Others

అసురనాశిని ఆదిపరాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమాతా శ్రీమహారాఙ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా
- అంటూ అమ్మను ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మను ఆరాధించడం భారతీయ సంప్రదాయం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలవారు అమ్మను ఆరాధించడానికి నవరాత్రులనే శుభ రాత్రులుగా ఎంచుతారు. సకల సృష్టికి మూల కారణమైన అమ్మ సర్వ సంపదలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అమ్మ అష్టాదశపీఠాల్లో నెలకొని తన బిడ్డలందరినీ చల్లగా కాపాడుతుంది. శరన్నవ రాత్రుల్లో తొమ్మిది రూపాలతో తొమ్మిది రకాలుగా పూజించబడుతుంది. అన్ని దేవాలయాల్లో శరన్నవ రాత్రులను విశేషపూజాదికాలు చేస్తుంటారు.
కొందరు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే మరికొందరు అమ్మను బొమ్మల కొలువుల రూపంలో పూజిస్తారు. మరికొందరు బాలా, త్రిపుర అంటూ తొమ్మిది మంది కన్యలను కుమారీపూజతో పూజిస్తారు. మరికొందరు అమ్మను కుంకుమార్చనలతోను, సహస్రనామా లతోను పూజిస్తారు. సాయం సంధ్యావేళ అమ్మ తమ ఇండ్లకు వస్తుందని ముతె్తైదువలను, చిన్నారి కన్యలను పిలిచి వారికి పండుతాంబూలాలు పసుపుకుంకుమ గంధమాక్షితలు ఇచ్చి గౌరవిస్తుంటారు. ఆకలికి అలమటించేవారి కి అన్నపూర్ణయై ఆకలితీర్చినా, జ్ఞానార్జనకు తంటాలు పడేవారికి గాయత్రియై జ్ఞానాన్ని , సరస్వతియైసకల విద్యాలను ప్రసాదించినా, అన్నింటా విజయం కలగాలని దీవించడానికి రాజరాజేశ్వరియై కదలి వచ్చినా అమ్మనే ఆదిపరాశక్తినే. అందుకే ‘మాతాచ పార్వతీదేవి’ అంటాం. భుక్తి ముక్తి ప్రదాయిని. జ్ఞానప్రదాయిని అమ్మే. విశాల, కల్యాణి, అయోధ్య, ధారా, మధుర, భోగవతి, అవంతి, విజయ అనే ప్రసిద్ధ నగరాల్లో దేవి నెలకొని విశాలమైన దృష్టిని కలిగి కల్యాణకరంగా జయంచశక్యం గాని శక్తి తన కృపారసంతో తల్లి ప్రసాదిస్తుంది. అంతేకాక ఆ తల్లిని కొలిచినవారు మూగవారైనా వారికి మధురమైన మాటలు మాట్లాడేటట్టు చేస్తుంది. సర్వభోగకారకాలను అమ్మ సర్వత్రా విజయం లభించేట్టు చేసి మరీ అనుగ్రహిస్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో వీధి కూడల్లో అమ్మవారిని నిలిపి పూజించినా ఇటువంటి నగరాల్లో తల్లిని దర్శనం చేస్తే అపారమైన పుణ్యరాశి లభ్యమవుతుందని పెద్దలు చెబుతారు.
లోకాలను నాశనం చేస్తూ సజ్జనులు అల్లకల్లో లం చేసి వారిని హింసించే రాక్షస మూకను సంహరించడానికి ఆదిపరాశక్తి నవరూపాలను ధరించింది. ఆ రాక్షస గణాలను తుదముట్టించింది. అందుకే ఆ తల్లిని శరన్నవరాత్రుల్లో ఆ నవరూపధారిణిగా కొలుస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఆ తల్లికి తొమ్మిది రూపాలను ధరింపచేసి విశేషపూజలు చేస్తారు. ‘సురవర వర్షిణి, దుర్ధరధర్షిణి, దుర్ముఖిమర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర తోషిణి, కల్మషమోచని ఘోరరతే దనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధునుతే... జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే...’’- మహిషాసుర మర్దినీ నమస్తే నమస్తే అంటూ ఆతల్లిని సర్వులూ ఈ శుభరాత్రుల్లో పూజించాలి. స్తుతించాలి. అనేకశుభాలను పొందాలి.

- కూచిబొట్ల వెంకట సుబ్బలక్ష్మి