Others

పండుటాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు
ముంగిట్లో కూచోబెడితే
ఇంటిని కాచే ఈశ్వరుడు
బతుకుబాటలో గతుకుల్ని
ముందుగా హెచ్చరించి
కాపాడే సిద్ధుడు వృద్ధుడు
వృద్ధులు సారధులైతే
యువకులు విజయులౌతారు
అనుభవాల గనులు ఆపాత బంగారాలు
ఆవేశానికి అనుభవం తోడైతే
జీవన యానం సురక్షితం కాదా!
వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు
చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం
మూడుకాళ్ల ముసలివాడు
తగిన గుర్తింపునిస్తే
విజయాన్నిచ్చే త్రివిక్రముడు
ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు
తనను పట్టించుకోకున్నా
నువ్వు పచ్చగా ఉండాలని తపించే
ఉదాత్తుడు వృద్ధుడు
పలకరిస్తే చాలు
పాలకడలిలా పొంగులు వారే
పసివాడు వృద్ధుడు
వృద్ధుడంటే పైపైన చూస్తే
జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు
అంతర్గతంగా
ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పగల
తలపండిన పండితుడు
వృద్ధుడంటే కాటికి కాళ్లు జాపుకున్న వాడే కాదు
కడ ఊపిరి దాకా
నీ శ్రేయస్సు కోరేవాడు కూడా
పండుటాకై రాలి నీ పాదాలను ముద్దాడే
మమతల పృథుచిత్తుడు వృద్ధుడు

- చిరమన వెంకట రమణయ్య సెల్ నెం.9441330336