Others

ప్రశ్నిస్తేనే జ్ఞానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి జ్ఞానానికి మూలం. గణితంలో చాలా కానె్సప్ట్స్ ప్రకృతి నుంచే తీసుకున్నారు. గణితానికి, సైన్స్‌కు అన్యోన్య సంబంధం ఉంది. అందుకే గణితాన్ని ‘సైన్స్‌కు కావాల్సిన వాఙ్మయం’ అంటారు. సైన్స్‌కు ప్రయోగం ప్రధానం. పిల్లవాడు- ‘నాన్నా.. ఆ నీడ సూర్యుడు పెరిగిన కొద్దీ పెరుగుతోంది ఎందుకు?’ అని ప్రశ్నిస్తాడు. ఒక వ్యక్తి నల్లగా, మరో వ్యక్తి ఎర్రగా ఎందుకు పుట్టారని మరో విద్యార్థి అడుగుతాడు. పిల్లలు వేసే ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు మనల్ని ఇరుకున పెడతాయి. సైన్స్ శైశవ దశనుంచే మొదలౌతుంది. అందుకే యశ్‌పాల్ కపూర్ అనే విద్యావేత్త అక్షరం కన్నా ముందుగా ప్రకృతి పాఠాలు, పరిసరాల పాఠాలు చెప్పమన్నాడు. పరిసరాల జ్ఞానాన్ని బాల్యం నుంచే చెప్పవలసిన స్థితి వచ్చింది. రైట్ బ్రదర్స్‌కు గాలిలో విమానం ఎట్లా ఎగురుతుందో చెప్పే స్థితి రావటానికి కారణం భూమ్యాకర్షణశక్తి కారణం కాదా? సైన్స్‌ను పాఠశాలలోనే కాక, ఇంటి దగ్గర తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పవలసి వచ్చింది.
చంద్రుడు, సూర్యుడు ఎందుకు గుండ్రంగా కనిపిస్తారని పిల్లలు ప్రశ్నిస్తారు. వెనకటి రోజుల్లో కథలలో చంద్రుని స్వరూపం మారటానికి తల్లి కారణాలు చెప్పేది. ఈనాడు తల్లి కూడా చదువుకున్నది కాబట్టి ఎందుకు చంద్రుని స్వరూపం మారుతుందో శాస్ర్తియంగా చెప్పవలసి వస్తుంది. ప్రశ్నించేతత్వం మనిషికి పుట్టుకతో వచ్చిన లక్షణం. అదే జ్ఞాన సముపార్జనకు కారణం. సైన్స్‌కు కేజీ స్కూల్ నుంచే చెప్పవలసిన కాలం వచ్చింది. కాబట్టే గణితాన్ని, సైన్స్‌ను అక్షరం కన్నాముందే ఆరంభించాల్సి ఉంది. ప్రకృతిలో ఒక క్రమం ఉన్నది. వర్షాకాలం, చలికాలం, ఆ తర్వాత ఎండాకాలం వస్తుంది. వర్షం రా గానే పిల్లవాడు గొడుగు తెమ్మంటాడు. చలికాలం రాగానే దుప్పటి తెమ్మంటాడు. ఈ భావననే గణిత శాస్తజ్ఞ్రులు తమ భాషలో చూపించారు. అందుకే 2,4,6,8 అనేవి సరిసంఖ్యలు. 1,3,5 అనేవి బేసి సంఖ్యలు. గణితంలో ఇదొక క్రమం కనిపిస్తుంది.
గణితం ఊహించిన విషయాన్ని కూడా చెప్పగలుగుతుంది. రెండు సంఖ్యల మధ్యన అనంతమైన సంఖ్యలు ఉంటాయని చెప్పటం అంటే గణిత శాస్తవ్రేత్త అనంతంగా ఊహించగలగాలి. అందుకే గణిత శాస్తవ్రేత్తని ఫిలాసఫర్ అంటారు. ఊహించే విషయాన్ని కూడా చెప్పాలి. నేటి విద్యార్థికి ఊహలు ఎక్కువ. ఆ ఊహలే కొత్త జ్ఞానానికి బాటలు వేస్తాయి. దానినుంచే వాఙ్మయం పుడుతుంది. మబ్బులను చూసి కాళిదాసు మేఘసందేశం కావ్యం రాశాడు. సైన్స్, గణితం, భాష ఇవి వేరే వేరే కంపార్ట్‌మెంట్స్ కావు. జ్ఞానమనే దండకు ఇవన్నీ పూలలాంటివి. ఇందులో ప్రశ్న అనేది దారం. ఆ దారమే పూలను కలిపి జ్ఞానదండగా మారుస్తుంది. ప్రశ్నను అణచివేస్తే జ్ఞానవృద్ధి ఆగిపోతుంది.
నా క్షమాపణ...
నేను చికాగో యూనివర్సిటీకి వెళ్లినప్పుడు విద్యాశాస్తవ్రేత్త హైమ్ గీనాట్‌ను కలిశాను. ఆయన చెప్పిన ఓ వాక్యాన్ని రాసిపెట్టుకున్నాను. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ విధంగా మాట్లాడతారో దాన్నిబట్టి నా భావనలు వారికి అర్థమవుతాయి. నా గురించి వారి అభిప్రాయాలు తెలుస్తాయి. ఉపాధ్యాయుడు వాడే భాషే విద్యార్థి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని రూపొందిస్తుంది’ అని ఆయన అంటారు. ఈ విషయం విన్నాక నాకళ్లు తెరుచుకున్నాయి.
కొడుకునైనా, శిష్యుడినైనా పొగిడితే వాళ్ల ఆయుష్షు తక్కువ అవుతుందని చిన్నప్పుడు నాకు కొందరు చెప్పారు. చికాగోకు వెళితే గీనాట్ చెప్పింది విన్నాక నేనెంత మారవలసిందో నాకర్థమైంది. నా ప్రవర్తనపైన నాకే పశ్చాత్తాపం కలిగింది. అపుడు నేను ఆ ప్రొఫెసర్‌ను అడిగాను- ‘మీ ఉద్దేశం సరైనదే కావచ్చును. మీ విమర్శ, మీ మాటలతో పిల్లల ఆలోచన ఎంత కుదించుకుపోతుందో ఎప్పుడైనా ఆలోచించామా?’ అని.
పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉపయోగించే భాష వారికి తమపై విశ్వాసాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలతో మనం మాట్లాడే భాషే వారి సంకల్పాన్ని, దీక్షను ఇనుమడింపచేస్తుంది. టీచర్లు, తల్లిదండ్రులు ఎంతటి పరుషభాష ఉపయోగిస్తే పిల్లల మానసిక వైఖరిలో మొండితనం వస్తుంది. పిల్లల ప్రవర్తన మార్చాలంటే వాళ్ల మనోభావాలను గౌరవించాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుంది. చికాగోలో హైమ్ గీనాట్‌తో మాట్లాడిన తర్వాత నన్ను నేను సంస్కరించుకున్నాను. కేజీ స్కూళ్లు పిల్లల కోసమే కాదు, పెద్దల కోసం కూడా ఉపయోగపడతాయి. ఈనాటి పిల్లల మానసిక స్థితి గత తరం మానసిక స్థితి కాదు. మనది ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చిన భావన. దీనిపై ఎంతో పరిశోధన జరిగింది. ప్రతి యూనివర్సిటీలో పిల్లల మానసిక స్థితిపై జరిగిన పరిశోధనలను ప్రచారం చేస్తున్నారు. కేజీ స్కూలు చిన్నారులకే కాదు, గత తరపు సంస్కృతిలో మునిగిన వారికి కూడా అది పాఠాలు నేర్పుతుంది.

-చుక్కా రామయ్య