Others

యోగి పుంగవుడు మన సాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడ జన్మించారో, ఎక్కడివారో, ఎక్కకడినుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. పదహారేళ్ల ప్రాయంలో తొలిసారిగా బాబా శిరిడీలో అడుగుపెట్టారు. మూడేళ్లు వేపచెట్టు క్రింద ధ్యానముద్రలో గడిపారు. హఠాత్తుగా అదృశ్యమై కొంతకాలానికి నిజాం రాజ్యంలోని ఔరంగాబాద్‌లో కనిపించారు. అక్కడ చాంద్ పాటిల్‌కు పోయిన గుర్రాన్ని చూసి, అతనితో కలిసి ధూప్ గ్రామానికి వెళ్లారు. తిరిగి చాంద్‌పాటిల్ బావమరిది పెళ్లి బృందంతో కలిసి షిర్డీ వచ్చారు. అప్పటికి బాబాకు 20 ఏళ్ళు. అప్పటినుంచి బాబా షిర్డీలో అరవై ఏళ్లపాటు నడయాడారు. మసీదే బాబా ఆవాసమైంది. 1918లో బాబా మహాసమాధి చెందారు. దీనిని బట్టి బాబా సుమారుగా 1838 ప్రాంతంలో జన్మించి ఉంటారని భావించవచ్చు.
యోగీశ్వరులు ఒక కర్తవ్యం కోసం అవతరిస్తారు. శరీర రూపాన్ని ధరిస్తారు. మనుషులతో కలిసి వారిలాగానే నటిస్తారు. తమ భావాలను అందరికీ పంచుతారు. తమ కర్తవ్యం పూర్తికాగానే శరీరాన్ని విడుస్తారు. అయితే వారు వదిలివెళ్లిన భావం మాత్రం సజీవం. సాయి తత్వమనే వర్ణింపనలవికాని ఆ సచ్చిదానంద స్వరూప భావమే నేటికీ విశ్వమంతా వ్యాప్తమై చైతన్యమై అందరి హృదయాలను పాలిస్తోంది.
17వ శతాబ్దంలోని 1608-81 మధ్య కాలంలో యోగిపుంగవుడైన రామదాసు అవతరించారు. గోబ్రాహ్మణులను, మహమ్మదీయుల నుంచి రక్షించే బాధ్యతను నెరవేర్చారు. ఆయన పరమపదించిన రెండు వందల ఏళ్లకు హిందూ ముస్లింల మధ్య మళ్లీ వైషమ్యాలు చెలరేగాయి. తిరిగి రెండు వర్గాలమధ్య సామరస్యం కుదిర్చి, అందరి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని, మానవ జీవిత పరమార్థాన్ని బోధించే లక్ష్యంతో సాయిబాబా శిరిడీలో అవతరించారు.
‘‘రాముడు రహీమ్ ఒక్కరే. వారిమధ్య ఏ భేదమూ లేదు. అటువంటపుడు వారి భక్తులు కలహమాడటం ఎందుకు? ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవవటం ఎందుకు? అజ్ఞానులారా! చేతులు చేతులు కలిపి కలిసిమెలిసి ఉండండి. బుద్ధితో ప్రవర్తించండి. జాతీయ ఐకమత్యాన్ని సాధించండి. వివాదాలు, ఘర్షణలవల్ల కించిత్ ప్రయోజనం లేదు. ఒకరితో ఒకరు పోటీపడకండి. మీ వృద్ధిని కాంక్షించండి. మేలుకోసం తాపత్రయపడండి. అపుడే భగవంతుడు రక్షిస్తాడు. యోగం, త్యాగం, తపస్సు, జ్ఞానం.. ఇవే మోక్షమార్గాలు. వీటిలో మీకు నచ్చిన మార్గంలో నడవండి. మోక్షాన్ని సంపాదించండి. మోక్షం లేని జీవితం వ్యర్థం!!
మీకు ఎవరైనా కీడుచేసినా అపకారం తలపెట్టకండి. ఇతరుల మేలుకోసం మీరేదైనా చేయదల్చుకుంటే ఎల్లప్పుడూ మేలే చేయండి. ద్వేషాన్ని విడిచిపెట్టకండి. వంతులు, వాదులాటలు, కీచులాటలు మానండి’’.
ఈ లక్ష్యాన్ని సాధించటానికే బాబా అవతరించారు. తన కర్తవ్యం పూర్తికాగానే శరీరాన్ని విడిచారు. బాబా మత మార్పిడులను అంగీకరించేవారు కాదు. ‘్భగవంతుడు ఒక్కడే! అతడే అందరి యజమాని’ అని చాటిన బాబా పారమార్థిక జీవితంలో ఎవరైనా ఒక్కర్నే నమ్ముకుని ముందుకు సాగాలని సూచించారు.
ఒకసారి బడే బాబా ఒక కుర్రాడిని బాబా వద్దకు తీసుకువచ్చాడు. ‘‘ఇతను మతం మార్చుకుంటాడట. అనుమతించండి’’ అని వేడుకొన్నాడు.
బాబా ఆ కుర్రాడివైపు తీక్షణంగా చూశారు.
‘‘నీ అబ్బను మార్చుకుంటావట్రా?’’ అని గట్టిగా కేకలు వేశారు. మత విశ్వాసాల్లోని చాదస్తాలను, మూఢ నమ్మకాలను బాబా మన్నించేవారు కాదు.
రెండోసారి శిరిడీ ప్రవేశం.. సాయి నామకరణం
బాబా చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో కలిసి శిరిడీలో రెండోసారి అడుగుపెట్టేనాటికి ఒక పేరంటూ లేదు. అందరూ ఫకీరుగా భావించి, ఆ పేరుతోనే పిలిచేవారు. ఖండోబా (వీరభద్రస్వామి) ఆలయ పూజారి మహల్సాపతి, బాల ఫకీరును చూడగానే మహల్సాపతి మనసు ఎందుకో ఉప్పొంగింది. మూడేళ్ల క్రితం శిరిడీలో వేపచెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకున్న బాల ఫకీరు అతనేనని గ్రహించాడు. ఫకీరును ఉద్దేశించి ‘ఆవో సాయి’ అని ఆహ్వానించాడు. అప్పటినుంచి సాయిబాబా అనే పేరు స్థిరపడింది. బాబా అంటే తండ్రి అని, సాయి అంటే తల్లి అని అర్థం. బాబా శిరిడీలోని పాడుమడిన మసీదును తన ఆవాసంగా చేసుకున్నారు. బాబా ఎవరితో పెద్దగా కలిసేవారు కాదు. అప్పటికే ఎన్నో సంవత్సరాలుగా శిరిడీలో ఉంటున్న దేవీదాసు అనే యోగితో కొద్దిగా కలిసేవారు. దేవీదాసుతో కలిసి బాబా కొన్నాళ్లు మారుతి మందిరంలోను, చావడిలోను ఉండేవారు. కొంతకాలం ఏకాంతంగానే గడిపేవారు. జానకీదాసు గోసావి అనే మరో యోగి షిర్డీ ప్రవేశించారు. బాబా అడపాదడపా జానకీదాసుతో మాట్లాడుతుండేవారు. అప్పట్లోనే గంగాగీరు, ఆనందనాథుడు వంటి యోగులు శిరిడీ వచ్చినపుడు బాబాను చూసి ‘‘షిర్డీ ఎంతో పుణ్యం చేసుకుంది. సాయి అనే అమూల్య వజ్రాన్ని పొంది ధన్యమైంది’’ అని గుర్తించారు. ఆ మాటలు తరువాత కాలంలో నిజమయ్యాయి. ఒక్క శిరిడీయే కాదు యావత్ జగత్తే అక్కడ పరివ్యాపితమై ఉంది.
యవ్వనంలో వుండగా బాబా జుట్టు బాగా పొడవుగా పెంచేవారు. బాబా వేషధారణ పహిల్వాను మాదిరిగా ఉండేది. శిరిడీకి మూడు మైళ్ల దూరంలో వున్న రహతా గ్రామానికి బాబా అప్పుడప్పుడూ వెళ్లి వస్తుండేవారు. తిరిగి శిరిడీకి వచ్చేటపుడు బంతి, గనే్నరు, నిత్య మల్లె మొక్కలను తీసుకువచ్చేవారు. ఆ మొక్కల్ని మసీదు సమీపంలో నేలను చదునుచేసి నాటేవారు. వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోసేవారు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం.

పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566