చలించదు కాని అట్టి ఆత్మకుపాధియుతమైన స్థితిలో నిరంతరము చలనశీలమైనట్లు గోచరిస్తుంది. ఆత్మ దూరంలో నున్నదిగాను దగ్గరనున్నదిగాను స్థితి కలిగి వుంటుంది. అంటే ఆత్మ సర్వత్రా నిండి ఉన్నది. అజ్ఞానులకు దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కనుక అది దూరం. ప్రజ్ఞావంతులకు, సజ్జనులకు ఆత్మ తమ యందే గోచరమగును గాక, అది వారకి చాలా దగ్గరగా కన్పట్టును. ఆత్మ అంతట లోపల వెలుపల కూడనున్నది. అనగా సృష్టికి అతీతం, పరిచ్ఛేదానికి అతీతం, అది ఉపాధియుతము, ఉపాధి రహితము కూడా అయి ఉన్నది. కావున ఆత్మకు విరుద్ధ విశేషములు చెప్పబడ్డాయి. తనలోనున్న ఆత్మయే అన్ని జీవుల యందు కలదని తెలిసిన ప్రజ్ఞుడు ఇతర జీవులను ద్వేషించదు. ద్వేషం స్వార్థంవల్ల కలుగుతుంది. అన్ని జీవులయందున్న ఆత్మ తనయందున్న ఆత్మ ఒకటే అయినపుడు ద్వేషానికి స్థానం లేదు. ఆ విధంగా చరాచరసత్తయందు అభేదమును దర్శించగల ప్రాజ్ఞునికి మోహము లేదు, దుఃఖమును లేదు. స్వయంభువుడన ఆత్మ సర్వోన్నతుడు. సర్వవ్యాపి, అతనికి శరీరము లేదు. అస్నాయువు, పాపము, కళంకము లేనివాడు ఆత్మ పరిపూర్ణుడు, ఉజ్వలుడు, సర్వదర్శి, సర్వోన్నతుడు సర్వజ్ఞుడు, అట్టి ఆత్మ శాశ్తులైన ప్రజాపతులకు వారి వారి విధులను యధావిధిగా పంచియిచ్చాడు. అంటే విశ్వంలోని అన్ని విషయాలను తగిన విధంగా పంచియిచ్చాడని అర్థం చేసుకోవాలి. ‘జ్ఞానావతుకైవల్యం’ జ్ఞానంవల్ల మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుందని ఉపనిషత్తులు నొక్కి చెబుతున్నాయి. ఆత్మజ్ఞానంవల్లనే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి ముముక్షువులకు వేద పఠనం, వేదోక్తమన ధర్మాచరణము తప్పనిసరియని శ్రుతిస్మృతులలో ఎక్కడా చెప్పలేదని పెద్దల ఉవాచ. అయితే ఆత్మానాత్మ వివేచన నిత్యా నిత్య వివేకము, శమ దమాది షట్కసంపత్తి, ఆత్మ పరమాత్మ తత్త్వాలను తెలుసుకోవడానికి అవగాహనకుపరిస్తాయని అర్థం చేసుకుని ఆ జ్ఞానంతో పరమాత్మను పొందవచ్చునని బ్రహ్మ సూత్ర భాష్యం ప్రాతిపాదనగా గ్రహించాలి. ఆత్మ స్వయం క్రపాశము గలిగినట్టు సత్ పదార్థము మరియు నిత్యమైనది. ఆత్మాభాసమైన అహంకారం ఎన్నటికి మారదు ‘నేను’ అనే భావన కాని అవస్థ్భాదం కాని లేదు.
భగవద్గీత 2వ అధ్యాయములోని 18వ శ్లోకం నండి 30 శ్లోకం వరకు, ఆత్మన గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన విషయము నొకింత పరిశీలన చేయుదుము.
శ్లో అస్త వన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్య భారతా
భావార్థము: నాశనము లేనిట్టియు అప్రమేయమైనట్టియు, శాశ్వతమైన జీవాత్మ యొక్క భౌతిక శరీరము తప్ప నశించును. భౌతిక శరీరము స్వాభావికముగా నశ్వరమైనది. కాలభేదమే తప్ప భౌతిక శరీరమెన్నటికైనను నశింపక తప్పదు. ఆత్మ భౌతిక శరీరమును వీడినంతనే శరీరము శిథిలమగును. కావును ఆత్మయే శరీరమును నిలిపియుంచుచున్నది. కావున ప్రాధాన్యత ఆత్మకే కాని, శరీరమునకు కాదు.
శ్లో య ఏవం వేత్తి హన్తారం, యశ్చైవం మన్యతే హతమ్
ఉభౌ, తౌన విజానీతో నాయంహన్తిన హాన్యతే
భావార్థము:జీవుడు చంపువాడని, తలంచువాడును, చంపబడునని తలంచువాడును ఇరువురును అజ్ఞానులే! ఎందువలననగా, ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ అతి సూక్ష్మమనదగుటచే, భౌతికమైన ఆయుధములచే దానిని చంపుట అసంభవము. దాని ఆధ్యాత్మిక ప్రకృతివలన జీవాత్మ చంపదగినది కాదు. చంపబడునది కేవలము శరీరమే, అయినను శరీరమును చంపుటకు ప్రోత్సహించరాదు. ధర్మాచరణకు శరీరము మిక్కిలి ఆవశ్యకము. ఏ జీవిని హింసించరాదని కదా! వేదము చెప్పుచున్నది. ‘మాహింస్యాత్ సర్వభూతాని’. ఆత్మ ‘అణు ఆత్మ’ విభు ఆత్మా అని రెండు రకములుగా నున్నదని కఠోపనిషత్తు వాక్యమును చూడండి.
శ్లో అణోరణీయాన్ మహతో మహీయాన్
ఆత్మాస్య జంతోర్నిహితం గుహాయామ్
తమక్రతుః పశ్యతి, వీతశోకో,
ధాతుః ప్రసాదాన్ మహిమానమాత్మనః
సూక్ష్మాతి సూక్ష్మమైనది, అణువుకంటె చిన్నది, బ్రహ్మాండము కంటె ఘనమైనదీ, అయిన ఆత్మ ప్రాణుల హృదయాలలోనే యున్నది.
*
ఇంకావుంది...
*
ప్రతులకు:
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590