Others

మధురమైంది మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమంతుడు తన మాటల చాతుర్యంతో శ్రీరాముడిని మొదటి చూపులోనే ఆకట్టుకున్నాడు. అందరిచేత హనుమంతుడు ప్రశంసించబడ్డాడు. భయపడుతున్న సుగ్రీవునికి తన మాటలతో చేతలతో భయాన్ని దూరం చేశాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోక సుఖలాలసతో మునిగిన సుగ్రీవుని కూడా హనుమంతుడే తన మాటల చేత కర్తవ్యపాలనకు నిలబడేట్టు చేశాడు. దుర్భర వేదనలో ఉన్న సీతమ్మకు తన మాటల చేత ప్రియం కల్గించాడు. వాలి తన మాటలతో శ్రీరాముని తూలనాడి మరలా శ్రీరాముడినే పొగడాడు. తార తన మాటలతో ఉగ్రరూపంలో వచ్చిన శ్రీరామ సోదరుడైన లక్ష్మణునికి కోపాన్ని పోగొట్టకలిగింది. కైకమ్మ తన మాటల వల్లనే దశరథుని అమితంగా బాధలకు గురి చేసింది. చివరకు తనకు ఎంతో ఇష్టమైన రాముని దూరం చేసుకొనింది. దశరథుని ప్రాణాలు పోవడానికి తానే కారణంగా నిలబడింది. భరతునికోసం ఇదంతా చేసానని అనుకున్న కైక చివరకు భరతుని వల్లే శోకించింది. ఇలా మాటల వల్ల ఎన్నోమంచిచెడులు జరుగుతుం టాయ. మనిషి తన వివేకంతో మాటలను ఏవిధంగా ఎవరితో మాట్లాడాలో తెలుసు కొని మాట్లాడితే మంచికీర్తి వస్తుంది. కలియుగంలో కూడా మనం మాట్లాడే మాటల వల్లే మంచి మిత్రులేర్పడుతారు. కష్టసాధ్యమైన పనులుకూడా మంచి మాటలతో సులభంగాపూర్తి చేయవచ్చు.