Others

బంధంలో భద్రత ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువైన రవీంద్రుడు గుడికి వెళ్ళి సంప్రదాయ ప్రార్థనలు ఎప్పుడూ చెయ్యలేదు. అంతమాత్రాన ఆయనను ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వ్యక్తిగా పరిమితం చెయ్యడం ఏమాత్రం సమంజసం కాదు. ఆయన విశ్వజనీనుడు.
‘‘మీరెప్పుడూ గుడికి వెళ్ళలేదు, ధర్మగ్రంథాలు చదవలేదు. అయినా ధార్మికతను, ఆధ్యాత్మికతనుచాటే మీ మాటలు మమ్మల్ని కట్టిపడేస్తున్నాయి. అదెలా సాధ్యం’’అని ఆయనను అందరూ ఎప్పుడూ అడిగేవారు. అందుకు ఆయన అందరితో ‘‘అవును. ధర్మగ్రంథాలను నేను ఇష్టపడను.
అందరి పరిస్థితి అలాగే వుంది. ఆకాశంలో విహంగంలా హాయిగా, స్వేచ్ఛగా ఎగురుతూ సుదూర తీరాలలోని నక్షత్రాలను చేరుకోవాలనే కోరిక లేనివాడు ఎవడూ ఉండడు. కానీ, ఈ భూమితో గాడమైన అనుబంధముందని, తన మూలాలు ఈ భూమిలో పాతుకుపోయాయని అతనికి తెలుసు. అలా అతడు అనుబంధాల బంధనాలలో చిక్కుకున్నా స్వేచ్చను ఆశిస్తాడు. అదే అతనిలోని ద్వంద్వ మనస్తత్వం. అలా అతడు తనకు తానే వ్యతిరేకిగా విభజించబడ్డాడు.
ప్రాపంచిక బంధాలే అసలైన బాధలు. అవే మీ జీవితానికి అడ్డంకులుగా తయారవుతాయి. అయినా వాటినుంచి మీరు బయటపడలేరు. ఎందుకంటే, అవే మీ ప్రాణం, మీ ఆనందం. ఒకరకంగా అవి మీ హోదాకు పుష్టినిస్తాయి. అందుకే వాటిని మీరు వదలలేరు, మర్చిపోలేరు. ఎందుకంటే, మీరు ఎప్పుడూ వాటి గురించే కలలు కంటూ, ఆ కలలలో ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటారు.
నాకు స్వేచ్ఛ కావాలి.
కానీ, అది కావాలనుకున్నపుడల్లా నాకు సిగ్గుగా ఉంది..
స్వేచ్ఛను ఆశించేందుకు ఎవరైనా ఎందుకు సిగ్గుపడాలి? కావాలనుకుంటే, ఇప్పుడే, ఈ క్షణంలోనే మీరు స్వేచ్ఛగా ఉండగలరు. ఎందుకంటే, మిమ్మల్ని అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు. కానీ, అనుబంధాల బంధనాలు మిమ్మల్ని గట్టిగా కట్టిపడేశాయి. అవి మిమ్మల్ని బాధపెడుతున్నా, అప్పుడప్పుడు అవి మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. అలాగే అవి మీ కాళ్ళను బంధించినా, అప్పుడపుడు మిమ్మల్ని నాట్యమాడనిస్తాయి.
భూమిలో నాటుకుపోయిన మనం ఆకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగరాలనుకుంటాం. కానీ, భూమినుంచి మనం బయటపడలేం. ఎందుకంటే, అదే మన ఆహారం, అదే మన జీవశక్తి. అలాగని, మనం ఆకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగరాలనే కలలు కనడం మానం, మానలేము. ఎందుకంటే, అదే మన ఆత్మ, అదే మన చైతన్యం. మనల్ని మనుషులుగా మలచింది అదే. తెలివైన వారందరూ ఇలాంటి వింత పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.
జంతువులు ఎప్పుడూ మానసికంగా క్షోభించవు. ఎందుకంటే, వాటి తీరులో అవి ఎప్పుడూ పూర్తి సంతృప్తితో ఉంటాయి. అదే వాటి సహజ లక్షణం. కానీ, ఎప్పుడూ అసంతృప్తితో మానసికంగా క్షోభిస్తూ జీవించే జంతువు మనిషి ఒక్కడే. అందుకే మనిషి ప్రతిదానికీ ఎప్పుడూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే, తాను స్వేచ్ఛగా ఉండగలడని అతనికి తెలుసు.
నాకు ఈ కథ చాలా ఇష్టం..
‘‘కొండలపై ప్రయాణిస్తున్న ఒక స్వాతంత్ర సమరయోధుడు మార్గమధ్యంలో ఉన్న బిడారుల భవంతిలో ఒక రాత్రి విశ్రమించాడు. ఆ భవంతిలోని బంగారు పంజరంలో వున్న చిలక ఆ రాత్రంతా ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అంటూ అరుస్తూనే వుంది. రోజంతా అలా అరవడం దానికి ఎప్పుడూ అలవాటే. కానీ ఆ విషయం తెలియని ఆ స్వాతంత్ర సమరయోధుడు అర్థరాత్రి లేచి పంజరం తలుపు తీసి ‘అందరూ నిద్రపోతున్నారు. వెంటనే బయటకు ఎగిరిపో’ అన్నాడు ఆ చిలుకతో. అయినా ఆ చిలుక బయటకు వెళ్లకుండా పంజరంలోనే ఉంది. ‘‘పాపం దీనికి పారిపోవడం కూడా తెలియదు’’ అని మనసులో అనుకుంటూ, మెల్లగా ఆ చిలుకను పంజరం నుంచి బయటకు తీసి ఆకాశంలోకి విసిరేసి ‘‘హమ్మయ్య, ఒక ఆత్మకు స్వేచ్ఛ కలిగించాను’ అనే భావనతో తృప్తిగా నిద్రపోయాడు. తెల్లరింది. ‘స్వేచ్ఛ స్వేచ్ఛ’ అనే ఆ చిలుక అరుపులు అతనికి మళ్లీ వినిపిస్తున్నాయి. ‘‘ఏ చెట్టుమీదో కూర్చుని అలవాటుప్రకారం అలా అరుస్తోందిలే’’ అని భావిస్తూ లేచిన అతనికి ఎదురుగా పంజరంలో వున్న చిలుక కనిపించింది. పంజరం తలుపు తెరిచే ఉంది’’.
ఈ కథలో ఎంతో వాస్తవముంది. మీరు స్వేచ్ఛగా ఉండాలనుకోవచ్చు. కానీ, పంజరంలో కొన్ని భద్రతలకు హామీ ఉంటుంది.
*
--------------------------------------------------------
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.