Others

అతి పురాతనమూ పవిత్రము..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరిడీ సాయిబాబా వారికి ఆ పేరు ఎలా వచ్చిందో మనకు సాయి సచ్చరిత్ర పారాయణ చేసేవారందరికీ తెలుసు. శిరిడీలో సాయినాధుని ఆలయానికి ఎదురుగా వుండేదే ఖండోబా ఆలయం. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 500 సంవత్సరాల చరిత్ర కలిగి వుంది. ఒక బాలుడు చాంద్ పాటిల్‌తో కలిసి శిరిడీ రాగా, ఖండోలా ఆలయ అర్చకుడు‘ఆవో సారుూ’ అని పిలిచింది ఈ ఆలయంలోనే.
శిరిడీ గ్రామం మహారాష్టల్రోని అహమద్‌నగర్ జిల్లాలో గోదావరీ పరీవాహ ప్రాంతంలో వుంది. జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టినిల్లు. ఆ జిల్లాలోనే కోపర్‌గావ్ తాలూకాలోని అతి చిన్న గ్రామమే శిరిడీ.
150 సంవత్సరాల క్రితం ఆ జిల్లాలోని వారికే తెలియని కుగ్రామము శిరిడీ. ఈనాడు భారతదేశంలోని అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అలరారుతూ వుంది. శిరిడీకి దగ్గరలో రహతా గ్రామం వుంది. ఊరి చివర ఒక పేటలా వుండేదట శిరిడీ. ఆ రోజుల్లో ఎనభై గడపలకు మించి వుండేవి కాదట. ఇళ్ళన్నీ మట్టితో కట్టినవే. నాలుగైదు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్ముడూ వుండేవారు. శిరిడీ గ్రామానికి నాలుగువైపులా పొలాల, తుమ్మ పొదలు, చిట్టడవులూ దట్టంగా వుండేవి.
నీటి పంపులూ లేవు. ఇక విద్యుత్ దీపాల మాటేరాదు. ఎప్పుడన్నా ఊరిలోకి ఒక గుఱ్ఱపు బండి వస్తే అది గొప్ప వినోదంగానూ, వింతగానూ ఉండేది. శిరిడీలోని ప్రజలందరూ కష్టజీవులే. వారానికి ఒక రోజున వుర్లో సంత జరిగేది. ఆ సంతే వారికి ఎంతో గొప్పగా వుండేది. ఊరి మొదలునందు గ్రామ దేవత ఖండోబా ఆలయం వుండేది. ఇక గ్రామంలో ఊరి మధ్యన పాండురంగ విఠలుని ఆలయం వుండేది. లక్ష్మీ, శని, మారుతి, గణపతి ఆలయాలు కూడా వుండేవి. గుడులకు తలుపులు కూడా సరిగ్గా వుండేవి కావు. మనం ఖండోబా ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము కదా! ఖండోబా ఆలయానికి అర్చకుడు మహల్సాపతి. అతనికేమి తెల్సును ఈ బాలుడే భవిష్యత్తులో గొప్ప అవతార పురుషుడిగా పరిగణింపబడి, కోట్లాది ప్రజల కైమోడ్పులు అందుకుంటాడని!
చాంద్‌పాటిల్ బృందంతో ఒక పెళ్ళికి హాజరయ్యేందుకు వచ్చిన ఆ బాలుడు శిరిడీని తన శాశ్వత నివాసంగా ఏర్పర్చుకున్నాడు. క్రీ.శ.1854 సంవత్సరంలో వసంత ఋతువులో ఉదయంవేళ ఒక రోజున, ఒక వేప చెట్టు క్రింద తపోదీక్షలో వున్న పదునారు సంవత్సరాల బాలునిగా బాబావారు తొలిసారి సాక్షాత్కరించారు. ఎంతో చక్కదనమూ, చురుకుదనమూ కలబోసిన అందంతో, చక్కటి శరీర సౌష్ఠవంతో తపోదీక్షలో వున్న ఆ బాలుని చూసి గ్రామ ప్రజలందరూ ఎంతగానో ఆశ్చర్యపడిపోయారు. పగలూ రాత్రీ అలాగే కూర్చుని వుండేవాడు. ఎవ్వరినీ పలుకరించేవాడు కాదు.
రాత్రివేళల్లో కూడా అక్కడే వుండేవాడు. ఏమి తినేవాడో, ఎప్పుడు నిద్రపోయేవాడో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒక్కసారి బాబాను చూస్తే చాలు మరలా మరలా చూడాలని అనిపించేదట ఆ గ్రామ ప్రజలకు. ఆ బాలుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో అలాగే అదృశ్యమైనాడు. తిరిగి చాంద్‌పాటిల్‌తో కలసి పెళ్ళి బృందం వెంటరాగా, మహల్సాపతి బాబాను ఆవో (రా)సారుూ అనిపిలిచాడట. అంతే అప్పటినుండీ బాబావారికి సారుూ అన్న పేరు శాశ్వతమైపోయింది. కొందరు బాబావారిని విఠలనాధుని అవతారంగా భావించి సాయినాథా అని పిలవడం ప్రారంభించారు కూడా.
ఖండోబా ఆలయానికి సాయిబాబావారు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారు. తన భక్తుడైన ఉపాసినీ మహరాజ్‌ను బాబా నాలుగు సంవత్సరాలపాటు ఖండోబా ఆలయంలోనే వుండమని ఆదేశించటం ఆ ఆలయానికున్న ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది. ఖండోబా ఆలయం ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా వుంటుంది. గర్భగుడిలో మూల విరాట్ ఖండోబానే. ఇప్పటికీ ఈ ఆలయంలో శిరిడీసాయి, మహల్సాపతి విగ్రహాలు కూడా వున్నాయి. యాత్రకులందరూ- ఈ ఆలయాన్ని సందర్శించి తమ యాత్ర సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. కొందరు ఖండోబాని మార్తాండ భైరవుడనీ, మల్హరీల పేరిట కూడా భక్తులు కొలుస్తూ వుంటారు. యోధులు ఖండోబాని శివుని రూపంలో ధ్యానించి అర్చిస్తారు. ఖండోబా ప్రసక్తి వైష్ణవ, జైన సంప్రదాయాల్లో కూడా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో మల్లన్నగానూ, కర్నాటకలో మల్హరగానూ భక్తులు పరిగణిస్తారు. ఖండోబాకు ఇద్దరు భార్యలట. ఒకరు మహల్సా కాగా మరొకరు బేనీ. ఖండోబాను శివుడిగా వించి కొలుచేవారని చెబుతారు. ఖండోబా ఆ ప్రాంత ప్రజలకు పెన్నిధి. దుష్టుల పాలిట సంహారకుడిగా వాళ్ళు భావిస్తారు. శిరిడీలోని ఖండోబా ఆలయాన్ని సందర్శిస్తే ప్రశాంతత కలుగుతుంది. అందుకేనేమో సాయిబాబావారు భక్తులను ఖండోబా ఆలయాన్ని దర్శించమనేవారు.

--డా.పులివర్తి కృష్ణమూర్తి