Others

‘ప్రత్యేక హోదా ప్రతిపత్తి’లో వాస్తవాలు ఇవీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాడు బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించేటప్పటికి అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టి వస్తుందని’. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రచార మాధ్యమాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చేసిన ప్రచారం- చర్చిల్ వ్యాఖ్యలకు అక్షరాలా అద్దం పడుతుంది. మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను వక్రీకరించి 14వ ఆర్థిక సంఘం నివేదిక తరువాత జరిగిన పరిణామాలను విస్మరిస్తూ ఈ ప్రచారం జరిగింది. రిపోర్టులో ఒకటి వ్రాసి, ఆ పైన మరొక విధంగా వ్యాఖ్యానించిన కొందరు ఆర్థిక సంఘం సభ్యులు కూడా ఈ ప్రచారానికి ఊతం కల్పించారు.
ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ముందు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పార్లమెంటులో ఎటువంటి ప్రకటన చేశారో ఒకసారి పరిశీలిద్దాం. వారి ప్రకటన ఈ కింది విధంగా ఉంది.
కేంద్ర సహాయం కోసం ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐదు సంవత్సరాలు వర్తింప చేస్తాము. దీనివలన రాష్ట్ర ఆర్థిక వనరులు బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇది మొదటి పేరాగ్రాఫ్. ఇక రెండవ పేరాగ్రాఫ్‌లో పరిశ్రమ రాయితీలు గురించి ఈ కింది విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక రాయితీలను, పన్ను రాయితీలను పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా ఈ రెండు రాష్ట్రాలకు ఈ రాయితీలను అందజేస్తాం.
మన్మోహన్ సింగ్ చేసిన ఈ ప్రకటనను పరిశీలిస్తే రెండు విషయాలు అర్థమవుతాయి. ప్రత్యేక హోదా మొదటి పేట గ్రాఫ్ కేవలం ఆర్థిక సహాయానికి పరిమితమైంది. ఎక్కడా పన్నుల రాయితీలను గురించి పేర్కొనలేదు. ఇక రెండో పేరాగ్రాఫ్ లో పేర్కొన్న పన్ను రాయితీలు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయి, కేవలం ఆంధ్ర ప్రదేశ్ కాదు. కనుక ఆయన ప్రకటనకు అనుగుణంగా ప్రత్యేక హోదాలో భాగంగా పరిశ్రమలకు పన్నులు విధించకుండా వెసులుబాటు కల్పిస్తారు అనుకోవటం మధ్యలో కొందరు కల్పించిన వక్రభాష్యం తప్పితే ఆయన ప్రకటనలో అటువంటి హామీ ఎక్కడా లేదు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కొన్ని పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికి ఇప్పటికే ఇచ్చింది. ఇక ప్రత్యేక హోదా పూర్వాపరాలను పరిశీలిద్దాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఆర్థిక సహాయం అందించటం కోసం 1969 సంవత్సరంలో మొదలు పెట్టబడింది. దీనిలో భాగంగా ఏనాడు ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు కల్పించలేదు. ఒక ప్రత్యేక స్కీమ్ ద్వారా పన్ను రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు 28 సంవత్సరాల తర్వాత 1997 సంవత్సరంలో కల్పించడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు ఒకే తడవ కాకుండా వివిధ సంవత్సరాల్లో ఈ రాయితీని వివిధ రాష్ట్రాలకూ వర్తింప చేశారు. కనుక ప్రత్యేక హోదాలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు వస్తాయి.. అని జరిగిన ప్రచారం వాస్తవ విరుద్ధం.
ఇక 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఉన్న పరిస్థితిని పరిశీలిద్దాం. 14వ ఆర్థిక సంఘం చాలా స్పష్టంగా పేరాగ్రాఫ్ 2.29లో- తాము ప్రత్యేక హోదా రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాలకు మధ్య వారి సిఫార్సులు నిబంధన విషయంలో ఎటువంటి తేడా చూపలేదని పేర్కొంది. తదనుగుణంగానే వారు తమ సిఫార్సులను చేయడం జరిగింది.
14వ ఆర్థిక సంఘంలో సభ్యులైన అభిజిత్ సేన్ ఆర్థిక సంఘం సిఫార్సుల తో ఏకీభవించకుండా తన అభిప్రాయాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరిచారు. అందులో ఆయన ఐదు అంశాల విషయంలో ఇతర ఆర్థిక సంఘాలకు భిన్నంగా 14వ ఆర్థిక సంఘం తన అభిప్రాయాలను వెల్లడించిందని పేర్కొన్నారు. అందులో ఒకటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాలకు మధ్య గల బేధాన్ని తొలగించటం. ఈయన ఇచ్చిన ఈ భిన్న అభిప్రాయానికి మిగిలిన సభ్యులు అందరూ తమ వివరణను నివేదికలో పొందుపరిచారు. అందులో ఎక్కడా ఆయన ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, మిగిలిన రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తున్నామని పేర్కొన్న అంశాన్ని వారు ఖండించలేదు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనాడు ప్రత్యేక హోదా కావాలని కోరుకోవటం లేని, రాని అంశం కోసం ఆశించడమే.
ఇక ఈనాడు ఈశాన్య రాష్ట్రాలలో నెలకొని ఉన్న విధానాన్ని పరిశీలిద్దాం. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పరిచిన తరువాత 14 ఆర్థిక సంఘం లో రాష్ట్రాల వాటా కేంద్ర పన్నుల్లో 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాల హేతుబద్దీకరణకు ప్రభుత్వం ముఖ్యమంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం సిఫార్సుల మేరకు ఏ యే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా రాష్ట్ర వాటా ఎంత ఉండాలి అనేది నిర్ణయించడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇది 90 :10 నిర్ణయించారు.
పారిశ్రామిక రాయితీలు పరిశ్రమ శాఖ ఉత్తర్వుల ద్వారా ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు కొనసాగుతున్నాయి. తదనుగుణంగా ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం కొనసాగుతున్నది కానీ ప్రత్యేక హోదా లో భాగంగా కాదు. ఇదే స్థాయిలో ఆర్థిక సహాయాన్ని మరియొక పేరుతో ప్రత్యేక ప్యాకేజీ కింద మనకు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఎఫ్‌ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించాలని కోరటంతో దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను (special purpose vehicle) ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రానికి కలిగే అదనపు వెసులుబాటు 16,400 కోట్ల రూపాయలు. ఈశాన్య రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలు పెట్టుకునే వాటాను కూడా కలిపి చూపించారని అది తొలగిస్తే ఇది 12,500 కోట్లను మించదనేది కేంద్రం వాదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుని రాజకీయ లబ్ధి కోసం లేని ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టడం మొదలెట్టింది. ఇది స్థూలంగా ప్రత్యేక హోదా విషయంలో కల్పిత మిథ్య వాస్తవాలకు మధ్య ఉన్న దూరం.

-- ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com