Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరకాండ పారాయణవల్ల సకల దోషాలు తొలగిపోతాయి. శని, రాహు, కుజ, కేతు దోషాలవల్ల మనుషులు ఎన్నో కష్టనష్టాలకు గురవుతూ వున్నారు. అటువంటి బాధల నుంచి విముక్తి పొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్టమని సాక్షాత్ ఆ పరమశివుడు పార్వతిదేవితో ఓ సందర్భంలో అంటాడు. ‘‘ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఉన్నతుడో, వృక్ష జాతుల్లో కల్పవృక్షం ఎంత మంగళకరమైందో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ.. తులసి వనంలోచేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్వ వృక్షంవద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి శుభ్రతలను విధిగా పాటించాలి. సుందరకాండ పారాయణవల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కల్గుతాయి. ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంత జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా మారుతి రామలక్ష్మణులను చూసిన నాటినుంచి శ్రీరామ పట్ట్భాషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధిబలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.
ఆంజనేయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ..సంభూతునిగా, శ్రీరామచంద్రునిగా నమ్మినబంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగిపోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది. ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు పదునుపెట్టగల్గుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమైన రీతిలో పూర్తికాదు. అంతేకాక, అహంకార, మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగల్గుతాడు. ప్రలోభాలకు, బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగల్గుతాడు. బృహద్ధర్మ పురాణంలో సుందరకాండ పారాయణ ప్రాశస్త్యాన్ని గురించి వివరించబడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కల్గించేది సుందరకాండ. కుటుంబపరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటినుండి విముక్తి పొందుతారు. మనిషిలోని ఏకాగ్రతను పెంచుతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. సుందరకాండ పారాయణకు పెద్దలు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆంజనేయుడు సీతామాతకోసం లంకా నగరంలో అనే్వషించిన వేళల్లో అడుగడుగునా ఎదురైన అడ్డంకులను ఏవిధంగా తొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడ తానూ చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకోవడానికి సుందరకాండ పారాయణమెంతో ఉపయోగపడుతుంది.
రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు. ‘శ్రీరామ దూతం శిరసా నమామి’అని ఎవరైతే నిరంతరం జపిస్తూ వుంటారో.. వారి జోలికి భూత, ప్రేత, పిశాచాలు రావు. శత్రువులు వారినేమీ చేయలేరు. వాల్మీకి, తులసీదాసు ప్రభృతులు చెప్పిన పరమ రహస్యం ఇదే.

-- కురువ శ్రీనివాసులు